గ్రెక్సిట్: పెట్టుబడిదారీ సంక్షోభ ఫలితం -2

మొదటి భాగం తరువాత……………… గ్రీసు అబద్ధాలు?! గ్రీసు 2001లో తన జాతీయ కరెన్సీ ‘డ్రాక్మా’ను రద్దు చేసుకుని ‘యూరో’ను స్వీకరించింది. సాంకేతికంగా చెప్పుకోవాలంటే ‘యూరో జోన్’ లో చేరింది. ఆనాటి గ్రీసు ప్రభుత్వం తమ ఆర్ధిక పరిస్ధితి గురించి తప్పుడు సమాచారాన్ని ఇచ్చి, అబద్ధాలు చెప్పి యూరో జోన్ లో చేరిందని పశ్చిమ పత్రికలు, ఈ.యు, ఇ.సి.బి అధికారులు ఇప్పటికీ చెబుతారు. గ్రీసు దాచిపెట్టిన ఆర్ధిక సమస్యల వల్ల గ్రీసు అప్పు పెరుగుతూ పోయిందని, అది తడిసి…

మరో ప్రపంచ ఆర్ధిక సంక్షోభం రావచ్చు -ఆర్.బి.ఐ గవర్నర్

భారత రిజర్వ్ బ్యాంకు గవర్నర్ బాంబు పేల్చారు. మరోసారి ప్రపంచ ఆర్ధిక సంక్షోభం సంభవించవచ్చని హెచ్చరించారు. ఆయన చెబుతున్నది 2008 నాటి సంక్షోభం తరహాది కూడా కాదు. ఏకంగా 1930ల నాటి మహా మాంద్యం తరహాలోనే సంక్షోభం రావచ్చని హెచ్చరించారు. 2008 నాటి సంక్షోభాన్ని ‘ద గ్రేట్ రిసెషన్’ అని పిలవగా, 1930ల నాటి సంక్షోభాన్ని ‘ద గ్రేట్ డిప్రెషన్’ గా పిలిచారు. రిసెషన్ కంటే డిప్రెషన్ మరింత లోతైన, విస్తారమైన సంక్షోభం. ఆనాటి డిప్రెషన్ నుండి…

లైసె ఫెయిర్, నూతన ఆర్ధిక విధానాలు, ఆర్ధిక సంక్షోభం -వివరణ

(ఈ పోస్టుతో కొత్త వర్గం -కేటగిరీ- ‘ప్రశ్న-జవాబు’ ప్రారంభిస్తున్నాను. కొన్ని వారాల క్రితం చందుతులసి గారు ఇచ్చిన సలహాను ఈ విధంగా అమలు చేస్తున్నాను. మొట్టమొదటి ప్రశ్న మాత్రం తిరుపాలు గారిది. ఒక టపా కింద వ్యాఖ్యగా ఆయన అడిగిన ప్రశ్న ఇది. నేనిచ్చిన సమాధానాన్ని కొన్ని మార్పులు, చేర్పులు చేసి ప్రచురిస్తున్నాను. ఈ కేటగిరీ కింద సమాధానం నేనే ఇవ్వాలన్న రూలు లేదు. సమాధానం తెలిసిన సందర్శకులు ఎవరైనా ఇవ్వవచ్చు. కానీ ప్రశ్న ఎక్కడ వేయాలి…

రూపాయి విలాపం, చిదంబరం చిద్విలాసం

ఒక పక్క రూపాయి, పతనంలో సరికొత్త రికార్డులు సృష్టిస్తోంటే, మరొక పక్క ఆర్ధిక మంత్రి చిదంబరం చిద్విలాసం కూడా కొనసాగుతోంది. దేశీయంగా ఆర్.బి.ఐ, ప్రభుత్వం తీసుకోవలసిన అన్ని చర్యలూ తీసుకుంటున్నామనీ, కానీ విదేశాల్లో పరిస్ధితుల వలన రూపాయి పతనం అవుతోందని నిన్నటి వరకూ మంత్రి చెబుతూ వచ్చారు. మంగళవారం సరికొత్త స్ధాయికి రూపాయి పతనం అయిన తర్వాత ఆయన కూడా సరికొత్త పల్లవి అందుకున్నారు. విదేశాల పరిస్ధితులే కాకుండా దేశంలోని పరిస్ధితులు కూడా పతనానికి కారణం అని…

ప్రమాదంలో జర్మనీ టాప్ రేటింగ్, ఋణ సంక్షోభమే కారణం

యూరపియన్ యూనియన్ ఆర్ధిక కేంద్రం అయిన జర్మనీని సైతం ఋణ సంక్షోభం చుట్టు ముడుతున్న ఛాయలు కనిపిస్తున్నాయి. ‘మూడీస్’ రేటింగ్ సంస్ధ జర్మనీ క్రెడిట్ రేటింగ్ ‘ఔట్ లుక్’ ను ‘స్థిరం’ (స్టేబుల్) నుండి ‘ప్రతికూలం’ (నెగిటివ్) కు తగ్గించింది. తద్వారా రానున్న రెండేళ్లలో జర్మనీ AAA రేటింగ్ కోల్పోవచ్చని సంకేతం ఇచ్చింది. ‘యూరో’ ఉమ్మడి కరెన్సీ గా చేసుకున్న 17 దేశాల యూరో జోన్ కూటమి నుండి గ్రీసు బైటికి వెళ్లిపోతుందన్న అంచనా తో పాటు…

ఆర్ధిక సంక్షోభం వల్ల అమెరికాలో పెరుగుతున్న కుటుంబ హింస

ఆర్ధిక సంక్షోభం వల్ల అమెరికాలో కుటుంబ హింస పెరుగుతోందని పోలీసుల సర్వే తెలియజేసింది. ఆర్ధిక పరిస్ధితులు చట్టాల అమలుపై ఎలాంటి ప్రభావం చూపుతోందన్న విషయంపై అమెరికాకి చెందిన ‘పోలీస్ ఎక్సిక్యూటివ్ రీసెర్చ్ ఫోరం’ రెగ్యులర్ గా సమీక్ష జరుపుతుంది. సర్వేలో ప్రతిస్పందించిన 700 సంస్ధలలో 56 శాతం ‘పూర్ ఎకానమీ’ వల్ల కుటుంబ హింస పెరిగిందని తెలిపాయి. ఇది 2011 సంవత్సరం లోని పరిస్ధితి కాగా 2010 లో 40 శాతం సంస్ధలు సంక్షోభ పరిస్ధితులు కుటుంబ…

అసలు ఎస్ & పి విశ్వసనీయత ఎంత? తనదాకా వచ్చాక అడుగుతున్న అమెరికా

తనదాకా వస్తేగాని అర్ధం కాలేదు అమెరికాకి. ఒక దేశానికి చెందిన క్రెడిట్ రేటింగ్ తగ్గించడం అంటే ఏమిటో అమెరికా అధికారులకి, కాంగ్రెస్ సభ్యులకీ, సెనేట్ నాయకులకీ ఇప్పుడు అర్ధం అవుతోంది. అది కూడా పాక్షికంగానే. అమెరికా క్రెడిట్ రేటింగ్ తగ్గించాక మాత్రమే ఎస్ & పి కి ఉన్న విశ్వసనీయతపైన అమెరికాకి అనుమానాలు వస్తున్నాయి. యూరప్, ఆసియా లకు చెందిన అనేక బ్యాంకులు, ఇతర ద్రవ్య సంస్ధలతో పాటు దేశాల సావరిన్ అప్పులకు కూడా రేటింగ్ లను…

అమెరికాలో “ది గ్రేట్ రిసెషన్” తర్వాత మొలిచిన కొత్త ఉద్యోగాలు కేవలం “అర మిలియన్” -టేబుల్

ప్రపంచాన్ని అతలా కుతలం చేసిన “ది గ్రేట్ రిసెషన్,” అమెరికాలో డిసెంబరు 2007 లో ప్రారంభం కాగా, జూన్ 2009 లో ముగిసిందని అమెరికా ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. అప్పటినుండి అమెరికాలో ప్రవేటు కంపెనీలు రిసెషన్ ముందు స్ధాయిలో లాభాలు సంపాదిస్తుండగా, ఉద్యోగాల మార్కెట్ మాత్రం ఇంకా కోలుకోలేదు. సంక్షోభం ముగిసాక జూన్ 2009 లో అమెరికాలో 130.5 మిలియన్ల ఉద్యోగాలు ఉండగా, వాటి సంఖ్య రెండేళ్ళ తర్వాత జూన్ 2011 నాటికి కేవలం అర మిలియన్…

అమెరికా కంపెనీలు లాభాల్లో, అమెరికా ఆర్ధిక వ్యవస్ధ నష్టాల్లో

2007-08 ప్రపంచ ఆర్ధిక సంక్షోభం ఫలితంగా అమెరికా ఆర్ధిక వ్యవస్ధ తీవ్రంగా దెబ్బతింది. 2009 వరకూ అమెరికాలోని కంపెనీలు కూడా తీవ్రమైన ఆర్ధిక కష్టాల్లో ఉన్నట్లు ప్రకటించాయి. లేమేన్ లాంటి ఫైనాన్సి దిగ్గజం నిట్ట నిలువునా కూలిపోవడంతో ప్రపంచం నిర్ఘాంతపోయింది. వాల్ స్ట్రీట్ లోని బహుళజాతి ద్రవ్య సంస్ధలైన ఇన్‌వెస్ట్‌మెంట్ బ్యాంకులన్నీ తోటి బ్యాంకులపై నమ్మకం కోల్పోయి ఒక్క సెంటు కూడా చేబదుళ్ళు, అప్పులు ఇవ్వడానికి నిరాకరించడంతో అప్పు దొరకడం గగనమైంది. “క్రెడిట్ క్రంచ్” గా పేర్కొన్న…

‘ఆడలేక మద్దెల ఓడు’: అమెరికా సమస్యలకు జపాన్, యూరప్‌లే కారణమంటున్న ఒబామా

“ఆడలేక మద్దెల ఓడు” అన్నట్టుంది అమెరికా అర్ధిక సమస్యలకి బారక్ ఒబామా చూపుతున్న కారణాలు. జపాన్, యూరప్ ల వలన అమెరికా ఆర్ధిక సంక్షోభం నుండి ఇంకా కోలుకోలేక పోతున్నదని బారక్ ఒబామా చెబుతున్నాడు. జపాన్ భూకంపం, యూరప్ అప్పు సంక్షోభాలే అమెరికా ఆర్ధిక వృద్ధికి ఆటంకంగా పరిణమించాయని ఒబామా తాజా పరిశోధనలో కనిపెట్టారు. ఇంతవరకూ ఏ ఆర్ధిక వేత్తగానీ, విశ్లేషకులు గానీ చేయనటువంటి విశ్లేషణ ఇది. అమెరికా ప్రభుత్వం తాజాగా శుక్రవారం వెలువరించిన గణాంకాలు అమెరికా…

ఆకలి, దరిద్రాలతో బడి మానేస్తున్న బ్రిటన్ విద్యార్ధులు

బడిమానేయడం ఇండియాలో సర్వ సాధారణం. పిల్లల్ని కూలికి పంపితే కుటుంబానికి కొంచెం ఆదాయం పెరుగుతుందనే ఆలోచనతో పల్లేల్లొ పేద రైతులు, కూలీలు తమ పిల్లలు చేతికందాక బడిమానిపిస్తారు. మూడు సంవత్సరాల క్రితం సంభవించిన ప్రపంచ ద్రవ్య, ఆర్ధిక సంక్షోభాల పుణ్యమాని ఇప్పుడు యూరప్ లోని ధనిక దేశాల్లో సైతం ఆ పరిస్ధితులు తలెత్తుతున్నాయి. ఆర్ధిక సంక్షోభం తర్వాత స్తంభించిపోయిన ఆర్ధిక కార్యకలాపాలను పునరుద్ధరించి వేగవంతం చేయడానికి అభివృద్ధి చెందిన దేశాలు ట్రిలియన్ల కొద్దీ డాలర్లను ప్రవేటు బహుళజాతి…