పత్రికలకెక్కిన ఫేస్ బుక్ బూతులు, మహిళల తిరుగుబాటుతో క్షమాపణలు
గత రెండు మూడు రోజులుగా ఫేస్ బుక్ లో కొందరు మగరాయుళ్ళు మహిళలకు వ్యతిరేకంగా అసభ్య రాతలు రాస్తున్నారు. తెలుగు బ్లాగర్ తాడేపల్లి లలితా బాల సుబ్రమణ్యం మహిళలను తీవ్రంగా అవమానిస్తూ ప్రారంభించిన ఒక టాపిక్ కింద కొందరు పురుష పుంగవులు చేరి వీరంగం వేశారు. అసభ్య వ్యాఖ్యలు చేస్తూ మహిళల గుణ గణాలను కించపరిచారు. చిన్న వయసులోనే అమ్మాయిలు శారీరక కోర్కెల కోసం వెంపర్లాడుతున్నారని, అలాంటివారికి పెళ్లిళ్లు చెయ్యకుండా వాళ్ళ తల్లిదండ్రులు డిగ్రీలు, పోస్టు గ్రాడ్యుయేషన్లు…