నాజీ హత్యాక్షేత్రం ‘ఆష్విజ్’ విముక్తికి 70 యేళ్ళు -ఫోటోలు

జనవరి 26 తేదీ మనకి రిపబ్లిక్ దినంగా తెలుసు. ఆ తేదీకి ప్రపంచం గుర్తుంచుకునే ప్రాముఖ్యత కూడా మరొకటి ఉన్న సంగతి మనలో చాలా మందికి తెలియదు. నాజీ సైన్యం దెబ్బకి మహా ఘనత వహించిన ఐరోపా రాజ్యాలన్నీ తోకముడిచి పారిపోవడమో, చేతులెత్తి లొంగిపోవడమో చేస్తున్న దశలో ఆ హంతక సైన్యానికి ఎదురొడ్డి పోరాడి నిలిచిన ఒకే ఒక్క దేశం  సోవియెట్ రష్యా. బోల్శివిక్ సైన్యం ధాటికి నాజీ సైన్యమే కకావికలై పరుగులు తీస్తుంటే వారిని వెన్నంటి…