భాష, సోషలిజం, ప్రజాస్వామ్యం – పరస్పర సంబంధాలు -2

కనపడేవీ, కనపడనివీ అన్నీ గ్రహించాలి వ్యవస్ధల మార్పులు మనిషి కంటికి కనపడే పరిధిలోనివి కావు. వ్యవసాయంలో ఒక పంట కాలం కొద్ది నెలలు ఉంటుంది. దుక్కు దున్నడం, నాట్లు వేయడం, పంటకు రావడం, కోత కోసి పంట అమ్ముడుబోయి డబ్బులు చేతికి రావడం వరకూ మన కళ్లెదుటే జరిగే పరిణామం. కనుక మనిషి విత్తుదశనుండి పంట చేతికి వచ్చేవరకు జరిగే పరిణామాలను గుర్తించగలుగుతాడు. అలాగే మనిషి పుట్టుక, పెరుదల, చదువు సంధ్యలు, పెళ్ళి, పునరుత్పత్తి, సంతానం సాకడం,…