నేను మార్క్సిస్టుని! -దలైలామా

కమ్యూనిజానికి కాలం చెల్లిందని నమ్ముతున్నవారికిది దుర్వార్త! హిందూ మతోన్మాదాన్ని పీకలదాకా ఎక్కించుకుని, బుద్ధుడిని హిందూ మతంలో కలిపేసుకుని, చైనామీద వ్యతిరేకతతో దలైలామా పైన ప్రేమ పెంచుకున్న జీవులకు, బహుశా డిప్రెషన్ లోకి నెట్టివేసే విషాద వార్త! దలైలామా సైతం ‘నేను మార్క్సిస్టుని’ అని చాటుకోవడం కంటే మించిన విషాదకర దుర్వార్త ఉండగలదా? “సామాజికార్ధిక సిద్ధాంతానికి సంబంధించినంతవరకు నేను ఇంకా మార్క్సిస్టునే” అని దలైలామా ప్రకటించారు. “నేను ఇంకా” అనడం ద్వారా తాను పూర్వాశ్రమంలో ‘మార్క్సిస్టుని’ అని దలైలామా…