జపాన్ తో అణు ఒప్పందం -ద హిందూ..

  పౌర అణు సహకారం నిమిత్తం ఇండియా 11 దేశాలతో -అమెరికా, రష్యా, ఆస్ట్రేలియా, కెనడా, దక్షిణ కొరియాలతో సహా- ఒప్పందాలు చేసుకుంది. కానీ త్వరలో జపాన్ తో జరగనున్న ఒప్పందం పరిగణించదగినది. అణు దాడికి గురయిన ఏకైక దేశం జపాన్; కనుక అణ్వస్త్ర వ్యాప్తి నిషేధ ఒప్పందం (NPT ) పైన సంతకం చేయని ఇండియాతో అణు ఒప్పందంపై సంతకం చేయాలని ఆ దేశం నిర్ణయించడం తనకు మొదటిది అవుతుంది. ఫుకుషిమా ప్రమాదం తర్వాత జపాన్…

యూరప్ దేశాల్లో రేడియేషన్ ఆనవాళ్లు, ఫుకుషిమా కారణం కాదన్న ఐ.ఎ.ఇ.ఎ

యూరప్ లో అనేక చోట్ల వాతావరణంలో రేడియో ధార్మికత కనుగొన్నట్లుగా ఇంటర్నేషనల్ ఎటామిక్ ఎనర్జీ అసోసియేషన్ (ఐ.ఎ.ఇ.ఎ) సంస్ధ శుక్రవారం వెల్లడించింది. 11.11.11 తేదీన ప్రపంచ ప్రజలందరికీ శుభం జరుగుతుందని కాలజ్ఞానులు చెబుతున్న నేపధ్యంలో ఈ వార్త వెలువడడం గమనార్హం. రేడియో యాక్టివ్ అయోడిన్ – 131 మూలకానికి సంబంధించిన రేడియేషన్ తక్కువ స్ధాయిలో చెక్ రిపబ్లిక్ వాతావరణంలో కనిపించిందని ఐ.ఎ.ఇ.ఎ తెలిపింది. చెక్ రిపబ్లిక్కే కాక యూరప్ లోనే అనేక దేశాల్లో ఈ రేడియేషన్ కనిపించిందని…

ఫుకుషిమా శుభ్రతకు దశాబ్దాలు, అణు పరిశ్రమకు అంతం పలకాలని కోరుతున్న జపాన్

“జపాన్ కాంగ్రెస్ ఎగైనెస్ట్ అటామిక్ అండ్ హైడ్రోజన్ బాంబ్స్” మొదటి సమావేశం, భూకంపం, సునామీల వలన అణు ప్రమాదం సంభవించిన ఫుకుషిమాలో సోమవారం ప్రారంభమయ్యింది. అణు విద్యుత్ పరిశ్రమకు ఇక అంతం పలకాలని ఆ సదస్సు కోరింది. అణు విద్యుత్ కానీ, అణు బాంబులు కానీ ఏవీ వాంఛనీయం కాదనీ రెండూ మానవాళికి ప్రమాదకారులేననీ సమావేశం తెలిపింది. రిక్టర్ స్కేల్ పై 9 పరిమాణంతో మార్చి 11 న ఫుకుషిమా దైచి అణు ప్లాంటు వద్ద సంభవించిన…