అమెరికా ఆర్ధిక పరిస్ధితులే బ్లడ్ బాత్ కి కారణం -2

“రష్యాలో వర్షం కురిస్తే భారత కమ్యూనిస్టులు ఇండియాలో గొడుగు పట్టుకుంటారు” అని గతంలో పరిహాసం ఆడేవాళ్లు. బి‌జే‌పి పార్టీ, దాని అనుబంధ సంఘాల వాళ్ళకు ఈ పరిహాసం అంటే తగని ఇష్టంగా ఉండేది. “భారత స్టాక్ మార్కెట్ల పతనానికి మేము తెచ్చిన ఎల్‌టి‌సి‌జి పన్ను కారణం కాదు, బలహీన గ్లోబల్ (అమెరికా అని చదువుకోవాలి) ఆర్ధిక పరిస్ధితులే అందుకు కారణం” అని ఇప్పుడు బి‌జే‌పి మంత్రి జైట్లీ నిజాలను విడమరిచి చెబుతున్నాడు. అప్పుడు కమ్యూనిస్టులపై చేసిన పరిహాసం…

అనిశ్చితిని ముగించిన ఫెడ్ రేటు పెంపు -ది హిందు

[మొన్న అనగా డిసెంబర్ 16, 2015 తేదీన అమెరికా సెంట్రల్ బ్యాంకు -ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్- వడ్డీ రేటు 0.25 శాతం పెంచింది. ఇప్పుడు అమెరికా రిజర్వ్ బ్యాంక్ వడ్డీ రేటు 0.5 శాతం. డిసెంబర్ 2008లో ద్రవ్య సంక్షోభం చుట్టుముట్టడంతో కంపెనీలు తమ డబ్బు సంపదను ఎక్కడికక్కడ బిగదీసుకున్న నేపధ్యంలో ఆర్ధిక కార్యకలాపాలు స్తంభించిపోయిన దరిమిలా కదలిక తేవడానికి ప్రభుత్వమే మార్కెట్ లో డబ్బు కుమ్మరించడం మొదలు పెట్టింది. అలా కుమ్మరించడానికి వీలుగా వడ్డీ రేటును…

అమెరికా: వడ్డీ రేటు ఇప్పట్లో పెంచేది లేదు

తమ రిజర్వ్ బ్యాంక్ వడ్డీ రేటును ఇప్పట్లో పెంచడం సాధ్యం కాదని అమెరికా సెంట్రల్ బ్యాంక్ ‘ఫెడరల్ రిజర్వ్’ ప్రకటించింది. చికాగో రాష్ట్ర ఫెడరల్ రిజర్వ్ అధ్యక్షుడు చార్లెస్ ఇవాన్స్ ఈ మేరకు స్పష్టం చేశారని రాయిటర్స్ తెలిపింది. వడ్డీ రేటు పెంచితే ఇప్పుడిప్పుడే దారిలో పడుతున్న అమెరికా ఆర్ధిక వ్యవస్ధ మళ్ళీ గాడి తప్పుతుందని ఆయన అంచనా వేశారు. నిరుద్యోగం ఇంకా తీవ్రంగానే ఉన్నదని, బాగా తక్కువగా ఉన్న ద్రవ్యోల్బణం వడ్డీ రేట్ల పెంపు వల్ల…

అమెరికా మబ్బులు, ఇండియనోడి ఉబ్బులు

ఆంధ్ర ప్రదేశ్ లో, బహుశా కోస్తా ప్రాంతంలో, ఒక ముతక సామెత ఉంది. ఒక నిమ్న కులం యొక్క ఆర్ధిక వెనుకబాటుతనాన్ని, సామాజిక అణచివేతను పట్టిచ్చే సామెత అది. మరో విధంగా ఆ కులాన్ని న్యూనతపరిచే సామెత కూడాను. గురువారం ఎగిరెగిరి పడిన భారత స్టాక్ మార్కెట్లను గమనిస్తే ఈ సామెత గుర్తుకు రాక మానదు. అమెరికా ద్రవ్య పరపతి విధానాన్ని సమీక్షిస్తూ ఆ దేశ సెంట్రల్ బ్యాంకు ‘ఫెడరల్ రిజర్వ్’ ఛైర్మన్ అయిన బెన్ బెర్నాంక్,…

రూపాయి విలువ: కిం కర్తవ్యం? -కార్టూన్

గురువారం కొద్దిగా మెరుగుపడిన రూపాయి విలువ శుక్రవారం ఇంకొంత మెరుగుపడిందని మార్కెట్ వార్తలు సూచిస్తున్నాయి. అమెరికన్ రిజర్వ్ బ్యాంకు బెన్ బెర్నాంక్ ప్రకటనతో డాలర్ కొనుగోళ్ళు, రూపాయి అమ్మకాలు పెరగడం వలన చరిత్రలోనే అత్యంత కనిష్ట స్ధాయికి పడిపోయిన రూపాయి శుక్రవారం మధ్యాహ్నానికి డాలర్ కు రు. 59.82 పై ల స్ధాయికి పెరిగిందని తెలుస్తోంది. ఈ పెరుగుదలకు కూడా మళ్ళీ ఫెడరల్ రిజర్వ్ ప్రకటనే దోహదం చేయడం గమనార్హం. ఇండియా కరెంటు ఖాతా లోటు కాస్త…

క్లుప్తంగా… 27.04.2012

ఇరాన్ అణు బాంబు కి సాక్ష్యం లేదు –పెనెట్టా ఇరాన్ ‘అణు బాంబు’ నిర్మిస్తోందని ఖచ్చితమైన సాక్ష్యం ఏదీ దొరకలేదని అమెరికా రక్షణ కార్యదర్శి లియోన్ పెనెట్టా అన్నాడని ఎ.ఎఫ్.పి వార్తా సంస్ధ తెలిపింది. “ఇరానియన్లు అణుబాంబు తయారీకి నిర్ణయించినట్లు నిర్ధిష్ట సమాచారం ఏదీ నా వద్ద లేదు” అని పెనెట్టా అన్నాడు. చిలీ రక్షణ మంత్రితో సమావేశం అయిన అనంతరం విలేఖరులతో పెనెట్టా మాట్లాడాడు. ఇరాన్ అణు బాంబుకి ప్రయత్నిస్తున్నదంటూ అమెరికా, యూరప్ లు ఒత్తిడి…

మూడు దశాబ్దాల కనిష్ట స్ధాయికి పడిపోయిన అమెరికా వినియోగదారుల విశ్వాసం

ఆగష్టు నెలలో అమెరికా ఆర్ధిక వ్యవస్ధపై వినియోగదారుల విశ్వాసం మూడు దశాబ్దాల కనిష్ట స్ధాయికి పడిపోయిందని ధామ్సన్ రాయిటర్స్ / మిచిగాన్ యూనివర్సిటీ వినియోగదారుల సెంటిమెంట్ సూచి తెలిపింది. సూచి ప్రకారం జులై నెలలో సెంటిమెంట్ 63.7 శాతం నుండి 54.9 శాతానికి పడిపోయింది. మార్కెట్ అంచనా ప్రకారం ఇది 62 శాతానికి తగ్గవలసి ఉండగా, అంచనాలను తలదన్నుతూ కనిష్ట స్ధాయికి పడిపోవడం గమనార్హం. 1980 ఆగష్టు నెల తర్వాత ఈ స్ధాయికి పడిపోవడం ఇదే ప్రధమం…

అమెరికా కంపెనీలు లాభాల్లో, అమెరికా ఆర్ధిక వ్యవస్ధ నష్టాల్లో

2007-08 ప్రపంచ ఆర్ధిక సంక్షోభం ఫలితంగా అమెరికా ఆర్ధిక వ్యవస్ధ తీవ్రంగా దెబ్బతింది. 2009 వరకూ అమెరికాలోని కంపెనీలు కూడా తీవ్రమైన ఆర్ధిక కష్టాల్లో ఉన్నట్లు ప్రకటించాయి. లేమేన్ లాంటి ఫైనాన్సి దిగ్గజం నిట్ట నిలువునా కూలిపోవడంతో ప్రపంచం నిర్ఘాంతపోయింది. వాల్ స్ట్రీట్ లోని బహుళజాతి ద్రవ్య సంస్ధలైన ఇన్‌వెస్ట్‌మెంట్ బ్యాంకులన్నీ తోటి బ్యాంకులపై నమ్మకం కోల్పోయి ఒక్క సెంటు కూడా చేబదుళ్ళు, అప్పులు ఇవ్వడానికి నిరాకరించడంతో అప్పు దొరకడం గగనమైంది. “క్రెడిట్ క్రంచ్” గా పేర్కొన్న…