మోడి: జపాన్ షరతులతో అణు ఒప్పందం వాయిదా

భారత ప్రధాని నరేంద్ర మోడి జపాన్ పర్యటనలో ఇండియా-జపాన్ ల మధ్య చరిత్రాత్మక అణు ఒప్పందం ఆమోదం పొందుతుందని పలువురు భావించారు. అందుకే ప్రపంచ అణు పరిశ్రమతో వివిధ రకాలుగా సంబంధం ఉన్నవారందరూ మోడి పర్యటనను ఆసక్తిగా, ఆశగా, భయంగా, ఆందోళనగా తిలకించారు. చివరికి ఒప్పందం కుదరకపోవడంతో పరిశ్రమ వర్గాలు తమ తమ స్ధానాలను బట్టి అనుకూలంగానూ, వ్యతిరేకంగానూ నిట్టూర్చగా ప్రజల తరపున ఆలోచించేవారు ‘పోనీలెమ్మ’ని ఊపిరి పీల్చుకున్నారు. ఒప్పందం కుదరకపోవడానికి కారణం జపాన్ విధించిన విషమ…

అమెరికాకు చట్టవిరుద్ధ రాయితీ ఇవ్వడానికి ప్రధాని రెడీ?

భారత పార్లమెంటు విస్తృతంగా చర్చించి ఆమోదించిన ‘న్యూక్లియర్ లయబిలిటీ’ చట్టానికి విరుద్ధంగా అమెరికా అణు కంపెనీలకు రాయితీలు ఇవ్వడానికి ప్రధాని మన్మోహన్ సిద్ధపడినట్లు తెలుస్తోంది. ఒబామా ప్రభుత్వం నుండి తీవ్ర ఒత్తిడి ఎదుర్కొంటున్న మన్మోహన్, అమెరికా కంపెనీలు సరఫరా చేయనున్న అణు పరికరాలు నాసిరకం అయినప్పటికీ, వాటివల్ల ప్రమాదం జరిగినప్పటికీ నష్టపరిహారం చెల్లించే అవసరం లేకుండా రాయితీ ఇచ్చేవైపుగా అడుగులు వేస్తున్నట్లు ‘ది హిందు’ పత్రిక తెలిపింది. ఇందుకోసం భారత ప్రభుత్వ అటార్నీ జనరల్ జి.ఇ.వాహనవతి అమెరికాకు…

ఇండియా అణుపరిహార చట్టం అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా లేదు -అమెరికా

గత సంవత్సరం భారత పార్లమెంటు ఆమోదించిన “అణు ప్రమాద నష్టపరిహార చట్టం” అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా లేదని అమెరికా పెదవి విరిచింది. అంతర్జాతీయ ప్రమాణంగా చెబుతున్న “కన్వెన్షన్ ఆన్ సప్లిమెంటరీ కాంపెన్సేషన్” (సి.ఎస్.సి) కు అనుగుణంగా భారత చట్టం లేదనీ, ఈ విషయంలో ఇండియా తన నిర్ణయాలను స్పష్టం చేయడానికి ఐ.ఎ.ఇ.ఎ ను వేదికగా ఎంచుకోవాలని అమెరికా హిత బోధ చేసింది. మూడేళ్ళ క్రితం అమెరికా భారత్ ల మధ్య “పౌర అణు ఒప్పందం” కుదిరింది. ఇందిరాగాంధి…

అమెరికా ఇండియావైపు మొగ్గడం సమ్మతం కాదు -పాక్ ప్రధాని

దక్షిణాసియాలో అమెరికా పాకిస్ధాన్‌ను విస్మరించి ఇండియావైపు ముగ్గు చూపడం తమకు సమ్మతం కాదని పాక్ ప్రధాని యూసఫ్ రజా గిలానీ పేర్కొన్నాడు. రాయిటర్స్ సంస్ధకు ఇంటర్వ్యూ ఇస్తూ ఆయన ప్రచ్ఛన్న యుద్ధం కాలమంతా అమెరికా, పాకిస్ధాన్ లు మిత్రులుగా మెలిగిన సంగతిని గుర్తు చేశాడు. అలాంటిది అమెరికా పాకిస్ధాన్ ను వదిలిపెట్టి ఇండియాతో పౌర అణు ఒప్పందం కుదుర్చుకోవడం అమెరికాకి మేలు చేయగల చర్య కాదని గిలాని అభిప్రాయం వ్యక్తం చేశాడు. గత ఐదు సంవత్సరాలుగా అమెరికా…

పార్లమెంటు విశ్వాస పరీక్షలో ‘ఓటుకు నోట్లు’ కేసు దర్యాప్తుపై సుప్రీం కోర్టు ఆగ్రహం

2008 సంవత్సరంలో పార్లమెంటు విశ్వాసం పొందడం కోసం యు.పి.ఎ – 1 ప్రభుత్వం డబ్బులిచ్చి ప్రతిపక్షాల ఓట్లు కొన్న కేసులో దర్యాప్తు కొనసాగుతున్న తీరు పట్ల సుప్రీం కోర్టు శుక్రవారం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. రెండు సంవత్సరాల నుండి కేసు విచారణలో పురోగతి లేకపోవడంతో ఢిల్లీ పోలీసుల పనితీరుపై అసహనం వ్యక్తం చేసింది. “ఢిల్లీ పోలీసులు చేసిన దర్యాప్తు పట్ల మేము ఏ మాత్రం సంతోషంగా లేము. ఇటువంటి తీవ్రమైన నేరంతో కూడిన అంశంలో, నేరం…

“పౌర అణు ఒప్పందం” విషయంలో అమెరికా, ఇండియాను మోసగించనున్నదా?

2008 సంవత్సరంలో అమెరికా, ఇండియాలు “పౌర అణు ఒప్పందం” పై సంతకాలు చేశాయి. ఆ ఒప్పందం ద్వారా అప్పటివరకు అణు విషయాల్లో ప్రపంచంలో ఏకాకిగా ఉన్న ఇండియా అణు వ్యాపారంలో భాగస్వామ్యం పొందడానికి అమెరికా వీలు కల్పించిందని అంతర్జాతీయ కార్పొరేట్ పత్రికా సంస్ధలు వార్తలు రాశాయి. అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక ఒప్పందంపై ఇండియా సంతకం చేయనప్పటికీ అణు వ్యాపారం చేయడానికి ఇండియాకి అవసరమైన అణు పరికరాలు అమ్మడానికీ మినహాయింపు లభించిందని నిపుణులు వ్యాఖ్యానించారు. ఇది అరుదైన విషయమనీ…