ఫైర్ బు(బా)ల్ తో ఆడుకునే ప్రాణాంతక సరదా -ఫోటోలు

‘ఎద్దు పుండు కాకికి ముద్దు’ అని సామెత. కొమ్ములకు అంటించిన మంటలు చెలరేగి పోతుంటే భయంతో పరుగులు తీసే ఎద్దుతో ఆడుకుంటూ  స్పానియార్డ్ లు పడే సరదా చూస్తే ‘ఇదేం ఆనందం’ అనిపించక మానదు. కొమ్ములు తిరిగిన భారీ ఎద్దులతో పోరాటాలకు దిగడం స్పానిష్ సంస్కృతిలో భాగం అని అందరికి తెలిసిన విషయమే. కానీ ఫైర్ బుల్ ఫెస్టివల్ (టోరో డి జుబిలో) పేరుతో స్పెయిన్ లో ఏటా జరిగే ప్రాణాంతక పండగ విషయం తెలిసింది తక్కువ…