పఠాన్ కోట్ దాడి: పాక్ తో చర్చలు నిలిపేస్తారా?

బి.జె.పి ప్రతిపక్షంలో ఉండగా ఎల్లప్పుడూ వ్యతిరేకించిన అంశం: పాక్ తో చర్చలు. సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే పాకిస్తాన్ తో చర్చలు ఎలా చేస్తారని బి.జె.పి ఎప్పుడూ అడుగుతూ ఉండేది. ఆగ్రహావేశాలు ప్రకటిస్తూ ఉండేది. పాక్ వ్యతిరేక భావోద్వేగాలు రెచ్చగొట్టేది. కేంద్ర ప్రభుత్వం చేతగానితనం అని తిట్టిపోసేది. ఇప్పుడు అదే పాకిస్తాన్ తో మిత్రత్వానికి ప్రధాని నరేంద్ర మోడి ప్రయత్నాలు మొదలు పెట్టారు. అది కూడా ‘అందరినీ ఆశ్చర్య చకితుల్ని చేసే’ ఆకస్మిక పాకిస్ధాన్ సందర్శన ద్వారా ‘పాక్…