ఇసిస్ బూచిగా ఫ్రాన్స్ లో కార్మిక వ్యతిరేక సంస్కరణలు

ప్యారిస్ ఉగ్రవాద దాడుల మాటున నల్ల చట్టాలకు పదును పెట్టుకున్న అధ్యక్షుడు ఫ్రాంస్వా/ఫ్రాంషా ఒలాండ్ ఆ వెంటనే కార్మిక చట్టాలను నీరుగార్చే పనిలో పడ్డాడు. ఫ్రాన్స్ చరిత్రలో అత్యంత అప్రతిష్ట మూట గట్టుకున్న అధ్యక్షుడిగా ఇప్పటికే కీర్తి ప్రతిష్టలు ఆర్జించిన ఫ్రాంస్వా ఒలాండ్ తాజాగా తాలపెట్టిన కార్మిక చట్టాల సంస్కరణలపై ప్రజల నుండి ప్రతిఘటనను ఎదుర్కొంటున్నాడు. ఫ్రాన్స్ ప్రభుత్వ ప్రతిపాదించిన కార్మిక సంస్కరణలకు వ్యతిరేకంగా మార్చి రెండవ వారం నుండి ఫ్రాన్స్ నగరాలలో కార్మికులు, విద్యార్ధులు క్రమం…