అమెరికా వీసా ఫీజు పెంపులో హ్రస్వదృష్టి -ది హిందు

[Short-sighted hike in U.S. visa fee శీర్షికన ఈ రోజు ది హిందులో వెలువడిన సంపాదకీయానికి యధాతధ అనువాదం] ********** అమెరికాలో తాత్కాలిక పని కోసం వచ్చే వృత్తిగత నిపుణులకు వీసా ఫీజు పెంచుతూ బారాక్ ఒబామా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఐ.టి రంగంలోని భారతీయ కంపెనీలను ప్రభావితం చేస్తుంది. ఈ చర్య వల్ల సంవత్సరానికి 400 మిలియన్ డాలర్ల (రమారమి రు. 2640 కోట్లు) నష్టం వస్తుందని (భారత సాఫ్ట్ వేర్) వాణిజ్య సంఘం…

ప్రశ్న: ప్రపంచీకరణ అంటే…?

కె.బ్రహ్మం: ప్రపంచీకరణ అంటే ఏమిటి? సాంకేతిక పరిజ్ఞానం, అభివృద్ధిల విషయంలో అమెరికా, ఐరోపాలు ప్రత్యేకంగా ఎందుకు ఉన్నాయి? సమాధానం: రెండో అంశాన్ని వివరిస్తూ మొదటి అంశానికి వస్తాను. ప్రపంచీకరణ (Globalization) కు నిర్దిష్ట నిర్వచనం ఒక వాక్యంలో చెప్పడం తగదు. ప్రపంచీకరణ అనేది మానవ సమాజం అభివృద్ధి చెందుతున్న దశలో ఏర్పడిన ఒక అనివార్య దశ. ఈ దశకు మూలాలు క్రీస్తు పూర్వం మూడో మిలీనియంలోనే ఉన్నాయని చెప్పేవారు లేకపోలేదు. అంత వెనక్కు కాకపోయినా 15వ శతాబ్దంలో…

పెట్టుబడిదారీ సంక్షోభ పరిష్కారం అంటే ప్రజల గోళ్ళూడగొట్టడమే -కార్టూన్

పెట్టుబడిదారీ వ్యవస్ధలో సంక్షోభాలు సర్వ సాధారణం. పెట్టుబడిదారీ ఆర్ధికవేత్తలు వీటికి ‘సైక్లిక్ క్రైసిస్’ అని పేరు పెట్టి సైద్ధాంతీకరించేశారు కూడా. (అంటే సిద్ధాంతం కనక ఇక అడగొద్దని.) పెట్టుబడిదారీ వ్యవస్ధలో సంక్షోభం అంటే ప్రధానంగా పెట్టుబడిదారుల సంక్షోభమే. పెట్టుబడిదారులకు లాభాలు తగ్గిపోతే అదే సంక్షోభం. దేశంలో దరిద్రం తాండవిస్తున్నా అది సంక్షోభం కాదు. రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా, నూటికి యాభై మందికి ఇళ్ళు లేకపోయినా, నలభై మంది ఆకలితో, అర్ధాకలితో చస్తూ బతుకుతున్నా, మొత్తంగా ప్రజల జీవన…

ప్రపంచం తుమ్మితే, ఇండియాకు జలుబు చేయక తప్పదు -ప్రణబ్ ముఖర్జీ

రష్యా, చైనాల్లో వర్షం పడితే ఇండియా కమ్యూనిస్టులు ఇక్కడ గొడుగు పడతారని గతంలో భారత దేశ పాలకవర్గాలు, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీవారు జోకుతూ ఉండేవారు. అప్పుడు కమ్యూనిస్టులు గొడుగు పట్టారో లేదో తెలియదు కాని ఇప్పుడు మాత్రం కాంగ్రెస్ నేతృత్వంలోని భారత ప్రభుత్వ ఆర్ధిక మంత్రి స్వయంగా ఒక అనివార్యమైన సత్యాన్ని అంగీకరించాడు. ప్రపంచ ఆర్ధిక వ్యవస్ధ తుమ్మితే గనక భారత దేశ ఆర్ధిక వ్యవస్ధకు జలుబు చేయడం ఖాయమని ఆయన జాతీయ అభివృద్ధి మండలి (ఎన్.డి.ఎ)…

కుట్రదారులు కావలెను -కార్టూన్

“ప్రపంచీకరణ” ప్రపంచాన్ని కుగ్రామంగా చేసి అందరికీ లాభం సమకూర్చుతుందని చెప్పారు. ఆచరణలో ఏం జరిగింది? పెట్టుబడుల ప్రపంచీకరణ జరిగింది కానీ శ్రమ జీవులకీ, వేతన జీవులకీ అది ఒఠ్ఠి బూటకంగా మిగిలింది. పశ్చిమ దేశాల పెట్టుబడులు, ఎమర్జింగ్ దేశాలతో సహా మూడవ ప్రపంచ దేశాల పెట్టుబడులు ఏకమై మూడో ప్రపంచ ప్రజలనూ, వారి వనరులనూ కొల్లగొడుతున్నాయి. ఈ ఆటలో పశ్చిమ దేశాల బహుళజాతి గుత్త సంస్ధలు మాస్టర్లు కాగా, మూడో ప్రపంచ దేశాల బడా కంపెనీలు వారికి…