సాంకేతిక పురోగతితో ఫోటోగ్రఫీ పెనవేసుకున్న వేళ…

‘నేషనల్ జాగ్రఫిక్ ట్రావెలర్ ఫోటో కాంటెస్ట్’ పోటీలు జరుగుతున్నాయి ప్రస్తుతం. మరో ఆరు వారాల పాటు ఎంట్రీలను ఆహ్వానిస్తారట. నేషనల్ జాగ్రఫిక్ వారు నిర్వహిస్తున్న ఈ 25 వ పోటీలకు వచ్చిన కొన్ని ఎంట్రీలను ‘ది అట్లాంటిక్’ ప్రచురించింది. సాంకేతిక పరిజ్ఞానం ఊహకు అందని శిఖరాలకు అభివృద్ధి చెందిన నేపధ్యంలో మనిషి సాధారణ ఊహా శక్తిని అనేక రెట్లకు చేర్చుతోంది ఫోటోగ్రఫి. ఇంకా ఆరు నెలల పాటు ఎంట్రీలకు ప్రవేశం ఉన్నందున తెలుగు నేలను ఆవహించిన ప్రకృతి…

ఆ తెల్లోళ్ళు కాదు, వీరే అసలు అమెరికన్లు -ఫోటోలు

అమెరికన్లు అనగానే ఆ కాకసాయిడ్ రూపంలో ఉండే తెల్లవాళ్లే గుర్తుకొస్తారు. తెల్లవాళ్లు వాస్తవానికి ఐరోపా నుండి వలస వచ్చినవారు. ఇండియా కోసం బయలుదేరి ఉత్తర అమెరికా ఖండం చేరుకున్న కొలంబస్, అమెరికానే ఇండియాగా భావించి అక్కడ కనపడినవారిని ‘రెడ్ ఇండియన్లు’ అన్నాడు. స్వల్పంగా మంగోలాయిడ్ రూపంలో ఉండే ఆ రెడ్ ఇండియన్లే అసలు అమెరికన్లు. ఇప్పుడు వారి సంఖ్య చాలా స్వల్పం. నేటివ్ అమెరికన్లను పశ్చిమ తీరానానికి నెట్టుకుంటూ పోయిన యూరోపియన్లు ఆ క్రమంలో అనేక అకృత్యాలకు…

ఓ పాల బుగ్గల జీతగాడా…. ఫోటోలు

2011 జనాభా లెక్కల ప్రకారం భారత దేశ జనాభాలో పావు వంతు మంది 5-14 మధ్య వయసు పిల్లలే. వీరిలో దాదాపు 15 మిలియన్ (1.5 కోట్లు) బాల కార్మికులుగా పని చేస్తున్నారని అధికారిక అంచనా. వాస్తవ సంఖ్య ఇంతకు మించి ఉండే అవకాశం ఉంది. 1971లో వీరి సంఖ్య 1.07 కోట్లు. బాల కార్మికులు లేని చోటంటూ ఇండియాలో దాదాపు కనిపించదు. వ్యవసాయ కూలీల దగ్గర్నుండి, భారీ నిర్మాణ పనుల వరకూ పడుతూ లేస్తూ చిన్నతనంలో…

చమురు లీకేజి శుభ్రం చేసే కార్మికుల కష్టాలు చూసితీరాలి -ఫోటోలు

జులై 17, 2010 తేదీన చైనా ఈశాన్య రాష్ట్రం లియావోనింగ్ లో చమురు ప్రమాదం సంభవించి ‘పచ్చ సముద్రం’ ను ముంచెత్తింది. చమురు డాక్ యార్డ్ లో చమురు ట్యాంకులు పేలిపోవడంతో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదం అనంతరం చమురు లీకేజీని అరికట్టడానికి, పొర్లిపోయిన చమురుని తిరిగి ఎత్తి వినియోగంలోకి తేవడానికీ, సముద్ర కాలుష్యాన్ని శుభ్రం చేయడానికి కార్మికులు తీవ్రంగా శ్రమించారు. ఆ దృశ్యాలే ఇవి. 1500 తన్నుల క్రూడాయిలు సముద్రంలోకి ఒలికిపోగా అందులో మూడో వంతుని…

వావ్… ఫొటోలు, పోటీ కోసం!

స్మిత్‌సోనియన్ మ్యాగజైన్ నిర్వహించే పోటీ కోసం ఎంపికైన టాప్ 50 ఫొటోల్లో ఇవి కొన్ని. 112 దేశాల నుండి 37,600 ఫొటోలు పోటీ కోసం వచ్చాయట. అందులో 50 ఫొటోలను షార్ట్ లిస్ట్ చేసింది మ్యాగజైన్. ఇంకా చివరి ఫలితాలు వెల్లడి కాలేదట. ఐదు విభాగాల్లో విజేతలు నిర్ణయించి బహుమానం ఇవ్వనున్నారు. పోటీ ఈ రోజు, అంటే మార్చి 29 తో ముగుస్తోంది. ‘రీడర్స్ ఛాయిస్‘ విజేత కోసం ఈ ఫొటోలను స్మిత్‌సోనియన్ మ్యాగజైన్ తన వెబ్…

నీటి ఆటలు కొందరికి; నీటి పాట్లు మరెందరికో -ఫొటోలు

భవిష్యత్తులో నీటి కోసం ప్రపంచ యుద్ధాలు తప్పవని అనేకమంది ఇప్పటికే జోస్యం చెప్పేశారు. భూగ్రహం వేడెక్కుతున్న ఫలితంగా ‘నీటి కొరత ఒక చోట, పల్లెలను, నగరాలను తేడా లేకుండా ముంచెత్తే తుఫాను వరదలు మరొక చోట’ నిత్య వాస్తవంగా మారిపోయింది. లాభ దాహాలతో పరితపించి పోతున్న కార్పొరేట్ కంపెనీలు నీటి వనరులను స్వాధీనం చేసుకుంటూ ప్రజలు దాహంతో పరితపించేలా ప్రభుత్వాలను ప్రభావితం చేస్తున్నాయి. లేకపోతే కాసింత రంగు కలిపి మిలియన్లు దండుకుంటున్న కూల్ డ్రింకు కంపెనీల కోసం…

కుంభమేళా తొక్కిసలాట, 36 మంది దుర్మరణం -ఫొటోలు

ప్రపంచంలోనే అతి భారీ సంఖ్యలో మనుషులు ఒక చోటికి చేర్చే కార్యక్రమంగా ప్రసిద్ధి పొందిన అలహాబాద్ కుంభమేళా ఆదివారం తొక్కిసలాటకు సాక్షిగా నిలిచింది. అలహాబాద్ రైల్వేస్టేషన్ లో జరిగిన తొక్కిసలాటలో కనీసం 36 మంది మరణించారని ప్రభుత్వం తెలిపింది. ఆదివారం సాయంత్రం 7 గంటల ప్రాంతంలో జరిగిన తొక్కిసలాటకు ఫుట్-ఓవర్-బ్రిడ్జి కూలిపోవడం ముఖ్య కారణం. రైల్వే అధికారులు, పోలీసులు, ప్రజలు చెప్పిన వివిధ అంశాలను బట్టి ‘ఒక ప్లాట్ ఫారం మీదికి వస్తుందని ప్రకటించిన రైలు చివరి…

అచ్చమైన ప్రజలే కూడంకుళం ఉద్యమ నిర్మాతలు -ఫోటోలు

కూడంకుళం అణు కర్మాగారం వల్ల తమ భద్రతకు, జీవనోపాధికీ ప్రమాదమని స్ధానిక ప్రజలు భయపడుతున్నారు. ఫుకుషిమా అణు ప్రమాదం జరిగాక వారి భయాలు నిజమేనని వారికి రూఢి అయింది. కూడంకుళం అణు కర్మాగారానికి వ్యతిరేకంగా, గత సంవత్సరం ఆగస్టు నుండి వారు శాంతియుత నిరసన ప్రారంభించారు. కర్మాగారానికి వ్యతిరేకంగా గ్రామ సభలో తీర్మానం చేసి ప్రభుత్వానికి పంపారు. నెలల తరబడి నిరాహార దీక్ష చేశారు. వారి భయాలు పోగొట్టడానికి బదులు ప్రభుత్వం వందలమంది ప్రజలపై ‘దేశ ద్రోహం’…

నేషనల్ జాగ్రఫిక్ ట్రావెలర్ 2012 ఫోటో పోటీలు -ఫోటోలు

‘నేషనల్ జాగ్రఫిక్ ట్రావెలర్’ మ్యాగజైన్ (National Geographic Traveler) వారు 2012 సంవత్సరానికి గాను నిర్వహించిన పోటీల్లో గెలుపొందిన ఫొటోలివి. 152 దేశాలకు చెందిన 6,615 మందికి పైగా ఫోటో గ్రాఫర్లు 12,000 కి పైగా సమర్పించిన ఎంట్రీలనుండి విజేతలను నిర్ణయించారరని మ్యాగజైన్ వెబ్ సైట్ తెలిపింది. ఆఫ్ఘనిస్ధాన్ నుండి వియత్నాం వరకూ తీసిన ఈ ఫొటోల్లో ప్రశాంత ల్యాండ్ స్కేప్ దృశ్యాలనుండి యాదృచ్ఛిక సంఘటనల వరకూ అన్ని రకాల దృశ్యాలనూ పరిగణించారట. మొత్తం మీద చూస్తే…

మల్టి ఎక్స్‌పోజర్: ఒకే ఫొటోలో బహుళ కదలికలు -ఫొటోలు

మల్టీ ఎక్స్‌పోజర్ టెక్నిక్ తో తీసిన ఫొటోలివి. వెనువెంటనే వివిధ సమయాల్లో తీసిన ఫొటోలను ఒకే ఫ్రేమ్ పై ఎక్స్‌పోజ్ చేసే టెక్నిక్ ఇది. ఒక ఘటనలో ఒకే వ్యక్తి కొద్ది సెకన్ల తేడాతో చేసే కదలికలను పట్టి ఒకే ఫ్రేమ్ పై ఎక్స్‌పోజ్ చేయడం ద్వారా స్పెషల్ ఎఫెక్ట్స్ తెచ్చే ఈ ప్రక్రియలో ఫొటోలు చూడడానికి ప్రత్యేకంగా ఉంటాయి. అంటే వివిధ సమయాలలో చేసిన కదలికలను ఒకే ఫొటోలో చూడడం అన్నమాట. ఇవి చూడడానికి కళాత్మకంగా…

ఎర్ర సూర్యుడి నుదుట ‘శుక్ర’ తిలకం -ఫొటోలు

మరో వందేళ్లకు గాని సంభవించని ఖగోళ అద్భుతం జూన్ 5, 6 తేదీలలో ప్రపంచ ప్రజలకు దర్శనం అయింది. ఎనిమిది సంవత్సరాల తేడాతో సూర్య తలంపై జంట మార్గాల్లో ప్రయాణం చేసే శుక్ర గ్రహం ఎనిమిదేళ్ల క్రితం జూన్ 8, 2004 తేదీన మొదటి ప్రయాణం పూర్తి చేసుకుంది. మళ్ళీ ఎనిమిదేళ్లకు రెండవ ప్రయాణం పూర్తి చేసింది. (భూగ్రహ వాసుల కంటిని రిఫరెన్స్ గా తీసుకున్నందున ఇక్కడ జంట ప్రయాణాలుగా ఉపమానీకరించడం.) మామూలు జనానికి ఇదేమీ పెద్ద…

ఇళ్లపై కూలిన నైజీరియా విమానం, 153 మంది దుర్మరణం -ఫొటోలు

నైజీరియాలో లాగోస్ పట్టణంలో ప్రయాణికుల విమానం ఒకటి నివాస భవనాలపై కూలిపోవడంతో అనేక మంది చనిపోయారు. విమానంలో ప్రయాణిస్తున్న మొత్తం 153 మందీ చనిపోయారని నైజీరియా ప్రభుత్వ వర్గాలు తెలిపాయని ‘ది హిందూ’ తెలిపింది. నివాస భవనాల్లో చనిపోయినవారిని కూడా కలుపుకుంటె మృతుల సంఖ్య పెరగవచ్చని తెలుస్తోంది. ప్రమాదానికి కారణం ఇంకా తెలియలేదు. నీటి లభ్యత తక్కువ కావడంతో మంటలు ఆర్పడం కష్టమైంది. బోయింగ్ విమానం కూలివడానికి కొద్ది నిమిషాల ముందు ఇంజన్ లో సమస్య వచ్చిందని…

వియత్నాం నెత్తిన అమెరికా రుద్ధిన యుద్ధ భీభత్సం -ఫొటోలు

1962 నుండి అమెరికా దురాక్రమణ యుద్ధ భీభత్సాన్ని అతి చిన్న దేశం ‘వియత్నాం’ నెత్తిన రుద్దింది. కమ్యూనిస్టు చైనా ప్రాబల్యం వియత్నాం దేశంలోకి విస్తరిస్తుందన్న భయంతో వియత్నాం ప్రజలపై అమెరికా బలవంతంగా రుద్దిన యుద్ధం ఇది. జాతీయ విముక్తి యుద్ధాల ఫలితంగా ప్రపంచంపై యూరోపియన్ దేశాల వలసాధిపత్యం అంతరించాక అమెరికా తన సామ్రాజ్యాధిపత్యాన్ని విస్తరించడానికి అనేక దుర్మార్గ యుద్ధాలను ప్రపంచ దేశాలపై రుద్ధడం ప్రారంభించింది. అమెరికా కంపెనీల ప్రయోజనాలను ప్రపంచ వ్యాపితంగా విస్తరించడంతో పాటు, కమ్యూనిస్టు వ్యవస్ధల…

వంద యేళ్ల క్రితం కలకత్తా -ఫొటోలు

బ్రిటిష్ ఇండియా కాలం నాటి కలకత్తాలో ప్రజా జీవనాన్ని తెలిపే ఫొటోలివి. అరుదయిన గ్లాస్ ప్లేట్ నెగిటివ్ లు లండన్ లోని ఒక మ్యూజియం ఆర్కైవ్స్ లో ఇవి లభ్యం అయ్యాయి. RCHAMS (Royal Commission on the Ancient and Historical Monuments of Scotland) వెబ్ సైట్ ఈ ఫొటోలను ప్రచురించింది. ఇవి 1912 నాటి ఫొటోలని తెలుస్తోంది. స్టేట్స్ మెన్ పత్రిక కాపీలతో చుట్టి ఉన్న 178 గ్లాస్ ప్లేట్ నెగిటివ్ ల  ప్యాకేజి…

AIZHAI China

ప్రపంచ భారీ వంతెనలు -ఫొటోలు

మానవ నాగరికత సాధించిన ప్రగతికి ఈ వంతెనలు ప్రతి రూపాలు. అత్యంత పొడవైన వంతెనలు, భారీ వంతెనలు, ఎత్తయిన వంతెనలు చూసినపుడు మానవ మేధస్సుకి పరిమితులు లేవేమో అనిపిస్తుంది. ‘అరచేతిలో వైకుంఠం’ కాదు గానీ, అరచేతిలో ఇమిడి పోతున్న సెల్ ఫోన్లలోకి ప్రపంచం అంతటినీ క్షణాల్లో సాక్షాత్కరింపజేయగలిగిన మేధస్సు మనిషి సొంతం. ఫ్యూడల్ వ్యవస్ధ సాధించిన భారీ నిర్మాణాలకు సాంకేతికతను జోడించి మనిషి జీవనానికి మరింత సౌఖ్యాన్ని జోడించడంలో పెట్టుబడిదారీ వ్యవస్ధ సాధించిన ప్రగతిని కొట్టివేయడానికి వీల్లేదు.…