సైనిక స్ధావరం: జపాన్ లో అమెరికాకు ఎదురు దెబ్బ

ఒకినావాలో రెండో అమెరికా సైనిక స్ధావరం నెలకొల్పడానికి అమెరికా చేస్తున్న ప్రయత్నాలకు విఘాతం కలిగింది. ఫుటెన్మా లోని అమెరికా సైనిక స్ధావరాన్ని ఒకినావాకు తరలించాలని అమెరికా, జపాన్ ప్రభుత్వాలు భావిస్తుండగా స్ధానిక ప్రజలు దానిని వ్యతిరేకిస్తున్నారు. నూతన స్ధావరం ఏర్పాటు చేయాలని భావించిన నాగో పట్టణ ప్రభుత్వంలో స్ధావరం వ్యతిరేకులు మెజారిటీ పొందడంతో అమెరికా ప్రయత్నాలను తిప్పికొట్టేందుకు మార్గం సుగమం అయింది. జపాన్ లో 50,000 కుపైగా అమెరికా సైనికులు తిష్ట వేసుకుని ఉన్నారు. రెండో ప్రపంచ…