ఫ్రీ డేటా కోసం ఫేస్ బుక్ విసిరిన గేలం ‘ఫ్రీ బేసిక్స్’ -కార్టూన్

ఫేస్ బుక్ వ్యవస్ధాపకుడు మార్క్ జూకర్ బర్గ్ పేరు ఈ మధ్య ఇండియాలో తరచుగా వినిపిస్తోంది. భారత దేశంలోని పేదలకు ఉచితంగా ఇంటర్నెట్ సేవలు అందిస్తానంటూ ఆయన ప్రతిపాదించిన ‘ఫ్రీ బేసిక్స్’ ఇందుకు ప్రధాన కారణం. Free Basics పేరుతో ఫేస్ బుక్ కంపెనీ అందుబాటులో ఉంచుతున్న వేదిక ద్వారా పేద ప్రజలు సైతం ఉచితంగా ఇంటర్నెట్ సేవలను, విద్య-వైద్య-ప్రయాణ-ఉపాధి-ఆరోగ్య-వార్తా సేవలను పొందవచ్చని ఫేస్ బుక్ ఊరిస్తోంది. ఫ్రీ బేసిక్స్ గురించి ఇండియాలో ప్రచారం చేయడం కోసం…

సెల్ ఫోన్ లో ఫేస్ బుక్ తో జర జాగ్రత్త!

ఫేస్ బుక్ కూడా గూగుల్ కంపెనీ ఎత్తుగడలను అనుసరిస్తోంది. యాండ్రాయిడ్ మొబైల్ ఫోన్ వినియోగదారుల ఎస్.ఎం.ఎస్ లను, ఇతర వ్యక్తిగత రహస్య సమాచారాన్ని రికార్డు చేసి భద్రపరచుకోడానికి తమ వినియోగదారులకు ఫేస్ బుక్ వల వేస్తోందని ప్రముఖ కంప్యూటర్ భద్రతా కంపెనీ ‘కాస్పరస్కీ’ అధినేత కాస్పరస్కీ హెచ్చరించారు. యాండ్రాయిడ్ మొబైల్ ఆపరేటింగ్ సిస్టమ్ లోని తన అప్లికేషన్ (యాప్) ను ఫేస్ బుక్ తాజాకరించి, వ్యక్తిగత సమాచారాన్ని సేకరించేందుకు వీలయిన అంశాలను చొప్పించిందని ఆయన వివరించారు.  అమెరికా…

ఫేస్‌బుక్, గూగుల్ లపై ‘అశ్లీలత’ కేసులు

ఫేస్ బుక్, గూగుల్, మైక్రోసాఫ్ట్, యాహూ తదితర ఐ.టి సంస్ధలతో పాటు మొత్త ఇరవై ఒక్క సామాజిక వెబ్ సైట్లను వివిధ నేరాల క్రింద ప్రాసిక్యూట్ చెయ్యడానికి భారత ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. వివిధ తరగతుల ప్రజానీకం మధ్య శతృత్వాన్ని పెంపొందించడం, అశ్లీల సాహిత్యాన్ని పంపిణీ చెయ్యడం లాంటి నేరాలకు సాక్ష్యాలు ఉన్నందున సోషల్ నెట్‌వర్కింగ్ వెబ్ సైట్లను ప్రాసిక్యూట్ చెయ్యవచ్చని కేంద్ర ప్రభుత్వం నియమించిన కమిటీ తేల్చిచెప్పడంతో ప్రభుత్వం ఈ అనుమతిని మంజూరు చేసింది. శుక్రవారం…