ఆర్.బి.ఐ ఆశ్చర్యకర వడ్డీ కోత! -ది హిందు

మార్కెట్లను ఆశ్చర్యంలో ముంచెత్తగల సామర్ధ్యం సెంట్రల్ బ్యాంకింగ్ యొక్క ముఖ్యమైన లక్షణాలలో ఒకటి. ఆర్.బి.ఐ గవర్నర్ రఘురాం రాజన్, గురువారం నాడు వడ్డీ రేట్లను 0.25 శాతం మేర తగ్గించడం ద్వారా దానిని కనబరిచారు. గత వారం రోజుల్లో ద్రవ్యోల్బణము, పారిశ్రామిక ఉత్పత్తిలకు సంబంధించి సానుకూల ఆర్ధిక ఫలితాలు వెలువడడంతో వడ్డీ తగ్గింపు ఉంటుందని అంచనా వేశారు. అలాంటి తగ్గింపు ఏదన్నా ఉన్నట్లయితే అది ఫిబ్రవరి 3 వ తేదీ నాటి ద్వైమాస విత్త విధాన సమీక్షలో…

అధిక ఫిస్కల్ లోటు ఋణ సంక్షోభానికి దారి -ఈనాడు

ఈ వారం ఈనాడు పత్రికలో ఫిస్కల్ డెఫిసిట్, రెవిన్యూ డెఫిసిట్ ల గురించి చర్చించాను. మార్కెట్ ఎకానమీ ఉన్న ఆర్ధిక వ్యవస్ధల్లో ఫిస్కల్ డెఫిసిట్ (కోశాగార లోటు) కు అత్యంత ప్రాధాన్యం ఉంటుంది. దేశంలో ఆర్ధిక సంక్షోభ పరిస్ధితులు నెలకొని ఉన్నప్పుడు, “మన ఎకనమిక్ ఫండమెంటల్స్ స్ధిరంగా ఉన్నాయి. ఇబ్బందేమీ లేదు” అని ఆర్ధిక మంత్రులు, ప్రధాన మంత్రులు మేకపోతు గాంభీర్యంతో చెబుతుంటారు. అలాంటి ఫండమెంటల్స్ లో ఫిస్కల్ డెఫిసిట్ ఒకటి. ప్రభుత్వాలు రాబడి కంటే ఖర్చు…

2జి స్పెక్ట్రం: జనవరి 11 లోపు వేలం వేయండి, లేదా… -సుప్రీం కోర్టు

2జి స్పెక్ట్రమ్ వేలం వేయడాన్ని పదే పదే వాయిదా వేయడం పట్ల సుప్రీం కోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. ఆగస్టు 31 తో వేలం పూర్తి కావాలని సుప్రీం కోర్టు విధించిన గడువును వాయిదా వేయాలని కేంద్ర ప్రభుత్వం చేసిన విజ్ఞప్తిని కోర్టు మన్నిస్తూ జనవరి 11, 2013 లోపు వేలం ప్రక్రియ పూర్తి కావాలని ఆదేశించింది. జనవరి 18 కల్లా వేలంలో విజయం సాధించిన కంపెనీల జాబితా తనకు సమర్పించాలని కోరింది. లేనట్లయితే సంబంధిత అధికారులపై…

Budget 2012-13

2012-13 బడ్జెట్ -కార్టూన్

(ఫస్ట్ పోస్టు నుండి) సోనియా: “గత సంవత్సరం వచ్చిన మంచి అనుభవంతో ఇసారి మెరుగైన బడ్జెట్ ఇస్తారని ఆశిస్తున్నా” గత సంవత్సరం బడ్జెట్ లో అనుకున్న లక్ష్యాలు చెరుకోలేదని భారత ప్రభుత్వంపైన అనేకమంది విమర్శలు చేస్తున్నారు. వారిలో స్వదేశీ, విదేశీ పత్రికలు, కార్పొరేట్ కంపెనీలు, పెట్టుబడిదారుల సంఘాలైన ఆసోచామ్, ఫిక్కీ, సి.ఐ.ఐ లూ వీరిలో ముఖ్యులు. గత బడ్జెట్లో బడ్జెట్ లోటు జిడిపిలో 4.6 శాతం ఉంటుందని అంచనా వేసినా దాన్ని చేరుకోలేక 5.9 శాతానికి ప్రభుత్వం…

European Union -Tracks never meet

యూరోపియన్ యూనియన్, యూరోజోన్: ఎన్నడూ కలవలేని పట్టాలు -కార్టూన్

యూరోపియన్ యూనియన్ ఎదుర్కొంటున్న రుణ సంక్షోభం ఎలా పరిష్కారం చేసుకోవాలో తెలియక బుర్ర బద్దలు కొట్టుకుంటున్న పరిస్ధితిని ఈ కార్టూన్ సూచిస్తోంది. యూరోపియన్ యూనియన్ (ఇ.యు) దాని సభ్య దేశాల మధ్య రాజకీయ ఐక్యతను సూచించే సంస్ధ కాగా, యూరో జోన్ (ఇ.జెడ్) సంస్ధ దాని సభ్య దేశాల కోశాగార ఐక్యత (ఫిస్కల్ యూనిటీ) ని సూచించే సంస్ధ. ఇ.యులో 27 సభ దేశాలు ఉన్నాయి. వీటిలో 17 దేశాలు మాత్రమే ‘యూరో’ ను తమ ఉమ్మడి…

మరింత క్షీణిస్తున్న భారత ఆర్ధిక వృద్ధి, లక్ష్య సిద్ధి అనుమానమే

భారత దేశ ఆర్ధిక వృద్ధి మరింత క్షీణిస్తున్న సూచనలు కనిపిస్తున్నాయి. వివిధ రంగాల్లో ఉత్పత్తి పెరుగుదల రేటు తగ్గిపోతుండడంతో జి.డి.పి వృద్ధి రేటు అంచనా వేసిన దానికంటే తక్కువే నమోదు కావచ్చని ప్రభుత్వంలోని ఆర్ధిక సంస్ధలు, పరిశీలకులు భావిస్తున్నారు. దానితో గతంలో విధించుకున్న జిడిపి వృద్ధి రేటు లక్ష్యాన్ని ప్రభుత్వం తగ్గించుకుంటోంది. జి.డి.పి వృద్ధితో పాటు మార్చి 2011 నాటికి చేరాలని భావిస్తున్న బడ్జెట్ లోటు (ఫిస్కల్ డెఫిసిట్), ద్రవ్యోల్బణం తదితర లక్ష్యాలను కూడా ప్రభుత్వం తగ్గించుకుంటోంది.…

అప్పు పరిమితి పెంపుపై ఒప్పందం శూన్యం, టాప్ క్రెడిట్ రేటింగ్ కోల్పోనున్న అమెరికా?

అమెరికా అప్పు పరిమితిని 14.3 ట్రిలియన్ డాలర్లనుండి పెంచడానికి ఒబామాకి, రిపబ్లికన్లు మెజారిటీగా ఉన్న హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ కి మధ్య ఒప్పందం కనుచూపు మేరలో కనిపించడం లేదు. ఆగస్టు 2 లోపు అప్పు పరిమితి పెంచడంపై నిర్ణయం తీసుకోనట్లయితే అమెరికా అప్పు చెల్లించలేని పరిస్ధితి వస్తుందని ట్రేజరీ సెక్రటరీ తిమోతి గీధనర్ ఇప్పటికె పలుమార్లు హెచ్చరించాడు. దీనితో అమెరికా సావరిన్ అప్పు రేటింగ్ (క్రెడిట్ రేటింగ్) ను, మూడు క్రెడిట్ రేటింగ్ సంస్ధల్లో ఏదో ఒకటి…

కొత్త ఆర్ధిక సంవత్సరంలో ఇండియా అప్పు రూ. 4.5 ట్రిలియన్లు -రాయిటర్స్ సర్వే

రానున్న ఆర్ధిక సంవత్సరంలో (2011-12) 4.5 ట్రిలియన్ల రూపాయల (4.5 లక్షల కోట్ల రూపాయలు) అప్పును ఇండియా సేకరించే అవకాశం ఉందని రాయిటర్స్ వార్తా సంస్ధ సర్వేలో తేలింది. ఇది 99.3 బిలియన్ల డాలర్లకు (99,300 కోట్ల రూపాయలు) సమానం. ప్రభుత్వాలు “సావరిన్ డెట్ బాండ్లు” జారీ చేయటం ద్వారా అప్పును సేకరిస్తాయి. వివిధ ఫైనాన్షియల్ (ద్రవ్య) కంపెనీలు, ఆర్ధిక రేటింగ్ కంపెనీలు, విశ్లేషణా సంస్ధలు, అర్ధిక మేధావులు మొదలైన వారిని వార్తా సంస్ధలు సర్వే చేసి…