కాంట్రాక్టు నిబంధనలను రిలయన్స్ ఉల్లంఘించింది -కాగ్ అక్షింతలు

భారత దేశ రాజ్యాంగసంస్ధ, ప్రభుత్వ ఉన్నత ఆడిటింగ్ సంస్ధ అయిన ‘కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్’ రిలయన్స్ ఇండస్ట్రీస్ కాంట్రాక్టు ఉల్లంఘనలపై తన పూర్తి నివేదికను గురువారం సమర్పించింది. ఈ నివేదికలో కేంద్ర ప్రభుత్వం, రిలయన్స్ ఇండస్ట్రీస్ రెండింటినీ కాగ్ విమర్శించింది. కాంట్రాక్టు నిబంధనలను ఉల్లంఘించినందుకు కంపెనీకీ, రిలయన్స్ కంపెనీ నిబంధనలను ఉల్లంఘించేలా సహకరించినందుకు ప్రభుత్వానికీ అక్షింతలు వేసింది. దేశానికి చెందిన కీలకమైన ఆయిల్ వనరు కృష్ణ-గోదావరి (కె.జి) బేసిన్ అభివృద్ధి చేసే కాంట్రాక్టు రిలయన్స్ ఇండస్ట్రీస్…