విశ్వమానవుడి రోజువారీ జీవనం, జీవితం -ఫొటోలు

వివిధ దేశాల్లో ప్రజల రోజువారీ జీవనాన్ని, ప్రజా జీవితంలోని వివిధ కోణాలనూ పట్టిచ్చే అరుదైన ఫొటోలివి. ముఖ్యంగా ప్రజల సాంస్కృతిక జీవనాన్ని ఈ ఫోటోలు ప్రతిబింబిస్తున్నాయి. ప్రజల ఆర్ధిక స్ధితిగతులను బట్టే వారి సంతోషాలు, బాధలూ నిర్ణయం అవుతుంటాయి. ఫోటోలన్నీ దాదాపు పాజిటివ్ కోణాన్ని ప్రతిబింబిస్తున్నప్పటికీ అక్కడక్కడా కొన్ని తేడాలు లేకపోలేదు. ఆర్ధిక బలిమి కలిగిన వర్గాల ప్రజల జీవనంలో సౌకర్యం, సంతృప్తి, ఆనందం, కొత్తదనం కనిపిస్తే శ్రమ అనివార్యం అయిన వర్గాల్లో శ్రమల అనివార్యతల్లోనే సంతృప్తి,…

నేషనల్ జాగ్రఫిక్ ట్రావెలర్ 2012 ఫోటో పోటీలు -ఫోటోలు

‘నేషనల్ జాగ్రఫిక్ ట్రావెలర్’ మ్యాగజైన్ (National Geographic Traveler) వారు 2012 సంవత్సరానికి గాను నిర్వహించిన పోటీల్లో గెలుపొందిన ఫొటోలివి. 152 దేశాలకు చెందిన 6,615 మందికి పైగా ఫోటో గ్రాఫర్లు 12,000 కి పైగా సమర్పించిన ఎంట్రీలనుండి విజేతలను నిర్ణయించారరని మ్యాగజైన్ వెబ్ సైట్ తెలిపింది. ఆఫ్ఘనిస్ధాన్ నుండి వియత్నాం వరకూ తీసిన ఈ ఫొటోల్లో ప్రశాంత ల్యాండ్ స్కేప్ దృశ్యాలనుండి యాదృచ్ఛిక సంఘటనల వరకూ అన్ని రకాల దృశ్యాలనూ పరిగణించారట. మొత్తం మీద చూస్తే…

పవర్ గ్రిడ్ విఫలమై విద్యుత్ సరఫరా ఆగిపోతే… -ఫోటోలు

ఉత్తర భారతంలో నెల రోజుల క్రితం విద్యుత్ సరఫరా ఆగిపోయి జన జీవనం స్తంభించినప్పటి ఫొటోలివి. జులై 30, 31 తేదీల్లో ఉత్తర భారత దేశంలోని ఏడు రాష్ట్రాల్లో విద్యుత్ సరఫరా ఆగిపోయింది. ఢిల్లీ, పంజాబ్, హర్యానా, రాజస్ధాన్, ఉత్తర ప్రదేశ్, ఉత్తరఖండ్, హిమాచల్ ప్రదేశ్, జమ్ము కాశ్మీర్ రాష్ట్రాలలో సరఫరా దెబ్బతిని అంధకారం నిండిపోయింది. రాజధాని, శతాబ్ది, దురంతో లాంటి సూపర్ ఫాస్ట్ సర్వీసులతో పాటు 300 కి పైగా రైళ్ళు ఎక్కడివక్కడే నిలిచిపోయాయి. జులై…

సిక్కింలో ఋతుపవనాల సొబగులు చూసి తీరాలి -ఫొటోలు

రుతుపవనాలు సిక్కింలోని ప్రకృతికి అద్దిన అందాలను ఈ ఫొటోలు అద్భుతంగా ప్రతిబింబిస్తున్నాయి. అర్జెంటుగా ఈ ఫొటోలు తీసిన గ్యాంగ్ టక్ కి పరిగెత్తుకెళ్ళి అక్కడే ఉండిపోవాలనిపిస్తోంది. ఫొటోగ్రఫీని మనమూ హాబీగా ఎందుకు చేసుకోకూడదు? అని కూడా అనిపిస్తోంది. ఫొటోల్లోని మూడ్ చూస్తే మత్తుగా, మంగుగా, బద్ధకంగా కనిపిస్తున్నప్పటికీ వర్షం కురిసి వెలిసినప్పటి చురుకుదనం ఆ మత్తుని తరిమికొడతానని సవాలు చేస్తున్నట్లుగా ఉంది. విద్యుత్ దీపాల కృత్రిమ వెలుగులకి సహజత్వాన్ని ఇస్తూ, రాత్రి దుప్పటిలోకి కూడా చొరబడి తానున్నానని…

ఇదీ ఇండియా -యాహూ ఫొటోలు పార్ట్ 2

యాహూ వార్తల వెబ్ సైట్ దేశంలోని ఫోటో గ్రాఫర్ల నుండి ‘ఇదీ ఇండియా’ అంశంపై ఫోటోలను ఆహ్వానించింది. వాటిలో కొన్ని ఎన్నుకుని ప్రచురించింది. బ్లాక్ అండ్ వైట్ ధీమ్ లో ఉన్న ఆ ఫోటోలే ఇక్కడ కూడా. — —