లోక్ సభ ప్రతిపక్ష హోదా: రంగంలోకి సుప్రీం కోర్టు?

లోక్ సభలో ప్రతిపక్ష నాయక హోదాను కాంగ్రెస్ పార్టీకి ఇవ్వడానికి బి.జె.పి/ఎన్.డి.ఏ/మోడి ప్రభుత్వం నిరాకరించింది. లోక్ సభ సీట్ల మొత్తం సంఖ్యలో 10 శాతం సీట్లు తెచ్చుకోవడంలో విఫలం అయినందున కాంగ్రెస్ పార్టీ ఆ హోదాకు అర్హురాలు కాదని లోక్ సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ తేల్చేశారు. ఇది రాజ్యాంగ పదవుల నియామకానికి ఆటంకంగా పరిగణించడంతో సుప్రీం కోర్టు రంగంలోకి దిగుతోంది. వివిధ రాజ్యాంగ పదవులను భర్తీ చేయడంలో లోక్ సభ ప్రతిపక్ష నేతను విశ్వాసం లోకి…

భోజన పళ్ళెం అందుకోలేని కాంగ్రెస్ -కార్టూన్

లోక్ సభలో ప్రతిపక్ష నాయకత్వ హోదా కోసం పోరాడవలసిన పరిస్ధితి కాంగ్రెస్ ది. మొత్తం సీట్లలో 10 శాతం వస్తే తప్ప ప్రతిపక్ష హోదా దక్కదని నిబంధనలు ఉన్నాయిట. తమకు 44 సీట్లే వచ్చినా యు.పి.ఏ కి 60 సీట్లు వచ్చాయి గనుక తమకు ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సిందేనని కాంగ్రెస్ వాదిస్తోంది. ఎన్నికలకు ముందు యు.పి.ఏ పక్ష్యాలన్నీ ఒకే మేనిఫెస్టో, కార్యక్రమం ఇవ్వలేదు గనక ఆ లాజిక్ పని చేయదని బి.జె.పి తిప్పి కొడుతోంది. ఫలితంగా బి.జె.పి…

ప్రశ్న: ప్రతిపక్ష హోదా కోసం పాకులాట ఎందుకు?

నిఖిల్: 1. లోక్ సభలో అధికార ప్రతిపక్ష హోదా వల్ల లాభం ఏమిటి? ఆ హోదా కోసం కాంగ్రెస్ ఎందుకు పిచ్చిగా ప్రాకులాడుతోంది? సమాధానం: “లోక్ సభలో అధికార ప్రతిపక్ష హోదా” అంటే మీ ఉద్దేశ్యం “అధికారికంగా గుర్తించబడిన ప్రతిపక్ష హోదా” అయి ఉండాలి. బి.జె.పి పాలక పక్షం గనుక కాంగ్రెస్ ఎలాగూ ప్రతిపక్షమే. కానీ లోక్ సభలో ప్రధాన ప్రతిపక్ష హోదా పొందడానికి కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది. ఎందుకా పాకులాట అన్నది మీ అనుమానం. లోక్ సభలో…