యేడాదిలో అణు విద్యుత్ కు జర్మనీ ముగింపు! మరి ఇండియా!?
జర్మనీ సాంకేతికంగా అత్యంత అభివృద్ధి చెందిన దేశం. యూరోపియన్ యూనియన్ కు నాయక దేశం. ఐరోపాలో జర్మనీ తర్వాతే ఏ దేశమైనా. ఫ్రాన్స్, ఇంగ్లండ్ లు జర్మనీ తర్వాతే. జర్మనీని ఐరోపా ఆర్ధిక వ్యవస్ధకు ఇంజన్ లాంటిది అని కూడా అంటారు. అలాంటి జర్మనీ మరో యేడాదిలో తన దేశంలో ఉన్న అణు విద్యుత్ ని ఉత్పత్తి చేసే కేంద్రాలు అన్నింటినీ మూసివేయబోతోంది. జర్మనీలో ప్రస్తుతం ఆరు మాత్రమే అటు విద్యుత్ ప్లాంట్ లు మిగిలి ఉన్నాయి.…