పెట్టుబడుల క్లియరెన్స్ ప్రధాని మోడి చేతుల్లోకి
‘మేక్ ఇన్ ఇండియా’ నినాదం ద్వారా భారత దేశంలోకి విరివిగా విదేశీ పెట్టుబడులను ఆకర్షించాలని కలలు గంటున్న ప్రధాన మంత్రి మోడి ఆ వైపుగా అడుగులు వేగంగా వేస్తున్నారు. మన్మోహన్ హయాంలో యు.పి.ఏ 2 పాలన చివరి రోజుల్లో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, విదేశీ-స్వదేశీ ప్రైవేటు పెట్టుబడుల క్లియరెన్స్ కు ఏర్పాటు చేసిన ‘ప్రాజెక్టు మానిటరింగ్ గ్రూప్’ (పి.ఎం.జి) ను ప్రధాని మోడి తన చేతుల్లోకి తీసుకున్నారని పేరు చెప్పని అధికారులను ఉటంకిస్తూ రాయిటర్స్ వార్తా…