వాడి పారేసిన అణు ఇంధనంతో అమెరికాకి పొంచిఉన్న పెనుప్రమాదం -నిపుణుడు

జపాన్ లో సంభవించిన భూకంపం, సునామీల వలన ఫుకుషిమా దైచి అణు విద్యుత్ కేంద్రానికి వాటిల్లిన ప్రమాదం అణు విద్యుత్ వలన ఏర్పడనున్న వైపరీత్యాలపై మరొకసారి దృష్టి సారించవలసిన అగత్యం ఏర్పడింది. అణు ప్రమాదాల వలన ప్రజలపై కలిగే ప్రభావాలకంటే అణు రియాక్టర్ల మార్కెట్ ను కాపాడుకునే విషయానికే ప్రాధాన్యం ఇస్తున్న నేటి ప్రభుత్వాలు అణు ప్రమాదాల వల్ల సంభవించిన అసలు నష్టాల్ని వెల్లడించడంలో నిజాయితీగా వ్యవరించడం లేదని ఆ పరిశ్రమతో సంబంధం ఉన్న అమెరికా నిపుణుడు…

ఫుకుషిమా ప్రమాదంలో రేడియేషన్ అంచనాకు రెట్టింపుకంటె ఎక్కువే విడుదలైంది

ఫుకుషిమా అణు ప్రమాదం వలన వాతావరణంలో విడుదలైన రేడియేషన్ ఇప్పటివరకూ అంచనా వేసినదానికంటే రెట్టింపుకంటె ఎక్కువేనని ప్రమాదంపై దర్యాప్తు జరపనున్న స్వతంత్ర నిపుణులతో కూడిన దర్యాప్తు సంస్ధ దర్యాప్తు ప్రారంభించడానికి ముందు జపాన్ అణు ఏజన్సీ వెల్లడించింది. అంతే కాకుండా మూడు రియాక్టర్లలో ఇంధన కడ్డీలు ఇప్పటిదాకా అనుకుంటున్న సమయానికంటే చాలా ముందుగానే కరిగి రియాక్టర్ల క్రింది బాగానికి చేరిందని ఏజెన్సీ చెబుతున్నది. వచ్చే జనవరిలోగా ఫుకుషిమా అణు కర్మాగారాన్ని మూసివేయోచ్చని అణు కర్మాగారం ఆపరేటర్ టోక్యో…

ఫుకుషిమా అణు ప్రమాదాన్ని జపాన్ తక్కువ అంచనా వేసింది -ఐక్యరాజ్య సమితి

మార్చి 11 న సంభవించిన భూకంపం, ఆ తర్వాత పెద్ద ఎత్తున విరుచుకుపడిన సునామీ వలన ఫుకుషిమా దైచి అణు విద్యుత్ కేంద్రానికి జరిగిన ప్రమాదాన్ని జపాన్ ప్రభుత్వం తక్కువ అంచనా వేసిందని ఐక్యరాజ్య సమితి అణు ఇంధన సంస్ధ ఐ.ఎ.ఐ.ఎ తన ప్రాధమిక నివేదికలో పేర్కొన్నది. సముద్రం ఒడ్డున నిర్మించిన ఫుకుషిమా కేంద్రానికి సునామీ వలన ఏర్పడగల ప్రమాదాన్ని అంచనా వేయడంలోనూ, తగిన ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడంలోనూ జపాల్ విఫలమైందని ఆ సంస్ధ తెలిపింది. నివేదికను…

అణు విద్యుత్‌ ఉత్పత్తిని పూర్తిగా నిషేధించటానికి జర్మనీ నిర్ణయం

అణు విద్యుత్ కర్మాగారాలకు సంబంధించి జర్మనీ ప్రభుత్వం సాహసోపేతమైన, ఆదర్శవంతమైన నిర్ణయం తీసుకుంది. 2022 కల్లా అణు విద్యుత్ ఉత్పత్తిని పూర్తిగా నిలిపి వేయాలని నిర్ణయించింది. ఇప్పుడున్న అణు కర్మాగారాలను దశలవారిగా మూసి వేస్తూ, 2022కల్లా అణు విద్యుత్ అనేదే దేశంలో లేకుండా చేయాలని నిర్ణయించుకుంది. జపాన్‌లో మార్చిలో సంభవించిన భూకంపం, సునామీల వలన 30,000 మంది చనిపోవడమో, ఆచూకీ గల్లంతవడమో జరిగింది. దాంతో పాటు ఫుకుషిమా అణు విద్యుత్ కేంద్రం భూకంపం, సునామీల ధాటికి బాగా…

జపాన్ అణు కర్మాగారం పేలనున్న టైంబాంబుతో సమానం -అణు నిపుణుడు

భూకంపం, సునామిల్లో దెబ్బతిన్న జపాన్ లోని ఫుకుషిమా దైచి అణువిద్యుత్ కర్మాగారం వద్ద రేడియేషన్ తగ్గుతోందని జపాన్ ప్రభుత్వం చెబుతున్నా, వాస్తవానికి అది పేలడానికి సిద్ధంగా ఉన్న టైంబాంబుతో సమానమని అమెరికాకి చెందిన అణు నిపుణుడు మిచియో కాకు హెచ్చరించాడు. న్యూయార్క్ లోని సిటీ యూనివర్సిటీలో ఫ్రొఫెసర్ గా పనిచేస్తున్న భౌతిక శాస్త్రవేత్త మిఛియో కాకు అమెరికాకి చెందిన డెమొక్రసీ నౌ టీవీ చానెల్ తో మాట్లాడుతూ జపాన్ అణు ప్రమాదానికి సంబంధించిన వాస్తవాలను వెల్లడించాడు. ఫుకుషిమాలోని…