ట్రంప్ అమెరికా: పరవళ్ళు తొక్కుతున్న యుద్ధోన్మాదం -1

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలకు మంగళం పాడాడు. మధ్య ప్రాచ్యం (ముఖ్యంగా సిరియా), ఇరాన్, చైనా, లాటిన్ అమెరికా, రష్యా, లిబియా, యెమెన్, ఆర్ధిక రంగం… ఇలా అన్ని చోట్లా అన్ని రంగాల్లోనూ ఆయన తన ఎన్నికల హామీలకు విరుద్ధంగా చర్యలు చేపడుతున్నాడు. ఆయన వాగ్దానాలను నమ్మి యుద్ధ వాతావరణం ఎంతో కొంత ఉపశమిస్తుందని ఆశించిన విశ్లేషకులు ఇప్పుడు లెంపలు వేసుకుంటున్నారు. అమెరికా పాలకవర్గాలలోని గ్రూపుల మధ్య నెలకొన్న తీవ్ర ఘర్షణలో ట్రంప్…

అమెరికా ఆయుధ కొనుగోళ్లు రద్దు -ఫిలిప్పైన్స్

  ఇటీవల అధికారం చేపట్టినప్పటి నుండి అమెరికాపైనా అధ్యక్షుడు ఒబామా పైనా బహిరంగానే విరుచుకుపడుతున్న ఫిలిప్పైన్స్ అధ్యక్షుడు డ్యుటెర్టె తాజాగా మరో సారి విరుచుకు పడ్డాడు. ఇప్పటి వరకు దూషణలకు, సవాళ్లకు పరిమితమైన ఆయన ఇప్పుడు ఏకంగా చర్యల లోకి దిగినట్లు కనిపిస్తున్నది.  ఫిలిప్పైన్స్ పోలీసుల వినియోగం కోసం అమెరికా నుండి భారీ మొత్తంలో రైఫిల్స్ కొనటానికి గతంలో ఒప్పందం కుదిరింది. ఆ ఒప్పందాన్ని పక్కన బెట్టి మరో దేశం నుండి రైఫిల్స్ కొనుగోలు చేస్తామని డ్యుటెర్టె…

శవాల దిబ్బ టాక్లోబన్, హైయన్ ముందూ తర్వాతా

ఇటీవల ఫిలిప్పైన్స్ లో సభవించిన సూపర్ టైఫూన్ హైయన్ ధాటికి అతలాకుతులం అయిన సమర్, లేటే రాష్ట్రాలు ఇంకా కోలుకోలేదు. మరణాల సంఖ్య పూర్తిగా అంచనా వేయడం ప్రభుత్వం చేతుల్లో లేకుండా పోయింది. బడా మాల్స్ నుండి జనం లూటీలకు పాల్పడకుండా భారీ భద్రత అయితే ఇచ్చారు గానీ జనం ఆకలి, అవసరాలు తీర్చడంలో మాత్రం ఫిలిప్పైన్స్ ప్రభుత్వం ఇంకా వెనుకబడే ఉంది. హైయాన్ ధాటికి బాగా దెబ్బ తిన్న నగరం టాక్లోబన్. 220,000 మంది నివసించే…

ఫిలిప్పైన్స్: హైయన్ మరణాలు పది వేలు?

రాక్షస తుఫాను హైయన్ ధాటికి ఫిలిప్పైన్స్ విలవిలలాడింది. మహా పెను తుఫాను ధాటికి 10,000 మందికి పైగా మరణించి ఉంటారని భయపడుతున్నారు. ఒక్క లేటి ద్వీప రాష్ట్రంలోనే 10,000 మందికి పైగా మరణించారని, సమర్ ద్వీపంలో మరణాలు కూడా కలుపుకుంటే ఈ సంఖ్య ఇంకా పెరుగుతుందని ఫిలిప్పైన్స్ అధికారులు చెబుతున్నారు. లేటే రాష్ట్రం మొత్తం దాదాపు నాశనం అయిందని స్ధానిక అధికారులను ఉటంకిస్తూ రష్యా టుడే తెలిపింది. లేటి రాష్ట్రంలో 80 శాతం భాగం పూర్తిగా ధ్వంసం…

ఫిలిప్పైన్స్ ని ఊపేసిన రాక్షస తుఫాను ‘హైయాన్’

ఈ సంవత్సరం ఇప్పటికే అనేక ప్రకృతి విలయాలతో డస్సిపోయిన ఫిలిప్పైన్స్ ను శుక్రవారం మరో భారీ తుఫాను ఊపేసింది. ‘చరిత్రలోనే అది అతి పెద్ద తుఫాను’ అని పత్రికలు చెబుతున్నాయి. సూపర్ టైఫూన్ గా చెబుతున్న ఈ తుఫాను ధాటికి 100 మంది చనిపోయారనీ, ఈ సంఖ్య ఇంకా అనేక రెట్లు పెరగవచ్చని ఫిలిప్పైన్స్ ప్రభుత్వం చెబుతోంది. గంటకు 315 కి.మీ వేగంగా గాలులు వీస్తున్నట్లు రష్యా టుడే తెలిపింది. బ్రిటన్ పత్రిక డెయిలీ మెయిల్, గాలుల…

అమెరికా సెనేట్‌లో విచిత్రం, వివాద పరిష్కారానికి చైనా బలప్రయోగంపై ఖండన తీర్మానం

అమెరికా సెనేట్‌లో సోమవారం ఒక విచిత్రం చోటు చేసుకుంది. బహుశా ప్రపంచ వింతల్లో ఒకటిగా ఇది స్ధానం సంపాదించుకోవచ్చు. దక్షిణ చైనా సముద్రంలో వివాదాల పరిష్కారానికి చైనా బల ప్రయోగం చేయడాన్ని ఖండిస్తూ అమెరికా సెనేట్ ఒక తీర్మానాన్ని ఆమోదించింది. అదీ ఏకగ్రీవంగా. ఒక దేశానికి ‘బల ప్రయోగం చేయడం తగదు” అని సుద్దులు చెప్పే అర్హత అమెరికా తనకు తాను దఖలు పరుచుకోవడమే ఇక్కడ వింత. బల ప్రయోగం చేస్తే చైనాని నిస్సందేహంగా తప్పు పట్టవలసిందే.…