ట్విట్టర్, ఫేస్ బుక్ లలో అన్నా హజారే ఉద్యమ వ్యాప్తి
సామాజిక వెబ్ సైట్లలో ముఖ్యంగా ట్విట్టర్, ఫేస్ బుక్ లలో అన్నా హజారే బృందం తలపెట్టిన అవినీతి వ్యతిరేక ఉద్యమానికి మద్దతు విస్తృతంగా లభిస్తోంది. ఐతే ఇది ఉద్యమం బౌతికంగా వ్యాప్తి చెందడానికి దోహదపడడం లేదు. అది వీలు కూడా కాదు. నిజ జీవితంలో ప్రజా సంఘాలు అనేక కార్యక్రమాలు, సదస్సులు, సమావేశాలు, ధర్నాలు అనేకం చేస్తుంటాయి. వీటిని చూసి లేదా విని స్పందించని జనం, వంటరిగా కంప్యూటర్ ముందు కూర్చుని ఉద్యమాల వార్తలు చదివి ప్రేరేపణ…