ప్రపంచ యుద్ధ ప్రమాదాన్ని చేరువ చేసిన ‘ఆకస్’ మిలట్రీ కూటమి
2021 సెప్టెంబర్ 15 వ తేదీన ప్రపంచ భౌగోళిక-రాజకీయ యవనికపై ఎవరూ ఊహించని పరిణామం చోటు చేసుకుంది. ఆస్ట్రేలియా(A), బ్రిటన్ (యునైటెడ్ కింగ్^డమ్ – UK), అమెరికా సంయుక్త రాష్ట్రాలు (US).. ఈ మూడు సభ్య దేశాలుగా ‘ఆకస్ (AUKUS) పేరుతో మిలట్రీ కూటమి ఏర్పడినట్లుగా మూడు దేశాల నేతలు ప్రకటించారు. కూటమి ఏర్పాటు దానికదే ఒక ముఖ్య పరిణామం కాగా, ఆస్ట్రేలియాకు అణు ఇంధనంతో నడిచే 8 సబ్ మెరైన్లను అమెరికా సరఫరా చేయనున్నట్లు…