అమ్మాయిలు డేటింగ్ చేస్తే అత్యాచారానికి అర్హులవుతారా?
(ఈ టపా దీనికి ముందరి టపా కింద మిత్రుడు ప్రవీణ్ రాసిన వ్యాఖ్యలకు సమాధానంగా పాఠకులు గ్రహించగలరు) – స్త్రీవాదిననీ, మార్క్సిస్టుననీ చెప్పే మిత్రుడు చేసిన వ్యాఖ్యల్లో వ్యక్తపరిచిన అభిప్రాయాలు చాలా అభ్యంతరకరంగా ఉన్నాయి. పైగా తన అభిప్రాయాలతో ఏకీభవిస్తేనే స్త్రీవాది మరియు మార్క్సిస్టు అవుతారన్నట్లుగా చెప్పడం ఇంకా అభ్యంతరకరంగా ఉంది. మిత్రుడు చెప్పిందాన్నిబట్టి చూస్తే, ఆయన దృష్టిలో డేటింగ్ అంటే శారీరక సంభోగమే తప్ప మరొకటి కాదు. స్త్రీలు డేటింగ్ చేయడం తనకి నచ్చదు. ఒక…