ఓర్లాండో షూటింగ్: నిమిషంలో 49 మందిని చంపేశాడా?

ఒర్లాండో షూటింగ్ గుర్తుందాండి? జూన్ 12 తేదీ ఆదివారం రాత్రి (తెల్లవారు ఝామున) 2 గంటల నుండి ఉదయం 5 గంటల వరకు పల్స్ నైట్ క్లబ్ లో తుపాకులతో కాల్చి 49 మందిని చంపేశాడని, మరో 53 మందిని గాయపరిచాడని పత్రికలు మనకు చెప్పిన సంఘటన! ఇలాంటి షూటింగ్ లను, తద్వారా జరుగుతున్న రక్తపాతాన్ని ‘లోన్ వోల్ఫ్ ఆటాక్స్’ గా అమెరికా భద్రతా సంస్ధలు చెబుతున్నాయని, వారి కధలను, కధనాలను భారత పత్రికలు అంది పుచ్చుకుని…

బోస్టన్ పేలుళ్లు: నిందితులు ఎఫ్.బి.ఐ నిఘాలో ఉన్నవారే

బోస్టన్ బాంబు పేలుళ్లకు బాధ్యులుగా అమెరికా ప్రకటించిన చెచెన్యా జాతీయులు అనేక సంవత్సరాలుగా ఎఫ్.బి.ఐ నిఘాలో ఉన్నవారేనని వారి తల్లిదండ్రులు చెబుతున్నారు. ఎఫ్.బి.ఐ నిఘాలో ఉన్నవారు బాంబులు అభివృద్ధి చేసి సి.సి కెమెరాలు చూస్తుండగా వాటిని సంచుల్లో పెట్టుకుని బోస్టన్ మారధాన్ స్ధలానికి తెచ్చి ఎలా పేల్చగలరని తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. తమ పిల్లలిద్దరిని కుట్ర చేసి ఇరికించారని తల్లిదండ్రులు ఆరోపించినట్లు రష్యా టుడే తెలియజేసింది. ఎఫ్.బి.ఐ గూఢచారులు ఎప్పుడూ తమ ఇంటికి వచ్చేవారని, తమ పిల్లల గురించి…