ఇంటర్నెట్ లో దళితులపై కువ్యాఖ్యలు నేరం -ఢిల్లీ కోర్టు

ఢిల్లీ కోర్టు ఒక సంచలన తీర్పు ప్రకటించింది. సోషల్ మీడియాలో దళితులపై పెచ్చు మీరుతున్న వివక్షాపూరిత వ్యాఖ్యలు, దూషణలకు చెక్ పెడుతూ ప్రగతిశీల తీర్పు ప్రకటించింది. తీర్పు ప్రకారం ఎస్‌సి/ఎస్‌టి అత్యాచారాల నిరోధక చట్టం పరిధిలోకి సోషల్ మీడియాలో చేసే వ్యాఖ్యలు కూడా వస్తాయి. ఫేస్ బుక్, ట్విట్టర్, వాట్సప్, ఇన్ స్టాగ్రామ్ మొదలైన సోషల్ నెట్వర్క్ వెబ్ సైట్ లలో ఎస్‌సి, ఎస్‌టి కులాలపై వివక్షాపూరిత వ్యాఖలు చేసినా, వ్యక్తిగతంగా టార్గెట్ చేసి ఇబ్బంది పెట్టినా…

వాట్సప్ (ఫేస్ బుక్) పై హ్యాంబర్గ్ కొరడా -కార్టూన్

  జర్మనీలో రెండవ అతి పెద్ద నగరం (రెండవ అతి చిన్న రాష్ట్రం కూడా) హ్యాంబర్గ్ నగర కమిషనర్ వాట్సప్ నిర్వహిస్తున్న అనైతిక కార్యకలాపాలపై కొరడా ఝళిపించింది. వినియోగదారుల ఫోన్ నెంబర్లు, వ్యక్తిగత వివరాలను పేస్ బుక్ కంపెనీతో షేర్ చేయటాన్ని నిషేదించింది. కంపెనీ ఇచ్చిన హామీని గుర్తు చేసి దాన్ని నిలబెట్టుకోవాలని హెచ్చరించింది. వాట్సప్ ను అత్యధిక ధర పెట్టి ఫేస్ బుక్ కొనుగోలు చేసినప్పుడు రెండు కంపెనీలు పలు నీతులు చెప్పాయి. హామీలు ఇచ్చాయి.…

ఫేస్ బుక్ నుండి బలవంతపు అదృశ్యం -కార్టూన్

కాశ్మీర్ లోయలో యువకులు ఉన్నట్లుండి మాయం కావడం సామాన్యమైన విషయం. ఇప్పుడు కాస్త తగ్గింది కానీ 1990ల్లో అది ఉధృతంగా జరిగింది. ఉగ్రవాదులన్న వంకతో వేలాది యువకులను భారత సైన్యం మాయం చేసింది. ఒమర్ అబ్దుల్లా పాలన కాలంలో సామూహిక సమాధులు బైట పడ్డాయి కూడా. సమాధుల చరిత్రను విచారించేందుకు నియమించిన కమిటీ నివేదిక ఇంతవరకు వెలుగు చూడలేదు. బందిపురా, బారాముల్లా, కుప్వారా అనే మూడు జిల్లాల్లోని 55 గ్రామాల్లో సామూహిక సమాధులు బైటపడ్డాయి. 2,700 సమాధులు…

ఫ్రీ డేటా కోసం ఫేస్ బుక్ విసిరిన గేలం ‘ఫ్రీ బేసిక్స్’ -కార్టూన్

ఫేస్ బుక్ వ్యవస్ధాపకుడు మార్క్ జూకర్ బర్గ్ పేరు ఈ మధ్య ఇండియాలో తరచుగా వినిపిస్తోంది. భారత దేశంలోని పేదలకు ఉచితంగా ఇంటర్నెట్ సేవలు అందిస్తానంటూ ఆయన ప్రతిపాదించిన ‘ఫ్రీ బేసిక్స్’ ఇందుకు ప్రధాన కారణం. Free Basics పేరుతో ఫేస్ బుక్ కంపెనీ అందుబాటులో ఉంచుతున్న వేదిక ద్వారా పేద ప్రజలు సైతం ఉచితంగా ఇంటర్నెట్ సేవలను, విద్య-వైద్య-ప్రయాణ-ఉపాధి-ఆరోగ్య-వార్తా సేవలను పొందవచ్చని ఫేస్ బుక్ ఊరిస్తోంది. ఫ్రీ బేసిక్స్ గురించి ఇండియాలో ప్రచారం చేయడం కోసం…

జీవన విధానాల్ని శాసిస్తున్న మొబైల్ ఫోన్ -ఫోటోలు

ఆధునిక ప్రపంచంలో ప్రజల జీవన విధానాల్ని దాదాపుగా శాసిస్తున్న ఉపకరణం, మొబైల్ ఫోన్! జీవన విధానాల్ని మొబైల్ ఫోన్ తిరగరాస్తోందని కొందరు చెబుతారు గాని అది ఒకింత ఓవర్ స్టేట్ మెంట్. అప్పటికే స్ధిరపడిన జీవన విధానంలో కొన్ని పనుల్ని మొబైల్ ఫోన్ చాలా సులభతరం చేసిన మాట నిజమే. కానీ మొబైల్ కంపెనీలా లేక వినియోగదారులా ఎవరు ఎక్కువ లాభ పడ్డారు అని ప్రశ్నించుకుంటే మాత్రం కంపెనీలే ఎక్కువ లాభం పొందుతున్నాయని తధ్యంగా చెప్పవచ్చు. ఒకనాడు,…

గృహిణి హత్యకు దారితీసిన ఫేస్ బుక్ స్నేహం

ఎలా అర్ధం చేసుకోవాలో, ఎవరిని తప్పు పట్టాలో తెలియని వికృత పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఫేస్ బుక్ లాంటి సామాజిక వెబ్ సైట్లు సృష్టిస్తున్న సామాజిక సంక్షోభం అంతా ఇంతా కాదు. వయసు లేదు, విలువ లేదు, పద్ధతి లేదు, ఎవల్యూషన్ అసలే లేదు. పరిచయం చూస్తేనేమో ఫేస్ బుక్ లాంటి వర్చువల్ ప్రపంచంలో. దాని వాస్తవ పరిణామాలేమో నిజ ప్రపంచం పైన! 43 సంవత్సరాల ఒక గృహిణి 22 సంవత్సరాల యువకుడితో (సోకాల్డ్) ప్రేమలో పడిపోయింది.…

వాట్సప్ స్వాధీనం: గూగుల్ పై ఫేస్ బుక్ విజయం

‘WhatsApp’ అప్లికేషన్ కొనుగోలు మరియు స్వాధీనం (acquisition) కోసం జరిగిన పోటీలో ఫేస్ బుక్ అధిపతి మార్క్ జుకర్ బర్గ్ విజయం సాధించాడు. దానితో త్వరలో జరగబోయే ప్రపంచ స్ధాయి ఐ.టి (మొబైల్) కాన్ఫరెన్స్ లో జుకర్ బర్గ్ విజయగర్వంతో పాల్గొననున్నాడని వ్యాపార వార్తా సంస్ధలు ఆకాశానికి ఎత్తేస్తున్నాయి. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి సంబంధించి దాదాపు ప్రతి రంగంలోనూ పాతుకుపోయిన గూగుల్ ని త్రోసిరాజనడం అంటే మాటలు కాదు మరి! స్మార్ట్ ఫోన్ ల దగ్గర నుండి మధ్య…

సెల్ ఫోన్ లో ఫేస్ బుక్ తో జర జాగ్రత్త!

ఫేస్ బుక్ కూడా గూగుల్ కంపెనీ ఎత్తుగడలను అనుసరిస్తోంది. యాండ్రాయిడ్ మొబైల్ ఫోన్ వినియోగదారుల ఎస్.ఎం.ఎస్ లను, ఇతర వ్యక్తిగత రహస్య సమాచారాన్ని రికార్డు చేసి భద్రపరచుకోడానికి తమ వినియోగదారులకు ఫేస్ బుక్ వల వేస్తోందని ప్రముఖ కంప్యూటర్ భద్రతా కంపెనీ ‘కాస్పరస్కీ’ అధినేత కాస్పరస్కీ హెచ్చరించారు. యాండ్రాయిడ్ మొబైల్ ఆపరేటింగ్ సిస్టమ్ లోని తన అప్లికేషన్ (యాప్) ను ఫేస్ బుక్ తాజాకరించి, వ్యక్తిగత సమాచారాన్ని సేకరించేందుకు వీలయిన అంశాలను చొప్పించిందని ఆయన వివరించారు.  అమెరికా…

గూగుల్, ఫేస్ బుక్ లు పిల్లలకు ఎలా చేరువగా ఉన్నాయి? -కోర్టు ఆరా

ఇంటర్నెట్ లో సామాజిక కార్యక్రమాల ముసుగు ధరించే ఐ.టి వ్యాపార కంపెనీల వ్యవహారం పైన భారత దేశంలోని కోర్టులు కొరడా ఝళిపించడానికి సిద్ధం అవుతున్నాయి. చట్టబద్ధ మైన వయసు 18 సంవత్సరాల లోపలి పిల్లలకు ఫేస్ బుక్, గూగుల్ సామాజిక వెబ్ సైట్లు పిల్లలకు ఎలా అందుబాటులో వస్తున్నాయో వివరించాలని ఢిల్లీ హై కోర్టు ప్రభుత్వాన్ని వివరణ కోరింది. చట్టాలను ఉల్లంఘిస్తూ భారత వినియోగదారుల వినియోగదారుల వ్యక్తిగత వివరాల డేటాను అమెరికా కంపెనీలు అమెరికాకు పంపిస్తున్నాయని తద్వారా…

ఫేస్ బుక్ లో 10 శాతం మంది తిట్లు తింటున్నారట!

ఫేస్ బుక్ ఖాతాదారుల్లో కనీసం నూటికి పది మంది తిట్లు, అవమానాలు ఎదుర్కొంటున్నారని ఒక అధ్యయనం తెలిపింది. అధ్యయనం ప్రకారం ఫేస్ బుక్ వినియోగదారుల్లో పది శాతం మంది తమ ‘వాల్‘ పైన అభ్యంతరకరమైన, అవమానకరమైన సందేశాలు పోస్ట్ చేయబడిన అనుభవాలు ఎదుర్కొన్నారు. తమకు నచ్చని యూజర్‌లను తిట్టడం, అవమానించడం, వ్యక్తిగతంగా ఎగతాళి చేయడం బూతురాయుళ్ళ పనిగా ఉంటోంది. బెదిరిస్తూ ప్రైవేటు సందేశాలు ఇవ్వడం కూడా వీరి పనుల్లో ఒకటని టెలిగ్రాఫ్ పత్రిక తెలిపింది. ఇంకా ఘోరం…

వామ్మో ఫేస్ బుక్!

“ఇక ఫేస్ బుక్ జోలికి పోకూడదు” అనిపించటాలుగా పరిస్ధితి వచ్చేసినట్లుంది చూడబోతే. లేకపోతే ఐ.టి చట్టం సెక్షన్ 66-ఎ పేరు చెప్పి ఈ వరుస అరెస్టులు ఏమిటి? బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తనపై కార్టూన్ షేర్ చేశాడని ఒక ప్రొఫెసర్ ని అరెస్టు చేసి జైల్‌లోకి తోయించింది లగాయతు చిదంబరం కొడుకు కార్తీక్ దగ్గర్నుంచి యు.పి ప్రభుత్వం మీదుగా చండీఘర్ అమ్మాయి వరకూ ఫేస్ బుక్ వ్యాఖ్యలను క్రిమినలైజ్ చేయడం జాస్తి అయింది. తాడేపల్లి, కృష్ణమోహన్…

పోలీసుల చేతుల్లోకి వెళ్ళిన ఫేస్ బుక్ అసభ్య సంభాషణల కేసు

ఫేస్ బుక్ లో తెలుగు వ్యాఖ్యాతలు మహిళలకు వ్యతిరేకంగా, వారి గుణ గుణాలను కించపరుస్తూ సాగించిన సంభాషణ పోలీసుల చేతుల్లోకి వెళ్ళిపోయింది. అసభ్య వ్యాఖ్యానాలను తీవ్రంగా పరిగణించిన మహిళలు విషయాన్ని శనివారం పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. హైదరాబాద్ కమిషనర్ ఆఫ్ పోలీస్ శ్రీ అనురాగ్ శర్మ కు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తుంది. కనీసం 10 మంది మహిళలు కమిషనర్ ను కలిసిన వారిలో ఉన్నట్లు తెలుస్తున్నది. కమిషనర్ గారెని కలిసిన అనంతరం వనిత టి.వి లో సాయంత్రం…

పత్రికలకెక్కిన ఫేస్ బుక్ బూతులు, మహిళల తిరుగుబాటుతో క్షమాపణలు

గత రెండు మూడు రోజులుగా ఫేస్ బుక్ లో కొందరు మగరాయుళ్ళు మహిళలకు వ్యతిరేకంగా అసభ్య రాతలు రాస్తున్నారు. తెలుగు బ్లాగర్ తాడేపల్లి లలితా బాల సుబ్రమణ్యం మహిళలను తీవ్రంగా అవమానిస్తూ ప్రారంభించిన ఒక టాపిక్ కింద కొందరు పురుష పుంగవులు చేరి వీరంగం వేశారు. అసభ్య వ్యాఖ్యలు చేస్తూ మహిళల గుణ గణాలను కించపరిచారు. చిన్న వయసులోనే అమ్మాయిలు శారీరక కోర్కెల కోసం వెంపర్లాడుతున్నారని, అలాంటివారికి పెళ్లిళ్లు చెయ్యకుండా వాళ్ళ తల్లిదండ్రులు డిగ్రీలు, పోస్టు గ్రాడ్యుయేషన్లు…

తాడేపల్లి బృందం అరెస్టుపై ‘ది హిందూ’ వార్త -కత్తిరింపు

తాడేపల్లి బృందం అరెస్టు విషయాన్ని బుధవారం ‘ది హిందూ’ పత్రిక వార్తగా ప్రచురించింది. హైద్రాబాద్ ఎడిషన్ లో మొదటి పేజిలో ఈ వార్తను ప్రచురించడం విశేషం. వార్త స్క్రీన్ షాట్ ను కింద చూడవచ్చు. (బొమ్మపై క్లిక్ చేసి పెద్ద సైజులో చూడగలరు.) –    

ఫేస్ బుక్ అరెస్టు: ఎస్.పి సస్పెన్షన్, జడ్జి బదిలీ

ఫేస్ బుక్ వ్యాఖ్యలను పట్టుకుని ఇద్దరు అమ్మాయిలను అరెస్టు చేసిన కేసులో తలలు తెగిపడుతున్నాయి. సుప్రీం కోర్టు మాజీ జస్టిస్, ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఛైర్మన్ జస్టిస్ మార్కండేయ కట్జు బహిరంగ హెచ్చరిక పర్యవసానంగా దేశ వ్యాపితంగా న్యాయ వర్గాలలో కూడా కాక పుట్టించిన ఫేస్ బుక్ అరెస్టు భారత ప్రజాస్వామ్య సౌధం బండారాన్ని బైటపెట్టే పరిస్ధితి తలెత్తడంతో బలి పశువుల తలలు దొర్లి పడుతున్నాయి. ధాణే జిల్లా ఎస్.పి (రూరల్) తో పాటు ఇద్దరు…