ఇన్ ఫ్లేషన్, డిఫ్లేషన్, రిఫ్లేషన్… -ఈనాడు

ఒక దేశ ఆర్ధిక వ్యవస్ధ యొక్క ఆర్ధిక మౌలికాంశాల్లో (ఎకనమిక్ ఫండమెంటల్స్) ద్రవ్యోల్బణం ఒకటి. ద్రవ్యోల్బణం గురించి ఆర్ధికవేత్తలు అనేక సిద్ధాంతాలు చెబుతారు. ఆ సిద్ధాంతాలన్నీ మనిషి సృష్టించిన కృత్రిమ మారక సాధనం అయిన డబ్బు చుట్టూనే తిరుగుతాయి. ఎన్ని సిద్ధాంతాలు వల్లించినా డబ్బును నియంత్రించే ధనికవర్గాల జోలికి ఆర్ధికవేత్తలు వెళ్లరు. ఫలితంగా ఆ సిద్ధాంతాలన్నీ వాస్తవ పరిస్ధితులకు దరిదాపుల్లోకి వెళ్లడంలో విఫలం అవుతాయి. దాంతో మళ్ళీ మళ్ళీ సరికొత్త సిద్ధాంతాలతో ఆర్ధికవేత్తలు ముందుకు రావడానికి పరిస్ధితులు…

సంక్షోభం వీడని ఐరోపా, మరింత ఉద్దీపన అమలు

2008 నాటి ప్రపంచ ద్రవ్య-ఆర్ధిక సంక్షోభం దరిమిలా ఐరోపా దేశాలను చుట్టుముట్టిన తీవ్ర ఆర్ధిక సంక్షోభం ఇంకా ఆ దేశాల్ని పీడిస్తోంది. యూరోపియన్ సెంట్రల్ బ్యాంకు (ఇ.సి.బి) ప్రకటించిన తాజా ఉద్దీపన చర్యలు ఈ సంగతిని స్పష్టం చేస్తున్నాయి. ఇప్పటికే దాదాపు సున్న శాతానికి దగ్గరగా ఉన్న వడ్డీ రేటును మరింతగా తగ్గించడం ద్వారా మరిన్ని నిధులను మార్కెట్ లో కుమ్మరించడానికి ఇ.సి.బి నిర్ణయం తీసుకుంది. బహుశా మరే దేశమూ ఇంతవరకు చరిత్రలో ఎరగని చర్యలను కూడా…

యూరప్ స్టిములస్: ఆకాశ వీధుల్లో భారత స్టాక్ మార్కెట్లు!

ప్రతి ద్రవ్యోల్బణం భయంతో వణికిపోతున్న యూరోపియన్ దేశాలను బైటపడేయడానికి యూరోపియన్ సెంట్రల్ బ్యాంకు (ఇ.సి.బి) మరో ఉద్దీపన పధకం ప్రకటిస్తుందన్న ఊహాగానాలు వ్యాపించడంతో భారత స్టాక్ మార్కెట్లు పరవళ్ళు తొక్కాయి. ఆర్ధిక గమనాన్ని వేగవంతం చేయడానికి మరింత లిక్విడిటీని ఇ.సి.బి ప్రవేశపెడుతుందని నమ్మకమైన సంకేతాలు అందాయి. దాని ప్రభుత్వం భారత స్టాక్ మార్కెట్లకూ విస్తరించి సరికొత్త రికార్డులు నమోదు చేశాయి. సెన్సెక్స్ మొట్టమొదటిసారి 25,000 మార్కు దాటగా, నిఫ్టీ సైతం కొత్త రికార్డు నెలకొల్పింది. గురువారం మెటల్,…