ఇటలీ, స్పెయిన్ ల రేటింగ్ తగ్గించిన ‘ఫిచ్ రేటింగ్స్’

ఫిచ్ క్రెడిట్ రేటింగ్ సంస్ధ ఇటలీ, స్పెయిన్ దేశాల క్రెడిట్ రేటింగ్ తగ్గించింది. ఇటలీ, స్పెయిన్ దేశాలు యూరో జోన్ లో వరుసగా మూడవ, నాల్గవ అతి పెద్ద ఆర్ధిక వ్యవస్ధలున్న దేశాలు కావడం గమనార్హం. ఇటలీ రేటింగ్ ఎ+ నుండి ఎఎ- కు ఒక మెట్టు తగ్గించగా, స్పెయిన్ రేటింగ్ ను ఎఎ+ నుండి ఎఎ- కు (‘ఎఎ+’ నుండి ‘ఎఎ’ ను వదిలి ‘ఎఎ-‘ కు తగ్గించడం) రెండు మెట్లు తగ్గించింది. రెండింటి ఔట్‌లుక్…

అమెరికా, గ్రీసు దేశాలు సమయానికి అప్పు చెల్లించలేక పోవచ్చు -ఫిచ్ రేటింగ్స్

అమెరికా, గ్రీసు దేశాల అప్పు చెల్లింపుల సామర్ధ్యం పైన ఫిచ్ రేటింగ్స్ సంస్ధ మరొకసారి ఆందోళన వ్యక్తం చేసింది. ఆగస్టు నెలలో రెండు దేశాలు తాము జారీ చేసిన సావరిన్ అప్పు బాండ్లపై వడ్డీ చెల్లింపులతో పాటు కొన్నింటికి మెచ్యూరిటీ చెల్లింపులు చేయవలసి ఉంది. అమెరికా అప్పుపై ఉన్న గరిష్ట పరిమితికి ఇప్పటికే చేరుకున్నందునా, గ్రీసు మరో విడత పొదుపు బడ్జెట్‌ను ప్రజల తీవ్ర వ్యతిరేకత వలన ఆమోదించలేక పోతున్నందున ఐ.ఎం.ఎఫ్, ఇ.యులు ఆ దేశానికి ఇవ్వవలసిన…