ఉత్తరఖండ్ వరదలు: పాఠాలు నేర్చేదే లేదు!

ఉత్తర ఖండ్ లో 4 రోజుల పాటు కురిసిన అతి భారీ వర్షాలకు నదులు, వాగులు పొంగి పోర్లాయి. ఎప్పటిలాగే పల్లెలు, పట్టణాలు తేడా లేకుండా నీట మునిగాయి. వంతెనలు తెగిపోయాయి. కొన్ని చోట్ల అవి కూలిపోయి కొట్టుకుపోయాయి. కడపటి వార్తలు అందేసరికి  52 మంది మరణించారు. కొండల మీద నుండి రాళ్ళు, భారీ మట్టి పెళ్ళలు జారిపడి రోడ్లను కప్పేసాయి. కొండ చరియలు విరిగిపడి రోడ్డు మార్గాలను తెంపేశాయి. ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి వరదల…

యోగా: ఇందుగల దందులేదని… -ఫోటోలు

“ఇందుగలదందులేదని సందేహంబు వలదు యోగా సర్వోపగతుందెందెందు వెదకి చూచిన అందెందే గలదు” అని చదువుకోవచ్చని ఖాయంగా అనిపిస్తుంది కింది ఫోటోలు చూస్తే! ‘అంతర్జాతీయ యోగా దినం’ అంటూ ఇప్పుడు హడావుడి చేస్తున్నారు గానీ, నిజానికి యోగా ఎన్నడో ప్రపంచ వ్యాపితంగా విస్తరించి ఉంది. 1982 లోనే అమెరికా పౌరులు యోగా, ధ్యానం లను అభ్యసించడమే కాకుండా కొందరు దేశ విదేశాలు తిరిగి ప్రచారం చేశారని కూడా ఈ బ్లాగర్ కి తెలుసు. ఎలాగంటే ఆ సంవత్సరంలో ప్రఖ్యాత…

చైనా సమూహ కళకు సరిలేరు ఎవ్వరూ! -ఫోటోలు

ప్రజా సమూహాలు అన్నీ ఒకే మాదిరిగా, ఒకే భావాన్ని కలిగించేవిగా ఉండవు. కొన్ని సమూహాలు అబ్బురపరిస్తే కొన్ని సమూహాలు చీదర  పుట్టిస్తాయి. కొన్ని సమూహాలు ఔరా! అనిపిస్తే మరికొన్ని ఇదెలా సాధ్యం అని విస్తుపోయేలా చేస్తాయి. సమూహంలో క్రమ శిక్షణ ఉంటే ఆ సమూహానికి ఎనలేని అందం వచ్చి చేరుతుంది. అది మిలటరీ క్రమ శిక్షణ అయితే చెప్పనే అవసరం లేదు. క్రమబద్ధమైన కదలికలతో మిలట్రీ సమూహాలు చేసే విన్యాసాలు చూడముచ్చట గొలుపుతూ విసుగు అనేది తెలియకుండా…

నేపాల్ భూకంపం: మృతులు 2200 పైనే -ఫోటోలు

నేపాల్ ను తాకిన భారీ భూకంపం ఆ చిన్న దేశంలో విలయాన్ని సృష్టించింది. ఇటీవలి వరకూ కొనసాగిన శతాబ్దాల నాటి భూస్వామ్య రాచరిక పాలన దేశ సంపదలను కొన్ని కుటుంబాల చేతుల్లోనే కేంద్రీకరింపజేయడంతో ఇప్పుడది ప్రకృతి విలయానంతర రక్షణ ఏర్పాట్లు చేయడంలో కూడా ఘోరంగా విఫలం అవుతోంది. సంపన్న కుటుంబాలు ప్రభుత్వాన్ని, ప్రజలను పేదరికంలోకి నెట్టడంతో రక్షణ పరికరాలు కొరవడి, తగిన శిక్షణ లేని భద్రతా సిబ్బంది తెల్లమొఖం వేయడంతో జనమే పూనుకుని తమ ఏర్పాట్లు తాము…

చైనా రియల్ రాబందుల భూదాహానికి ప్రతిఘటన ఈ మేకు ఇళ్ళు -ఫోటోలు

చైనా అత్యంత వేగంగా అమెరికా జి.డి.పి పరిమాణాన్ని సమీపిస్తోంది. ప్రస్తుతం అమెరికా వార్షిక జి.డి.పి 16.8 ట్రిలియన్ డాలర్లు ఉంటే చైనా జి.డి.పి 9.2 ట్రిలియన్ డాలర్లకు చేరుకుంది. మూడేళ్ళ క్రితం జపాన్ ను మూడో స్ధానానికి నెట్టి రెండో స్ధానానికి చేరేనాటికి చైనా జి.డి.పి 4.5 ట్రిలియన్లు. ఇప్పుడు అంతకు అంతా జి.డి.పి ని పెంచుకుని అమెరికాని వెనక్కి నేట్టేందుకు దూసుకుపోతోంది. చైనా విశృంఖల అభివృద్ధిలో ‘రియల్ ఎస్టేట్ బూమ్’ ఒక ముఖ్యమైన పాత్ర పోషించింది.…

పశ్చిమ అమెరికా కరువు విభ్రాంత దృశ్యం -ఫోటోలు

అమెరికన్ వాల్ స్ట్రీట్ కంపెనీలు ఎప్పటిలాగానే లాభాలు నమోదు చేస్తున్నాయి. స్టాక్ మార్కెట్లు పైపైకి చూస్తున్నాయి. ఆర్ధిక సంక్షోభం ముగిసిందని ప్రభుత్వాలు తీర్మానిస్తున్నాయి. వడ్డీ రేట్లు పెరుగుతున్నాయి. వృద్ధి రేటు కూడా పెరుగుద్దంటున్నారు. జనం మాత్రం కరువు బారిన పడి విలాపిస్తున్నారు. పశ్చిమ అమెరికా తీర రాష్ట్రాలను ఎన్నడూ ఎరగని కరువు పట్టి పీడిస్తోంది. ఒక్క కాలిఫోర్నియా రాష్ట్రమే కాదు, నెవాడా, ఆరిజోనా, ఉటా తదితర రాష్ట్రాలన్నీ నీటి కోసం అలమటిస్తున్నాయి. ప్రతి యెడూ సాధారణంగా ఈ…

2014 నేషనల్ జాగ్రఫిక్ ఫోటో పోటీ విజేతలు -ఫోటోలు

నేషనల్ జాగ్రఫిక్ మేగజైన్ 2014 సంవత్సరానికి గాను ఫోటో పోటీ విజేతలను ప్రకటించింది. ఎప్పటిలాగానే జనం (People), ప్రకృతి (Nature), స్ధలం (Places) అనే మూడు విభాగాల్లో పోటీ నిర్వహించబడింది. అత్యున్నతమైన గ్రాండ్ బహుమతిని పీపుల్ విభాగం విజేతకు దక్కింది. హాంగ్ కాంగ్ లో చీకటి ఆలుకుని ఉన్న ఒక రైలు పెట్టెను ఒక యువతి చేతిలోని మొబైల్ ఫోన్ ప్రకాశింపజేస్తున్న దృశ్యాన్ని బ్రియాన్ యెన్ చిత్రీకరించగా అది గ్రాండ్ ప్రైజ్ ను గెలుచుకుంది. మొబైల్ ఫోన్…

విశ్వనరుడి లిప్తకాల జీవనం -ఫోటోలు

‘నేను విశ్వ నరుడ్ని’ అని చాటుకున్నారు మహా కవి గుర్రం జాషువా. భారతీయ కుల వ్యవస్ధకు నిరసనగా అది ఆయన చేసిన మానవీయ ప్రకటన. ఈ విశ్వంలో నరులంతా పుట్టుకతో సమానులేననీ, నిచ్చెన మెట్ల కుల వ్యవస్ధ మనిషి ఏర్పరుచుకున్నదే అనీ ఆయన విశ్వసిస్తూ, కులం లేని విశ్వంలో తన చోటును వెతుక్కున్నారు. ‘డెయిలీ లైఫ్’ శీర్షికన ఫోటోగ్రాఫర్లు విశ్వ వ్యాపిత జీవన దృశ్యాలను సేకరించి ప్రచురించే ఫోటోలు గుర్రం జాషువా ప్రకటనను గుర్తుకు తెస్తాయి. ప్రపంచంలో…

భూమికి దూరంగా… గాలిలో తేలుతూ… -ఫోటోలు

విమానాలు సరే! ఉన్నచోటనే గాలిలో తేలిపోయే ఆటలు, ఆట వస్తువులు మనిషికి ఇప్పుడు ఎన్నో అందుబాటులోకి వచ్చాయి. ఇలాంటి ఆటలు, ఆట వస్తువులు ఉనికిలోకి రావడానికి కారణం ఏమిటో తెలుసుకుంటే కాస్త ఆశ్చర్యం వేస్తుంది. భారీ ఉత్పత్తులు తీయగల యంత్రాలను కనిపెట్టాక ఆర్ధిక పిరమిడ్ లో అగ్రభాగాన తిష్ట వేసిన కలిగిన వర్గాలకు తీరికే తీరిక! ఈ తీరిక సమయం క్రమంగా మానసిక జబ్బులకు దారి తీయడం మొదలైంది. ఈ ప్రమాదాన్ని తప్పించడానికి వారికి అత్యంత తీవ్ర…

నెల వాన ఒకేసారి, మట్టిదిబ్బల కింద హిరోషిమా -ఫోటోలు

11, 2 సం.ల వయసు గల సోదరులు నిద్రలోనే సమాధి అయ్యారు. ఒక పిల్లాడి ఎర్ర స్కూల్ బ్యాగ్ బురదలో కూరుకుపోయి కనిపిస్తోంది. ఇక్కడ ఉండాల్సిన ఇల్లు కూలిపోయి, కొట్టుకుపోయి 100 మీటర్ల దూరంలో సగం తేలి కనిపిస్తోంది. బురద ప్రవాహం బలంగా దూసుకురావడంతో ఇళ్ళగోడలు చెల్లా చెదురై కొట్టుకుపోయి శిధిలాల కుప్పలై తేలాయి. మూడు మీటర్ల మందం ఉన్న భారీ రాళ్ళ కింద సగం కనిపిస్తున్న మానవదేహాలు భయం గొలుపుతున్నాయి. ఇటీవలే పెళ్లి చేసుకున్నా కొత్త…

నీగ్రోను చంపిన పోలీసులు, అట్టుడికిన అమెరికా -ఫోటోలు

సివిల్ పోలీసులకు మిలట్రీ ఆయుధాలను సరఫరా చేస్తే ఏమవుతుందో అమెరికాలో అదే జరుగుతోంది. రెండున్నర సంవత్సరాల క్రితం ట్రేవాన్ మార్టిన్ అనే 17 సం.ల నీగ్రో యువకుడిని ఒట్టి పుణ్యానికి కాల్చి చంపిన ఉదంతం మరువక ముందే మరో నీగ్రో యువకుడిని అమెరికా పోలీసులు కాల్చి చంపారు. ఈసారి కూడా తెల్లజాతి పోలీసే హత్యకు పాల్పడ్డాడు. రోడ్డు మధ్యలో కాకుండా పక్కన నడవాలని ఆదేశించిన పోలీసుల ఆజ్ఞను త్వరగా అమలు చేయకపోవడమే ఆ యువకుడు చేసిన నేరం.…

ఉత్తర కొరియా: ఓ యువ నియంత దృశ్య కధ

వర్తమాన చరిత్రలో నియంతృత్వం-ప్రజాస్వామ్యంల మధ్య సరిహద్దు రేఖ చెరిగిపోయి ఉంది. అతి పెద్ద ప్రజాస్వామ్యం అనీ, సుదీర్ఘ ప్రజాస్వామ్యం అనీ చెప్పుకునే దేశాల్లో ప్రజల ప్రయోజనాలకు కాణీ విలువ కూడా లేదు. నియంతృత్వ ప్రభుత్వాలుగా సో కాల్డ్ ప్రజాస్వామ్య దేశాలు ముద్రవేసిన దేశాల్లో ప్రజలకు కనీస సౌకర్యాలకు కొదవలేని పరిస్ధితి. సద్దాం హుస్సేన్ నాయకత్వంలో ఇరాక్ దేశం అన్నీ విధాలుగా అభివృద్ధి చెంది ఉండేది. చమురు వనరులను ప్రతి పైసాను దేశం దాటి పోనివ్వనందుకు సద్దాం హుస్సేన్…

ఆకాశం దించాలా, భువి తునక తుంచాలా? -ఫోటోలు

అమెరికా, రష్యాలు భౌగోళిక రాజకీయ రంగంలో ఎంతగా తగువులాడుకున్నా ఆ దేశాల అంతరిక్ష సంస్ధలు మాత్రం కలిసి మెలిసి కార్యక్రమాలు నిర్వర్తిస్తున్నాయి. బహుశా, కనీసం ప్రస్తుత కాలానికి,  అమెరికా-రష్యాల మధ్య గల వైరుధ్యాల పరిమితులను ఇది తెలియజేస్తుందేమో! ఎక్స్ పెడిషన్ 39 పేరుతో జరిగిన అంతరిక్ష ప్రయాణంలో ఇరు దేశాల సిబ్బంది కలిసి ప్రయాణించి శాస్త్ర పరిశోధనలలో పాలు పంచుకోవడమే కాకుండా అద్భుతమైన భూ దృశ్యాలను రికార్డు చేసి మనముందు ఉంచారు. ఇరు దేశాలకు చెందిన ముగ్గురు…

మొదటి ప్రపంచ యుద్ధం: యుద్ధ విమానాలు -ఫోటోలు

యుద్ధ విమానాలతో యుద్ధం చేసుకోవడం మొదటి ప్రపంచ యుద్ధంలోనే మొదలయింది. అప్పటికి విమానాల నిర్మాణ రంగంలో సాంకేతిక పరిజ్ఞానం పెద్దగా అభివృద్ధి చెందలేదు. చాలా ప్రాధమిక స్ధాయిలోనే విమానాల నిర్మాణం ఉన్నప్పటికీ శత్రువుపై పై చేయి సాధించడానికి పశ్చిమ దేశాలు వాటినీ వదల్లేదు. ప్రారంభంలో కేవలం గూఢచర్యానికి మాత్రమే విమానాలను, ఇతర ఎగిరే వస్తువులను (బెలూన్లు, గాలిపటాలు మొ.వి) వినియోగించేవారు. యుద్ధం తీవ్రం అయ్యేకొద్దీ అవసరం రీత్యానే బాంబర్లు, ఫైటర్ విమానాలు తయారు చేసుకుని వినియోగించారు. దాడులకు…

దశాబ్దాల భారతీయ శ్రమ కుప్పపోస్తే, లండన్! -ఫోటోలు

ప్రపంచంలోనే మొట్టమొదటి ప్రజాస్వామ్య దేశంగా బ్రిటన్ కి పేరు. మొట్ట మొదటి పౌర హక్కుల పత్రం ‘మాగ్న కార్టా’ కు ప్రాణం పోసింది బ్రిటిష్ పెట్టుబడిదారులే. రాచరికం నుండి హక్కుల కోసం పోరాడిన బ్రిటిష్ పెట్టుబడిదారీ వర్గం అనతికాలంలోనే ప్రపంచం లోని అనేక ఖండాంతర దేశాలకు బయలెల్లి అక్కడి ప్రజలకు హక్కులు లేకుండా చేశారు. బ్రిటిష్ వలస పాలకులు భారత దేశం లాంటి సంపన్న వనరులున్న దేశాలను దురాక్రమించి వలసలుగా మార్చుకుని ఒకటిన్నర శతాబ్దాల పాటు అక్కడి…