కల్లోల జలాలు -ద హిందూ…

  ఇండస్ నీటి ఒప్పందం (IWT) పైన సమావేశం నిర్వహించి, పాకిస్తాన్ కు MFN (మోస్ట్ ఫెవర్డ్ నేషన్ -అత్యంత సానుకూల దేశం) హోదా ఇవ్వడం పైన మరో సమావేశాన్ని వచ్ఛే వారం ఏర్పాటు చేయాలని తలపెట్టడం ద్వారా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, యూరి దాడికి ప్రతిస్పందనగా మిలటరియేతర అవకాశాలన్నింటిని పరిశీలిస్తున్నామన్న సంకేతాలను పంపారు. “నెత్తురు, నీళ్లు కలిసి మెలిసి ప్రయాణం చేయలేవు” అని ఆయన అన్నట్లుగా తెలుస్తున్నది. అయినప్పటికీ, సమావేశం తర్వాత, కనీసం ప్రస్తుతానికి…

హరిత విప్లవం కాదది ఎరువుల పధకం! -పార్ట్ 9

భారత వ్యవసాయ రంగంలో మార్పులపై ఒక నోట్ : పార్ట్ 9 8వ భాగం తర్వాత…. “‘దారిద్ర్య నిర్మూలనా చర్య’గా బిపిన్ చంద్ర పేర్కొన్న హరిత విప్లవాన్ని USAID (United States Assistance for International Development) కి చెందిన చీఫ్ ఎకనమిస్టు జాన్ డి మిల్లర్ “ప్రధానంగా ఒక ఎరువుల పధకం” గా అభివర్ణించాడు. “ఈ విప్లవాన్ని ప్రోత్సహించడంలో ఎరువుల కంపెనీలు, వాటి ధార్మిక సంస్ధలు (ఫౌండేషన్లు) మొదటి నుండి చురుకుగా వ్యవహరించాయి” అని మూని…

ప్రశ్న: ప్రపంచ బ్యాంకు షరతులు, సబ్సిడీలు…

చందన: శేఖర్ గారూ, ద్రవ్య పెట్టుబడి వచ్చి వెళ్ళిపోవడం వల్ల వచ్చిన నస్టం ఏమిటి? దాని డబ్బు అది తీసుకునిపొతుంది. దానిస్తానంలొ కొన్నవాళ్ళ పెట్టుబడి వస్తుంది కదా? మరి ఏమిటి నస్టం. మరొ ప్రశ్న. ప్రపంచ బ్యాంకు ద్వారా అప్పు తీసుకున్న దేశాలు దివాళా తీశాయని, సంక్షొభంలొ కూరుకపొయాయని చాలాసార్లు పేపర్లొ ,పుస్తకాలలొ చదివాను. అయితె ఎక్కడాకూడా వివరణ లేదు. అప్పుతీసుకున్న దేశం తీసుకున్న డబ్బుకు వడ్డీ, అసలు చెల్లిస్తుంటుంది. మరి ప్రపంచ బ్యాంకుకు అప్పు తీసుకున్న…

ఐ.ఎం.ఎఫ్ అంటే అలిగితిమి, ఆర్.బి.ఐదీ అదే మాటాయె!

భారత ఆర్ధిక వృద్ధి రేటు అంచనాను ఐ.ఎం.ఎఫ్, ప్రపంచ బ్యాంకు లు తగ్గించినందుకు భారత ప్రభుత్వం తీవ్ర స్ధాయిలో ఉడుక్కుంది. ఎంతగా ఉడుక్కుందంటే, అసలు ఐ.ఎం.ఎఫ్ ఆర్ధిక అంచనా పద్ధతులను మార్చిపారేయాలని మన ఆర్ధిక మంత్రి చిదంబరం నేరుగా ఐ.ఎం.ఎఫ్ (వాషింగ్టన్) సమావేశాల్లోనే డిమాండ్ చేసేంతగా. తీరా చూడబోతే మన ఆర్.బి.ఐ కూడా భారత వృద్ధి రేటును దాదాపు ప్రపంచ బ్యాంకు అంచనాకు దరిదాపుల్లోనే ఉంచింది. 2013-14 లో ఇండియా వృద్ధి రేటు 4.7 శాతం ఉంటుందని…

అమెరికా రుణం: తగిన చర్యలు తీసుకోవాలి -జి20

ఇన్నాళ్లూ ప్రపంచ దేశాలకు ఆర్ధిక వ్యవస్ధలను సవరించుకోవాలంటూ హెచ్చరికలు జారీ చేసిన అమెరికా ఇప్పుడు సరిగ్గా దానికి విరుద్ధ పరిస్ధితిని ఎదుర్కొంటోంది. వాషింగ్టన్ లో సమావేశమైన జి20 దేశాల ప్రతినిధులు ఋణ పరిమితి పెంపుదలపై తగిన చర్యలు తీసుకోక తప్పదని దాదాపు హుకుం జారీ చేసినంత పని చేశాయి. ప్రపంచ ఆర్ధిక వ్యవస్ధ సవాళ్ళు ఎదుర్కొంటున్న పరిస్ధితిలో తన స్వల్పకాలిక కోశాగార అవసరాలు తీర్చుకోడానికి వెంటనే  తగిన చర్యలు తీసుకోవాల్సిందేనని, లేకపోతే గడ్డు పరిస్ధితి రానున్నదని జి20…

ఐ.ఎం.ఎఫ్, ప్రపంచ బ్యాంకు వార్షిక సమావేశంలో వెల్లడయిన ప్రపంచ ఆర్ధికశక్తుల వైరుధ్యాలు

ప్రపంచ ఆర్ధిక వ్యవస్ధ సంక్షోభంలో మరింతగా కూరుకుపోతున్న నేపధ్యంలో ప్రపంచ ఆర్ధిక శక్తుల మధ్య విభేదాలు క్రమంగా పెరుగుతున్నాయి. టోక్యోలో జరిగిన ఐ.ఎం.ఎఫ్ మరియు ప్రపంచ బ్యాంకుల వార్షిక సంయుక్త సమావేశంలో ఈ విభేధాలు ప్రస్ఫుటంగా వ్యక్తం అయ్యాయి. ప్రపంచ కాబూలీ సంస్ధలయిన ఐ.ఎం.ఎఫ్, ప్రపంచ బ్యాంకుల 2012 వార్షిక సమావేశాలు జపాన్ రాజధాని టోక్యో లో అక్టోబర్ 9 నుండి 14 వరకు జరిగాయి. పశ్చిమ దేశాల బహుళజాతి కంపెనీల ప్రయోజనాలను నిర్విఘ్నంగా నెరవేరడానికి సూత్రాలు,…

కొత్త ప్రమాదం ముంగిట ప్రపంచ మార్కెట్లు -ప్రపంచ బ్యాంకు

గత కొద్ది వారాలుగా జరుగుతున్న పరిణామాలు ప్రపంచ మార్కెట్లను కొత్త ‘డేంజర్ జోన్’ ముంగిట నిలిపాయని ప్రపంచ బ్యాంకు అధిపతి రాబర్ట్ జోయెలిక్ హెచ్చరించాడు. 1. అమెరికా, యూరప్ ల లాంటి కీలక దేశాల్లో ఆర్ధిక నాయకత్వంపై మార్కెట్ విశ్వాసం సన్నగిల్లడం, 2. పెళుసైన ఆర్ధిక రికవరీ… ఈ రెండు అంశాలు కలిసి మార్కెట్లను కొత్త ప్రమాదంలోకి నెట్టాయని ఆయన వ్యాఖ్యానించాడు. వివిధ దేశాల్లోని విధాన కర్తలు దీనిని తీవ్రంగా పరిగణించాలని జోయెలిక్ కోరాడు. సిడ్నీలో ఆదివారం…

పూర్తిస్ధాయి సంక్షోభానికి ఒకే ఒక్క షాక్ దూరంలోనే ఉన్నాం -ప్రపంచ బ్యాంకు

2008 లో సంభవించిన ప్రపంచ ఆర్ధిక సంక్షోభం నుండి ఇంకా పూర్తిగా కోలుకోనే లేదు. “పూర్తి స్ధాయి సంక్షోభానికి ఇంకొక్క షాక్ ఎదురైతే చాలు” అని ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడు రాబర్ట్ జోల్లిక్ హెచ్చరించాడు. ప్రపంచ దేశాల్లో పెరుగుతున్న ఆహారధరలు మరో తీవ్రమైన ప్రపంచ ఆర్ధిక సంక్షోభం బద్దలవడానికి ప్రధాన దోహదకారిగా పని చేస్తున్నదని రాబర్ట్ హెచ్చరించాడు. ప్రపంచ బ్యాంకు, ఐ.ఎం.ఎఫ్ లు వాషింగ్టన్ లో జరుపుతున్న వేసవి సమావేశాల సందర్భంగా ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడు ఈ…

విద్య, ఆరోగ్యాలకు బదులు న్యాయ, పోలీసు రంగాలకు సాయం చెయ్యండి -ప్రపంచ బ్యాంకు

ప్రపంచ బ్యాంకు తన నగ్న స్వరూపాన్ని సిగ్గు లేకుండా బైట పెట్టుకుంది. పేద దేశాలకు సహాయం పేరుతో అప్పులిచ్చే అభివృద్ధి చెందిన దేశాలు తాము కేంద్రీకరించే రంగాలను మార్చాలని కోరింది. విద్య, ఆరోగ్య రంగాల అభివృద్ధికి అభివృద్ధి చెందిన దేశాలు ఇప్పటివరకు సహాయం చేస్తూ వచ్చాయనీ, అలా కాకుండా న్యాయ వ్యవస్ధ, పోలీసు వ్యవస్ధలు అభివృద్ధి చెందటానికి సహాయం చేయడం ప్రారంభించాలని కోరింది. సోమవారం విడుదల చేసిన ఒక రిపోర్టులో “ఆయా దేశాల్లో స్ధిరమైన ప్రభుత్వాలను నిర్మించడంపై…