ప్రతిపక్ష నాయకుని సీటులో మోడి ఖర్చీఫ్ -కార్టూన్

లోక్ సభలో ప్రతిపక్ష నాయకత్వ హోదాను ఎవరికీ ఇవ్వకుండా నిరాకరించడం ద్వారా అనేక రాజ్యాంగ పదవులను ఏకపక్షంగా నియమించుకునే అవకాశాన్ని బి.జె.పి/ఎన్.డి.ఏ సొంతం చేసుకుంది. ప్రజాస్వామ్యం సారమే భిన్నాభిప్రాయానికి విలువ ఇచ్చి గౌరవించడం. ఈ సూత్రం ప్రకారమే అత్యున్నత రాజ్యాంగ పదవులైన లోక్ పాల్, సి.వి.సి, విజిలెన్స్ కమిషనర్ ల నియామకంలో లోక్ సభ ప్రతిపక్ష నేత అభిప్రాయానికి స్ధానం ఇచ్చారు. తద్వారా పాలకపక్షం ఏకపక్షంగా వ్యవహరించే అవకాశాన్ని కాస్త నిరోధించారు. ప్రతిపక్ష నాయకుని అభిప్రాయానికి స్ధానం…