నయాగరా జలపాతమే గడ్డకట్టిన కాలం… -ఫోటోలు

ప్రపంచంలో అత్యంత ఎత్తైన జలపాతం నయాగరా అని మనకి తెలిసిందే. గుర్రపు డెక్క ఆకారంలో ఉండే ఈ భారీ జలపాతం నిత్యం సందర్శకులను ఆకర్షిస్తూ ఎల్లప్పుడూ రద్దీగా ఉంటుంది. ఫొటోల్లో చూస్తేనే గుండెలు గుభిల్లుమానిపించే ఈ జలపాతం గడ్డ కడితే?! పోలార్ వొర్టెక్స్ పుణ్యమాని అటువంటి అరుదైన ప్రకృతి దృశ్యం మనిషి కళ్ల ముందు ఆవిష్కృతం అయింది. అమెరికా, కెనడాల సరిహద్దులో విస్తరించి ఉండే నయాగరా జలపాతం వద్ద చరిత్రలో అత్యంత కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో…

పోలార్ వర్టెక్స్ అంటే?

పోలార్ వర్టెక్స్ వలన అమెరికాలో అత్యంత కనిష్ట స్ధాయికి ఉష్ణోగ్రతలు పడిపోయాయి. దానితో అక్కడ ప్రజా జీవనం దాదాపు స్తంభించిపోయింది. -56 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు పడిపోయాయని పత్రికలు చెబుతున్నాయి. ది హిందూ పత్రిక ఈ ఉష్ణోగ్రతలను సెంటీ గ్రేడ్ లలో చెప్పగా రష్యా టుడే ఫారెన్ హీట్ లలో తెలిపింది. –50o C వరకు కనిష్ట ఉష్ణోగ్రత నమోదయిందని ది హిందూ తెలిపింది. రష్యా టుడే మాత్రం 56o F కనిష్ట ఉష్ణోగ్రత నమోదయినట్లు తెలిపింది.…

పోలార్ వొర్టెక్స్: అమెరికాపై చలి పులి పంజా

అమెరికా ప్రస్తుతం ‘పోలార్ వొర్టెక్స్’ చలి కౌగిలిలో వణికిపోతోంది. మధ్య పశ్చిమ (Midwest) అమెరికా రాష్ట్రాల నుండి ఈశాన్య రాష్ట్రాల వరకు ఆర్కిటిక్ చలిగాలులు వీస్తుండడంతో ఉష్ణోగ్రతలు భారీగా పడిపోతున్నాయి. కొన్ని చోట్ల ఉష్ణోగ్రత -52o C వరకు నమోదయిందని పత్రికల ద్వారా తెలుస్తోంది. న్యూయార్క్, మిన్నెసోటా లాంటి రాష్ట్రాల్లో స్కూళ్లకు సెలవులు ప్రకటించారు. అవసరం అయితే తప్ప రోడ్ల మీదికి రావద్దని ప్రభుత్వాలు కోరాయి. తీవ్ర చలిగాలులు ఉన్న చోట బైటికి వెళితే తెలియకుండానే గడ్డకట్టుకుని…