సోనీ ప్రపంచ ఫోటోగ్రఫి పోటీ -ఫోటోలు

సోనీ ప్రపంచ ఫోటోగ్రఫీ పోటీల ఫలితాలను వారం రోజుల క్రితం ప్రకటించారు. ప్రస్తుతానికి మూడు విభాగాల ఫలితాలను విభాగాల వారీగా ప్రకటించారు. మూడు కేటగిరీలకు (ఓపెన్, యూత్, నేషనల్) గానూ ప్రపంచం నలుమూలల నుండి ఎంట్రీలు వచ్చాయి. మూడు విభాగాలకు కలిపి మొత్తం 70,000 ఎంట్రీలు వచ్చాయని నిర్వాహకులు తెలిపారు. మొత్తం మీద (ఓవరాల్) విజయులు ఎవరో ఏప్రిల్ 30 తేదీన మాత్రమే ప్రకటిస్తారు. ఈ లోపు వివిధ విభాగాలలో గెలుపొందిన వారి వివరాలు ప్రకటించారు. అనేక…

ప్రపంచంలో అతి పెద్ద ఒంటెల పండగ -ఫోటోలు

అతి పెద్ద ఒంటెల పండగే కాదు, అతి పెద్ద పశువుల పండగ కూడా కావచ్చిది. రాజస్ధాన్ లో కార్తీక మాసంలో పుష్కర్ సరస్సు ఒడ్డున జరిగే ఈ పండగ/సంతలో దాదాపు 2 లక్షలకు పైగా పాల్గొంటారని అంచనా. 50,000కు పైగా ఒంటెలు ఇందులో పాల్గొంటాయి. భక్తులు పౌర్ణమి సమీపించే కొందీ పుష్కర్ ను సందర్శించే యాత్రికుల సంఖ్య కూడా పెరుగుతూ పోతుంది. పౌర్ణమి రోజు పుష్కర్ లో స్నానం ఆచరిస్తే మంచిదని భక్తుల నమ్మిక. జనమూ, వారితో…

మండేలా: చరితలో చిరకాలం నీ పేరు నిలుచుననీ… -ఫోటోలు

పుట్టిన ప్రతి మనిషి చనిపోక తప్పదు. ఐనా మనిషి దుఃఖించక మానడు. చావు, పుట్టుకలకు అతీతంగా జీవితాన్ని సార్ధకం చేసుకునేవారు చరిత్రలో అనేకులు ఉన్నారు. వారిలో మానవజాతి తలచుకునేది కొందరినే. ఎవరైతే జాతి పురోగతికి మార్గ నిర్దేశకులుగా నిలుస్తారో, ఎవరైతే జాతి మొత్తాన్ని ఏక తాటిపై నడిపిస్తారో వారిని మానవ జాతి చరిత్ర జాతి నేతలుగా రికార్డు చేస్తుంది. అలాంటి గొప్ప నాయకుల్లో నెల్సన్ మండేలా ముందు పీఠిన నిలుస్తారు. జులై 18, 1918 తేదీన ఒక…

ఆఫ్రికన్ సఫారి: అరుదైన జంతు ప్రపంచం -ఫోటోలు

నిన్న మొన్నటి వరకు చీకటి ఖండంగా పిలువబడిన ఆఫ్రికా ఇప్పుడు తనను తాను ప్రపంచానికి చూపుకుంటోంది. జాత్యహంకార అణచివేత నుండి దక్షిణాఫ్రికాను విడిపించిన ఉద్యమానికి నేతగా నెల్సన్ మండేలా ప్రపంచ రాజకీయ యవనికపై 1990లలో అవతరించిననాటి నుండి రువాండా, బురుండి మారణకాండల మీదుగా ‘అరబ్ వసంతం’ పేరుతో ఇటీవల ట్యునీషియా, ఈజిప్టులలో ప్రజా తిరుగుబాట్లు చెలరేగడం వరకు ఆఫ్రికాను అంతర్జాతీయ వార్తల్లో నిలిపాయి. ఇది మానవ ప్రపంచం. కాకులు దూరని కారడవులకు నిలయమైన ఆఫ్రికా దక్షిణ దేశాలు…

ఒళ్ళు జలదరించే విమాన విన్యాసాలు -ఫోటోలు

ప్రపంచంలోని వివిధ దేశాల్లో ఇటీవల రోజుల్లో జరిగిన విమాన ప్రదర్శనల ఫొటోలివి. పక్షిని చూసి అలాగే ఎగరడానికి మొదట్లో తంటాలు పడిన మనిషి చివరికి ఆ పక్షిని దాటిపోయి ఆకాశం మొత్తం ఆక్రమించేశాడు. మనిషి శక్తి, యుక్తులకు సజీవ సాక్ష్యాలుగా నిలిచేవాటిలో విమానాలు బహుశా ముఖ్య స్ధానంలో ఉంటాయేమో. అయితే కానిబాల్స్ తరహాలో స్వజాతి భక్షణ కోసం మనిషి తెగించడంతో ప్రయాణ విమానాలకు తోడుగా యుద్ధ విమానాలు వచ్చి చేరాయి. యుద్ధాలు వస్తే తప్ప పని దొరకని…

ఐనా… … మనిషి మారలేదు -ఫోటోలు

గత మే నెలలో మూడు దేశాల ఆస్ట్రోనాట్ సిబ్బంది సాగించిన 36వ అంతర్జాతీయ విశ్వ ప్రయాణం 166 రోజుల పాటు సాగింది. అమెరికా, రష్యా, ఇటలీలకు చెందిన సిబ్బంది విజయవంతంగా ముగించిన ఈ ప్రయాణానికి ఇంకా జపాన్, కజకిస్ధాన్ లాంటి దేశాలు కూడా సహకరించడం విశేషం. ఇండియాలో కుంకుమ బొట్లతో రాకెట్ ప్రయోగం ప్రారంభం అయితే అమెరికాలో క్రైస్తవ ప్రార్ధనలతో ప్రారంభం అవుతుందని ఈ ఫోటోలు తెలియజేస్తున్నాయి. అభివృద్ధి, మూఢత్వం పెనవేసుకుపోయిన విచిత్రం ఇది. 166 రోజుల…

చదువు: కొందరికి లక్షలతో, అనేకులకు వివక్షలతో…

‘అక్షర లక్షాధికారి’ అని శ్రీశ్రీకి పేరు. అక్షరాలను ఒడుపుగా పట్టుకుని, ఛందోబద్ధ పరిష్వంగాలను వదులించుకుని, లక్షలాది అక్షరాలతో యధేచ్చ ఉరికిపడే జలపాతంలా కవితా ఝరులను సృష్టించినందుకు ఆయనకు ఆ పేరు దక్కింది. ఇప్పుడు అక్షరాలతో లక్షాధికారులు అవుతున్నవారు ఎంతమందో కానీ, లక్షల రూపాయలకు అక్షరాలను అమ్ముకుంటున్నవారికి కొదవలేదు. తమ విద్యార్ధులకు ఇప్పటికీ ప్రభుత్వ బడుల్లోనే విద్యా బుద్ధులు నేర్పిస్తున్న పశ్చిమ దేశాలు మూడో ప్రపంచ దేశాల్లో మాత్రం విద్యను అమ్మి తీరాలని శాసించాయి. డంకేల్ ఒప్పందం ద్వారా,…

స్టిల్ ఫోటోలో కదలిక, వేగం చూప(డ)గలమా? -ఫోటోలు

ఒక కదలికను గానీ, ఆ కదలికలోని వేగాన్నిగానీ పసిగట్టాలంటే కదిలే చిత్రాల -అనగా వీడియో- వల్లనే సాధ్యం అవుతుంది. ఒక స్టిల్ ఫోటోలో అందులోని పాత్రల కదలికను, వేగాన్నీ చూపించాడంటే ఆ ఫోటోగ్రాఫర్ కి బహుశా ఎంతో ప్రతిభ అవసరం అనుకుంటాను. ఫోటోలోని పాత్రలు కదలకుండా ఉన్నప్పటికీ అవి కదులుతున్నట్లుగా, పైగా వేగంగా కదులుతున్నట్లుగా చూపాలంటే కొన్ని మెళకువలు, మరి కొంత టెక్నాలజీ సహాయం తప్పనిసరి అవసరం కావచ్చు.

ఋతు పవన రాగాలు, భరత జీవన విరాగాలు

భారత దేశ ప్రజల బతుకు చిత్రంలో ఋతుపవనాల రంగులకు ఎంతటి ప్రాముఖ్యత ఉన్నదో చెప్పలేము. కేరళలో అడుగుపెట్టి అటు అండమాన్, ఇటు ఉత్తరాఖండ్ ల వరకూ భరత ఖండం అంతా విస్తరించే నైరుతి ఋతుపవనాలైనా, హిమాలయాల చల్లదనాన్ని కారు మబ్బుల ద్వారా దక్షిణాదికి మోసుకొచ్చే ఈశాన్య ఋతుపవనాలైనా భారత దేశంలోని సకల ఉత్పత్తి రంగాలకు జీవ గర్రలు. నీటి పారుదల సౌకర్యం కలిగిన పొలాలకు కూడా ఈ రెండు పవనాలు తెచ్చే వానలే నదులు, రిజర్వాయర్లను నింపి…

గాలి బుడగ జీవితం, ఓటి పడవ జాతకం

“జీవితం బుద్భుద ప్రాయం” అని చెప్పనివారిదే పాపం అన్నట్లుగా ఎందరో చెప్పి పోయారు. కానీ అవేవీ పొట్ట తిప్పలని అరికట్టలేక పోయాయి. పైగా యుద్ధ బీభత్సాలు, సంక్షుభిత ఆర్ధిక వ్యవస్ధల పుణ్యాన ‘కూటి కోసం కోటి కోట్ల… తిప్పలు’ అన్నట్లుగా మారింది పరిస్ధితి. మనిషి కష్టాలు మరింత పెరుగుతున్నాయే గాని తరుగుతున్న పరిస్ధితి లేదు. డెయిలీ లైఫ్ శీర్షికన వివిధ దేశాల నుండి సేకరించి ‘బోస్టన్ గ్లోబ్’ అందించిన ఫొటోలివి. అలవి మాలిన మనిషి కష్టాలతో పాటు…

సిరియా: అంతులేని విధ్వంసం, హత్యాకాండల యుద్ధక్షేత్రం -ఫోటోలు

సామ్రాజ్యవాదం అంటేనే యుద్ధం అన్న లెనిన్ మహాశయుని చారిత్రక ప్రతిపాదన ఎంత వాస్తవమో చరిత్ర అనేకసార్లు రుజువు చేసింది. సిరియా అందుకు తాజా రుజువు. అమెరికా, ఐరోపా రాజ్యాల వనరులు, మార్కెట్ల దాహానికీ, అంతర్జాతీయ జియో-పోలిటికల్ వ్యూహ ప్రతివ్యూహాల్లో ప్రధాన ప్రత్యర్ధుల ‘ముసుగు యుద్ధానికి’ కేంద్రంగా రక్తం ఓడుతున్న సిరియా, నేటి సామ్రాజ్యవాద యుద్ధ క్షేత్రం. శాంతి విరామం లేని అనంత యుద్ధానికి బహిరంగంగానే నాందీ వాచకం పలికిన జార్జి డబ్ల్యూ బుష్, అమెరికా వాల్ స్ట్రీట్…

పొదుపు విధానాలపై ఆందోళనలతో అట్టుడుకుతున్న యూరప్ -ఫోటోలు

గత రెండున్నర సంవత్సరాలుగా యూరోపియన్ దేశాలు అమలు చేస్తున్న పొదుపు ఆర్ధిక విధానాలు దాదాపు అన్నివర్గాల ప్రజలను వీధుల్లోకి తెస్తున్నాయి. ప్రభుత్వరంగ పరిశ్రమల ప్రవేటీకరణ వల్ల లక్షలాది ఉద్యోగాలు రద్దవుతున్నాయి. ఉద్యోగుల వేతనాల్లో భారీగా కోత విధించారు. పెన్షన్లను కూడా వదలకుండా దోచుకుంటున్నారు. వేతనాలు కోత పెట్టడమే కాకుండా ఉద్యోగులు, కార్మికుల సంక్షేమ సదుపాయాలను కూడా రద్దు చేస్తున్నారు. దానితో ఆరోగ్య భద్రత కరువై వైద్య ఖర్చులు తడిసి మోపెడవుతున్నాయి. ఒకవైపు వేతనాలు తగ్గిస్తూ మరోవైపు పన్నులు…

అమెరికాలో విలయం సృష్టించిన పెను తుఫాను సాండీ -ఫోటోలు

అమెరికా ప్రజలు గుండెలు చిక్కబట్టుకుని ఆందోళనతో ఎదురు చూసిన పెను తుఫాను సాండీ అనుకున్నట్లుగానే పెను విలయాన్ని సృష్టించింది. బోస్టన్ పత్రిక ప్రకారం సాండీ ధాటికి ఏడు రాష్ట్రాల్లో 100 మందికి పైగా మృత్యువాత పడ్డారు. మంగళవారం సాయంత్రానికి అట్లాంటిక్ తీరం వెంబడి 55 మంది చనిపోయారని ‘ది హిందూ’ తెలిపింది. ఐ.హెచ్.ఎస్ గ్లోబల్ ఇన్సైట్ ప్రకారం 20 బిలియన్ డాలర్ల మేరకు ఆస్తి నష్టం జరిగింది. 10 నుండి 30 బిలియన్ డాలర్ల మేరకు వ్యాపార…

ఈ వికలాంగుల్ని చూస్తే స్ఫూర్తి కోసం వెతుక్కోవాల్సిన పని లేదు -ఫోటోలు

ఈ అధ్లెట్లని వికలాంగులని సంబోధించడానికి నిజానికి సిగ్గుపడాలి. కానీ అవధుల్లేని వీరి ఆత్మవిశ్వాసం యొక్క గ్రావిటీని అర్ధం చేసుకోవాలంటే వారి అంగవైకల్యాన్ని రిఫరెన్స్ గా తీసుకోక తప్పదు. కాసిన్ని కష్టాలు చుట్టుముడితేనో, ఆశించిన కాలేజీ సీటో, ఉద్యోగమో దక్కకపోతేనో, నచ్చిన వ్యక్తి భాగస్వామిగా దక్కకపోతేనో, మరింకేదో కష్టం ఎదురైతేనో… జీవితాల చివరి ఘడియల్ని వాటేసుకోవడానికి ఆతృత పడే బలహీన మనస్కులకు ఈ పారా-ఒలింపియన్ల జీవోన్మాదం కనువిప్పు కలిగిస్తుంది. 14 వ పారాలింపిక్స్ లండన్ లో ఆగస్టు 29…

ప్రపంచ వ్యాపితంగా అమెరికా వ్యతిరేక నిరసనలు -ఫోటోలు

ఒక అమెరికన్ యూదు (నకౌలా బెస్సెలే నకౌలా) నిర్మించాడని చెబుతున్న ‘ఇన్నోసెన్స్ ఆఫ్ ముస్లిమ్స్’ సినిమా కు నిరసనగా సెప్టెంబరు 11 తేదీన ప్రారంభమయిన నిరసనలు ప్రపంచం అంతటా విస్తరించాయి. కైరో, బెంఘాజీ నగరాల్లో జరిగిన హింసాత్మకం దాడుల అనంతరం పెచ్చరిల్లిన ఈ నిరసనలు ప్రధానంగా అమెరికా, ఇజ్రాయెల్ లకు వ్యతిరేకంగా ఎక్కుపెట్టబడ్డాయి. అమెరికా ఎంబసీలు నిరసనలకు, విధ్వంసాలకు లక్ష్యంగా మారాయి. తమ ఎంబసీలకు రక్షణ కల్పించవలసిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందని చెబుతూనే అమెరికా కొన్ని అరబ్,…