ప్రమాద దశకు యూరప్ అప్పు సంక్షోభం, ఇటలి అప్పు సంక్షోభంపై ఎమర్జెన్సీ సమావేశం?
యూరప్ అప్పు సంక్షోభం ప్రమాద దశకు చేరుకున్నట్లు కనిపిస్తోంది. యూరోపియన్ యూనియన్ దేశాల్లో మూడవ అతి పెద్ద ఆర్ధిక వ్యవస్ధను కలిగి ఉన్న ఇటలీ అప్పు గురించి చర్చించడానికి యూరోపియన్ కౌన్సిల్ అధ్యక్షుడు హెర్మన్ వాన్ రోంపీ సోమవారం ఉన్నతాధికారుల అత్యవసర సమావేశం ఏర్పాటు చేశాడు. రోంపి ప్రతినిధి సోమవారం నాటి సమావేశంలో ఇటలి గురించి చర్చించడం లేదని చెబుతున్నప్పటికీ యూరోపియన్ సెంట్రల్ బ్యాంకు అధికారులు ఇద్దరు ఇటలీ గురించి చర్చించడానికే సమావేశమని చెప్పినట్లుగా రాయిటర్స్ వార్తా…