బడ్జెట్ 2016: పాపులిస్టు ముసుగులో సంస్కరణలు -2
విద్య, ఆరోగ్యం, కుటుంబ, స్త్రీ శిశు సంక్షేమం ఈ రంగాలకు కేటాయింపులు భారీగా పెంచినట్లు మోడి-జైట్లీ బడ్జెట్ చూపింది. బడ్జెట్ లో భారీ కేటాయింపులు చూపడం ఆనక చడీ చప్పుడు కాకుండా సవరించి కోత పెట్టడం మోడి మార్కు ‘బడ్జెట్ రాజకీయం’. వివిధ శాఖల్లోని అంకెలను కలిపి ఒకే హెడ్ కింద చూపుతూ భారీ కేటాయింపులు చేసినట్లు చెప్పుకోవడం కూడా మోడి మార్కు మాయోపాయం. ఉదాహరణకి స్త్రీ, శిశు సంక్షేమం కింద బడ్జెట్ లో చూపినదంతా స్త్రీ,…