బ్రిక్స్ సమావేశాలు: నూతన అభివృద్ధి బ్యాంకు ఆవిర్భావం

జులై 16 తేదీన ముగిసిన బ్రిక్స్ కూటమి శిఖరాగ్ర సమావేశాల అనంతరం సభ్య దేశాధినేతలు చేసిన ప్రకటనతో ‘నూతన అభివృద్ధి బ్యాంకు’ (న్యూ డెవలప్ మెంట్ బ్యాంకు) లాంఛనప్రాయంగా ఉనికిలోకి వచ్చింది. బ్యాంకుకు తుదిరూపు ఇస్తూ ఐదు వర్ధమాన దేశాల కూటమి బ్రిక్స్ (బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా) శిఖరాగ్ర సమావేశాలు బ్రెజిల్ నగరం ఫోర్టాలెజా లో ముగిశాయి. గత సంవత్సరం దక్షిణాఫ్రికా నగరం దర్బన్ లో జరిగిన సమావేశాలలో నిర్ణయించినట్లుగానే బ్రిక్స్ కూటమి…