పోషక లోపం: ప్రపంచంలో 25% ఇండియాలోనే

ప్రపంచవ్యాపితంగా పోషకాహార లోపంతో బాధపడుతున్నవారు 100 మంది ఉంటే అందులో 25 మంది భారత దేశంలోనే ఉన్నారు. ఐక్యరాజ్యసమితి ఆహార మరియు వ్యవసాయ సంస్ధ (UNFAO) నివేదిక తెలిపింది. ఈ రోజు వెలువడిన నివేదిక ప్రకారం ప్రపంచంలో పోషకాహార లోపంతో బాధపడుతున్నవారి సంఖ్య అత్యధికంగా ఇండియాలోనే ఉన్నారు. ఇండియా తర్వాత స్ధానంలో జి.డి.పిలో అమెరికాతో పోటీ పడుతున్న చైనా నిలవడం గమనార్హం. 21వ దశాబ్దం ఆరంభంలో ఇండియా, చైనాలు సాధించిన వేగవంతమైన జి.డి.పి వృద్ధి ఆ దేశాల్లో…

గుజరాత్ అభివృద్ధి కధ: అబద్ధాలూ, వాస్తవాలూ -2

(మొదటి భాగం తరువాయి…) వేతనాలు ఉద్యోగాలు ఇవ్వడం లేదా, వేతనాలు ఇవ్వడం లేదా అన్న ప్రశ్న వస్తుంది. ఆ విషయం చూద్దాం. ప్రొఫెసర్ డాక్టర్. ఇందిరా హిర్వే, అహ్మదా బాద్ లోని ‘సెంటర్ ఫర్ డెవలప్ మెంట్ ఆల్టర్నేటివ్స్’ సంస్ధకు డైరెక్టర్ గా పని చేస్తోంది. సెప్టెంబర్ 27 న ‘ది హిందూ’ లో రాసిన ఆర్టికల్ లో గుజరాత్ అభివృద్ధి గురించి ఆమె చర్చించారు. గుజరాత్ లోని గ్రామాల్లో, పట్టణాల్లో వివిధ రంగాల్లో పని చేస్తున్న…

గుజరాత్ అభివృద్ధి కధ: అబద్ధాలూ, వాస్తవాలూ -1

నరేంద్ర మోడీ నేతృత్వంలో గుజరాత్ అభివృద్ధి పధంలో దూసుకుపోతున్నదంటూ ఊదరగొట్టడం భారత దేశ కార్పొరేట్ పత్రికలకు కొంతకాలంగా రివాజుగా మారింది. ‘వైబ్రంట్ గుజరాత్’ గా నరేంద్రమోడీ చేసుకుంటున్న ప్రచారానికి పత్రికలు యధాశక్తి అండదండలు ఇస్తున్నాయి. బ.జె.పి నాయకులు, కార్యకర్తలు ఈ ఊకదంపుడు కధనాలను చెప్పుకుని ఉబ్బితబ్బిబ్బు అవుతుంటే, కాంగ్రెస్ నాయకులేమో వాటిని ఖండించి వాస్తవాలు చెప్పేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ రెండు పార్టీల వాదనలన్నీ జి.డి.పి వృద్ధి రేటు, తలసరి ఆదాయం, పారిశ్రామిక వృద్ధి… వీటి చుట్టూనే తిరుగుతున్నాయి…

తిండిలేక చనిపోతున్న యెమెన్ పిల్లలు సం.కి 34,000 -ఫొటోలు

యెమెన్ దేశంలో అత్యధిక శాతం పిల్లలు పోషకాహారం లేక చనిపోతున్నారు. ఐదేళ్లలోపు పిల్లల్లో 58 శాతం మంది తీవ్రమైన పోషకాహార లోపంతో బాధపడుతుండగా, 46 శాతం మంది తక్కువ బరువుతో తీసుకుంటున్నారని యునిసెఫ్ ప్రకటించింది. ఐదేళ్లలోపే చనిపోతున్న పిల్లల్లో 60 శాతం మంది పోషకాహార లోపం వల్లనే చనిపోతున్నారని ఆ సంస్ధ తెలిపింది. ఫలితంగా యెమెన్ లో పోషకార లోపం వల్ల ప్రతి సంవత్సరం 34,000 మంది చనిపోతున్నారని ఆందోళన వ్యక్తం చేసింది. పోషకాహార లోపం వల్ల…