ఎన్నికల విజయం, రాజకీయ ఓటమి -ది హిందు ఎడిట్..

[‘Electoral victory, political defeat’ శీర్షికన ఈ రోజు ది హిందులో ప్రచురితం అయిన సంపాదకీయానికి ఇది యధాతధ అనువాదం. ఈ మధ్య కాలంలో ది హిందు నుండి అరుదుగా మారిన సంపాదకీయ రచనల్లో ఇది ఒకటి. -విశేఖర్] మెరుగైన ప్రజాస్వామిక మరియు పారదర్శక పాలన అందించే లక్ష్యమే తన ఉనికికి కారణంగా చెప్పుకునే ఆమ్ ఆద్మీ పార్టీకి అత్యున్నత నాయకత్వ స్ధాయిలో ఎదురవుతున్న కష్టాలు ఆ పార్టీ ఉనికికే ప్రమాదకరంగా పరిణమించాయి. ఢిల్లీ ముఖ్యమంత్రి మరియు పార్టీ జాతీయ కన్వీనర్…

(విజిల్ బ్లోయర్) పేరు వెల్లడి వల్ల ప్రమాదాలు -ది హిందు ఎడిటోరియల్

(ఒకపక్క 2జి, బొగ్గు కుంభకోణాల కేసుల్లో సుప్రీం కోర్టు కేంద్రీకరించి పని చేస్తుంటే మరో పక్క ఆ కేసుల్లోని నిందితులు తరచుగా సి.బి.ఐ డైరెక్టర్ రంజిత్ సిన్హా ఇంటిని సందర్శిస్తున్న సంగతిని ‘సెంటర్ ఫర్ పబ్లిక్ ఇంటరెస్ట్ లిటిగేషన్’ సంస్ధ సుప్రీం కోర్టు దృష్టికి తెచ్చింది. భారీ కుంభకోణాల లోని నిందితులతో దేశంలోని అత్యున్నత విచారణ సంస్ధ అధిపతే చెట్టాపట్టాలు వేసుకుంటే విచారణలో పాల్గొంటున్న అధికారులపై ప్రతికూల ఒత్తిడి ఉంటుందని కనుక రంజిత్ సిన్హాను సి.బి.ఐ డైరెక్టర్…

ఢిల్లీ విద్యుత్: కాగ్ ఆడిట్ పితలాటకం

ఢిల్లీ రాష్ట్రంలో విద్యుత్ పంపిణీ మూడు ప్రైవేటు కంపెనీల ఆధీనంలో ఉన్నది. షీలా దీక్షిత్ రెండో ప్రభుత్వం, తన ఆధీనంలో ఉన్న విద్యుత్ పంపిణీని ప్రైవేటు కంపెనీలకు అప్పజెప్పిన పుణ్యం కట్టుకున్నారు. దానికి ఆమె చెప్పిన బృహత్కారణం విద్యుత్ ప్రసార నష్టాలను తగ్గించడం, విద్యుత్ దొంగతనాలను అరికట్టడం. ఆ రెండూ ప్రభుత్వం ఆధీనంలో ఉన్నపుడు ఎందుకు జరగవో ఆమె చెప్పినట్లు లేదు. చెప్పినా, చెప్పకపోయినా ఈ కారణాలు చెప్పడం ద్వారా తమ ప్రభుత్వం చేతగానితనాన్నే ఆమె చాటుకున్నారు.…

కాశ్మీర్: ఎఎపి ఆఫీసు దాడి, హిందూ రక్షా దళ్ నేత అరెస్ట్

బుధవారం ఉదయం ఘజియాబాద్, కౌసాంబి లోని ఎఎపి ప్రధాన కార్యాలయం పైన హిందూ రక్షా దళ్ పేరుతో 40 మందితో కూడిన మూక దాడి చేసింది. అక్కడ ఉన్న పూల కుండీలను వాళ్ళు పగల గొట్టారు. పార్టీ ఫ్లెక్సీలను చించేశారు. తలుపులు, కిటికీలకు ఉన్న అద్దాలను పగల గొట్టారు. ఇక హిందూ మతాన్ని కాపాడుతాం… లాంటి నినాదాలు మామూలే. సుప్రీం కోర్టు ఎదురుగా ఉన్న తన కార్యాలయంలోకి రెండేళ్ల క్రితం జొరబడి దాడి చేసి కొట్టింది కూడా…

ఎఎపి కాశ్మీరు (ద్వంద్వ) విధానం -కార్టూన్

“మన కాశ్మీరు పాలసీ పైన జనాభిప్రాయం ఏమిటో ఎస్.ఎం.ఎస్, ట్విట్టర్ ల ద్వారా తెలుసుకోవాల్సింది కాదా?” – కాశ్మీరు విషయంలో ఆమ్ ఆద్మీ పార్టీ తన సాధారణ విధానం నుండి పక్కకు తప్పుకుంది. ప్రతి పనికీ ప్రజల అభిప్రాయాన్ని కోరే ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు అటువంటి విధానం కాశ్మీరు ప్రజలకు మాత్రం వర్తించదని తన వింత విధానం ప్రకటించారు. అంటే ఆమ్ ఆద్మీ పార్టీ కూడా ద్వంద్వ విధానం కలిగి ఉందన్నట్లే, ముఖ్యంగా కాశ్మీరు విషయంలో.…

అవినీతి రాజకీయ వ్యవస్ధకు మోడి ప్రతినిధి -ఎఎపి

భారత దేశంలోని అత్యంత అవినీతిమయమైన రాజకీయ వ్యవస్ధకు మాత్రమే నరేంద్ర మోడి ప్రతినిధి అని ఆయన పార్టీ చెప్పుకుంటున్నట్లు మార్పుకు ప్రతినిధి ఎంత మాత్రం కాదని ఆమ్ ఆద్మీ పార్టీ ఆరోపించింది. బహుశా మోడిని నేరుగా విమర్శించడం ఎఎపికి ఇదే మొదటిసారి కావచ్చు. అరవింద్ కేజ్రీవాల్ గతంలో కొన్ని విమర్శలు చేసినప్పటికీ అవి ‘కర్ర విరగకుండా, పాము చావకుండా’ అన్నట్లు సాగాయి. ఈసారి కూడా విమర్శ చేసింది మరో నాయకుడు ప్రశాంత్ భూషణ్, అరవింద్ కాదు. “కాంగ్రెస్,…

మా బృందంలో ప్రశాంత్ భూషణ్ కొనసాగేదీ లేనిదీ తర్వాత నిర్ణయిస్తాం -అన్నా హజారే

అన్నా హజారే బృందంలో ప్రముఖ సభ్యుడు లాయర్ ప్రశాంత్ భూషణ్ పై శ్రీరాం సేన, భగత్ సింగ్ క్రాంతి సేన సభ్యులుగా చెప్పుకుంటున్న ముగ్గురు వ్యక్తులు దాడి చేసి కొట్టాక అన్నా హజారే బృందం కేంద్రంగా కొన్ని మార్పులు వేగంగా జరిగిపోతున్నాయి. ‘కాశ్మీరు ప్రజలలో ప్రజాభిప్రాయ సేకరణ జరిపి వచ్చే ఫలితాల్లో వేరు పడాలని వారు కోరితే వారికా అవకాశం ఇవ్వాలి” అని ప్రశాంత్ భూషణ్, వారణాసిలో జరిగిన ఒక సమావేశంలో చెప్పడమే తమ దాడికి కారణమని…

టీం అన్నా సభ్యుడిపై ‘శ్రీరాం సేన’ దాడి, కాశ్మీరు సమస్యపై వ్యాఖ్యే కారణం

మత మూఢులకి పరమత సహనం ఎలాగూ ఉండదు. వారికి ప్రజాస్వామ్య భావాల పట్ల కూడా గౌరవం ఉండదు. తమ నమ్మకాలకు భిన్నమైన భావాలను సహించడాం వారి వల్ల కాదు. అది ముస్లిం మతం కావచ్చు, హిందూ మతం కావొచ్చు, లేదా క్రిస్టియన్ మతం కావొచ్చు. అందుకు తార్కాణంగా సాక్ష్యాత్తూ సుప్రీం కోర్టు ప్రాంగణంలోనే బుధవారం ఒక సంఘటన చోటు చేసుకుంది. అన్నా హజారే బృందంలో ప్రముఖ సభ్యుడు, సుప్రీం కోర్టులో ప్రముఖ న్యాయవాది అయిన ప్రశాంత్ భూషణ్…