అమెరికాలో పెరుగుతున్న అల్పాదాయ వర్గాలు -ప్యూ రీసర్చ్

2008 నాటి ప్రపంచ ఆర్ధిక సంక్షోభం తర్వాత అమెరికాలో అల్పాదాయ వర్గాల సంఖ్య బాగా పెరిగిందని ‘ప్యూ రీసర్చ్ సెంటర్’ అధ్యయనంలో తేలింది.  అమెరికా వినాశకర ఆర్ధిక, విదేశాంగ విధానాల ద్వారా ఉత్పన్నమయిన ప్రపంచ ఆర్ధిక సంక్షోభం తర్వాత అమెరికాలో సామాన్యుల ఆదాయాల్లో వచ్చిన మార్పులను ఈ అధ్యయనం రికార్డు చేసింది. ప్యూ అధ్యయనం ప్రకారం అమెరికాలో తమను తాము అల్పాదాయ తరగతికి చెందినవారిగా గుర్తించుకునేవారి సంఖ్య 2008 లో పోలిస్తే బాగా పెరిగింది. జనాభాలో ఇలా…

మిలట్రీకి ఎక్కువ, కాంగ్రెస్‌కి తక్కువ; సేనల ఉపసంహరణతో ఒబామా రాజకీయ క్రీడ

ఆఫ్ఘనిస్ధాన్‌లో దురాక్రమణ యుద్ధం కొనసాగిస్తున్న ఒక లక్షా ఒక వెయ్యి మంది అమెరికా సైనికుల్లో 33,000 మందిని 2012 సెప్టెంబరు మాసాంతంలోపు వెనక్కి రప్పిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు, అమెరికా త్రివిధ దళాల సర్వ సైన్యాధ్యక్ధుడు అయిన బారక్ ఒబామా బుధవారం ప్రకటించాడు. ఒబామా ప్రకటించిన ఉపసంహరణ సంఖ్య అమెరికాలోని వివిధ అధికార కేంద్రాలు ఒకే దృష్టితో చూడలేకపోవడం, భిన్న ధృవాలుగా చీలి ఉండడం గమనార్హమైన విషయం. 2012 చివర్లో మరోమారు అధ్యక్షుడిగా పోటీ చేయాలని భావిస్తున్న ఒబామా…