సుప్రీం కోర్టులో పిటిషన్: తప్పిపోయిన పిల్లలు 55,000

55,000 మందికి పైగా పిల్లలు తప్పిపోయారనీ, వారిని వెతికి తల్లిదండ్రుల దగ్గరికి చేర్చడంలో కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలం అయ్యాయని పేర్కొంటూ సుప్రీం కోర్టులో ‘ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం’ (పబ్లిక్ ఇంటరెస్ట్ లిటిగేషన్ – పిల్) దాఖలయింది. తప్పిపోయిన పిల్లలందరిని వెతకండం కోసం కృషి చేయాలని కేంద్ర, రాష్ట్రాల ప్రభుత్వాలకు ఆదేశాలివ్వాలని అడ్వకేట్ సర్వ మిత్ర దాఖలు చేసిన పిటిషన్ కోరింది. “రాష్ట్రాల పోలీసు యంత్రాంగం తప్పిపోయిన పిల్లలను వెతికి పట్టుకోవడంలో విఫలం అయింది. ఫలితంగా…

రిలయన్స్ కంపెనీకి నేను మేలు చేయలేదు -కపిల్ సిబాల్ తొండాట

తనపై సుప్రీం కోర్టులో ఒక ఎన్.జి.ఒ సంస్ధ ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం దాఖలు చేసిన మరుసటి రోజు కేంద్ర టెలికం మంత్రి కపిల్ సిబాల్ స్పందించాడు. పత్రికా సమావేశం నిర్వహించి ఇచ్చిన వివరణలో కపిల్ సిబాల్ “ఆకుకూ అందక, పోకకూ పొందక” అన్నట్లు సమాధానాలిచ్చి తొండాట ఆడటానికి ప్రయత్నించాడు. రిలయన్స్ కమ్యూనికేషన్స్ కంపెనీ వినియోగదారులకు చెప్పకుండా నిర్ధిష్ట సేవలను ఆపేసినందుకుగాను డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ అధికారులు ఆ కంపెనీపై సర్కిల్ కి రు.50 కోట్ల చొప్పున మొత్తం…