ఫెడరల్ ఫ్రంట్, ఆల్టర్నేట్ ఫ్రంట్… ఏది ధర్డ్ ఫ్రంట్?

దేశంలో నాలుగో కూటమి రూపు దిద్దుకుంటున్నట్లు కనిపిస్తోంది. నిన్నటి దాకా వామపక్ష పార్టీలతో సీట్ల సర్దుబాటుకోసం చర్చలు జరిపిన జయలలిత లెఫ్ట్ తో చర్చలు ముగిస్తున్నట్లు హఠాత్తుగా ప్రకటించారు. దానితో వామపక్షాలు, ఇతర కిచిడి పార్టీలు ఏర్పాటు చేసిన ‘ఆల్టర్నేట్ ఫ్రంట్’ లో జయలలిత చేరిక ఆగిపోయింది. ఎ.ఐ.డి.ఏం.కె అధినేత్రి వామపక్షాలతో ఎన్నికల బంధం తెంచుకోవడం ఒక ఎత్తయితే పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీకి ఫోన్ చేయడం మరో ఎత్తు. ఈ ఫోన్ కాల్ తో…

అద్వానీ, కూర్చున్న కొమ్మనే నరుక్కున్నారా? -కార్టూన్

బి.జె.పి అంతర్గత సంక్షోభం పై ది హిందూ పత్రిక స్ధిరంగా కేంద్రీకరించి కార్టూన్ లు ప్రచురిస్తోంది. గత పది రోజుల్లో ప్రచురించబడిన పది కార్టూన్ లలో ఆరు బి.జె.పి, ఆ పార్టీ నాయకులపైనే కావడం బట్టి ఈ సంగతి తెలుస్తోంది. ఈ ఆరింటిలో ఐదు కార్టూన్లు అంతర్గత సంక్షోభం పైన గీసినవే. పార్టీ పదవులకు రాజీనామా ద్వారా అద్వానీ ఏమి సాధించదలిచారు? పోనీ ఏమి సాధించారు? ఆవేశంతో రాజీనామా విసిరి కొట్టిన అద్వానీ తీరా ఆర్.ఎస్.ఎస్ ఆదేశాలతో…

రాజ్ నాధ్ సింగ్ బహుళ దిశల సవారి -కార్టూన్

బి.జె.పి అధ్యక్షుడి కర్తవ్య నిర్వహణ ఇప్పుడు కత్తి మీది సాము అయింది. కాదు, కాదు… కత్తి మీద సవారీ అయింది. ఆయన అటు ఎన్.డి.ఏ పక్షాలను దారికి తెచ్చుకోవాలి. ఇటు బి.జె.పి లోని నాయకులను ఒక దారిలో నడిచేట్లు చేయగలగాలి. అద్వానీ తిరుగుబాటుతో బి.జె.పి లోని చీలికలు స్పష్టంగా లోకానికి తెలిసి వచ్చాయి. ఇన్నాళ్లూ ఊహాగానాలతో సాగుతూ, బి.జె.పి నాయకుల తిరస్కరణలతో కప్పి ఉంచబడిన బి.జె.పి లుకలుకలకు అద్వానీ తిరుగుబాటు అచ్చమైన జీవం పోసింది. ఆర్.ఎస్.ఎస్ జోక్యంతో…