అమెరికా పౌరహక్కుల ‘రారాజు’ జనించి 86 యేళ్ళు! -ఫోటోలు

జాత్యహంకారానికి గురవుతున్న నల్లజాతి ప్రజలతో పాటు పెట్టుబడిదారీ పదఘట్టనల క్రింద నలుగుతున్న తెల్లజాతి కార్మికవర్గ హక్కుల కోసం, ఉద్యోగాల కోసం, గౌరవప్రదమైన జీవనం కోసం ఉద్యమించిన పౌరహక్కుల ఉద్యమ తరంగం మార్టిన్ లూధర్ కింగ్ జూనియర్! ఆయన జన్మించి జనవరి 15తో 86 సం.లు నిండాయి. వాషింగ్టన్ డి.సి లింకన్ హాలు ముందు మెట్లపై నిలబడి ఆయన చేసినచరిత్రాత్మక ‘ఐ హేవ్ ఎ డ్రీమ్’ ప్రసంగం ఇప్పటికీ అత్యంత ఉత్తేజకరమైన ప్రసంగాలలో ఉన్నతమైనదిగా కొనియాబడుతోంది. ఆధిపత్య వర్గాల…

స్త్రీలు కొన్ని పరిమితుల్లో ఉండాలి -ఢిల్లీ పోలీసు కమిషనర్

ఆడవాళ్ళకు సుద్దులు చెప్పేవారి క్లబ్బులో మరో ఉన్నతాధికారి సభ్యత్వం తీసుకున్నాడు. ఢిల్లీ పోలీస్ కమిషనర్ బి.కె.గుప్తా శనివారం ఆడవాళ్ళు ఏ సమయాల్లో బైటికి రావాలో, ఏ సమయాల్లో బైటికి రాకూడదో, బైటికి వచ్చేటప్పుడు ఎవరిని వెంటబెట్టుకుని రావాలో కూడా ఆయన తెలిపాడు. తద్వారా సమాజం స్త్రీలు స్వేచ్ఛగా బైటికి రావడానికి అంగీకరించే పరిస్ధితిలో లేదని మరొక సారి రుజువు చేశాడు. “ఆడవాళ్ళు ఏ సమయంలోనైనా బైటికి రావచ్చు. అది వారి ప్రాధమిక హక్కు. వారి హక్కును కాపాడ్డం…