అందినట్టే అంది ఎగిరిపోయిందా!… -కార్టూన్

పాపం అద్వానీ! ఎన్ని ఎత్తులు, ఎన్ని పై ఎత్తులు! ఎన్ని ఎదురు చూపులు, ఆ ప్రధాని కుర్చీకోసం? తనను మించిన సీనియర్ పార్టీలో లేకపోయినా, జనంలో బహుశా తనకు మించిన ఆమోదనీయత కూడా పార్టీలో ఎవరికీ లేకపోయినా ఆ ప్రధాని కుర్చీ మాత్రం అద్వానీకి అందని ద్రాక్షగానే మిగిలిపోయింది. రానున్న పార్లమెంటరీ ఎన్నికలకు గాను ప్రచార కమిటీ సారధ్య బాధ్యతలను నరేంద్ర మోడీకి అపజెప్పడం ద్వారా బి.జె.పి జాతీయ కార్యవర్గం తమ ప్రధాని అభ్యర్ధి ఎవరో చెప్పినట్లేనని…

మోడి గాలి జనం ఒప్పుకోరు -నితీష్ కుమార్

ఎన్.డి.ఎ కూటమి ఏర్పడినప్పుడు విధించిన షరతులు ఇప్పటికీ వర్తిస్తాయని, అలా అయితేనే కూటమి కొనసాగుతుందని జనతా దళ్ (యునైటెడ్) పార్టీ నాయకుడు, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ స్పష్టం చేశాడు. ‘తాము ఒక తుఫాను సృష్టిస్తామని, ప్రజలు దానిని అంగీకరిస్తారని’ కొంత మంది భావిస్తున్నారని, కానీ ప్రజలు చదువు లేకపోయినా చాలా తెలివైనవారని మోడిని పరోక్షంగా ఉద్దేశిస్తూ వ్యాఖ్యానించాడు. తెలివైన ప్రజలు ఎలాంటి గాలిని ఒప్పుకోరని రాజకీయ నాయకులు చెప్పే మాటల్లో విషయం ఉన్నదీ లేనిదీ వారు…

ములాయంజీ! ఆకాశానికి నిచ్చెన నిలిచేనా? -కార్టూన్

బిజెపి అగ్రనాయకుడు గత సంవత్సరం ఒక అనూహ్యమైన వ్యాఖ్య చేశారు. దేశంలో ప్రధాన పార్టీలయిన కాంగ్రెస్, బిజెపి నాయకులు కాకుండా ఇతర పార్టీల నాయకులే ఈసారి ప్రధాని అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని. ప్రధాన మంత్రి పదవి కోసం కలలు కంటున్నారని భావిస్తున్న అద్వానీ, ఉన్నట్టుండి ఇలా అన్నారేవిటా అని పరిశీలకులు ఆశ్చర్యం వెలిబుచ్చారు. బహుశా బిజెపి లోనే ప్రధాని పదవికి పోటీగా వస్తున్న గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీకి ఝలక్ ఇవ్వడానికి అద్వానీ ఒక అస్త్రాన్ని…

అరేబియా అత్తరులు అన్నీ కలిపి కడిగినా… -జస్టిస్ కట్జు

(సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి, ప్రస్తుతం ‘ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా’ ఛైర్మన్ కూడా అయిన జస్టిస్ మార్కండేయ కట్జు నిర్మొహమాటంగా అభిప్రాయాలు వ్యక్తం చేయడంలో పేరు సంపాదించాడు. బాల్ ధాకరే మరణానంతరం అంతిమ యాత్ర కోసం ముంబై బంద్ చెయ్యడం పైన ఫేస్ బుక్ లో వ్యాఖ్య చేసిన, లైక్ చేసిన ఇద్దరు యువతులపై ఐ.టి చట్టం ప్రయోగించడాన్ని బహిరంగంగా తప్పు పట్టి తద్వారా ధాకరే నివాళుల పర్వంలో బారులు తీరిన పత్రికల పతాక శీర్షికలను…