భారత అణుప్రమాద పరిహార చట్టం ఐ.ఎ.ఇ.ఎ నిబంధనలకు లోబడాలి, అమెరికా కొత్త మెలిక

అమెరికా సెక్రటరీ ఆఫ్ స్టేట్ హిల్లరీ క్లింటన్ ప్రస్తుతం భారత పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. భారత్, అమెరికాల పౌర అణు ఒప్పందంతో పాటు వ్యూహాత్మక భాగస్వామ్య ఒప్పందం అమలు దిశలో మలి దశగా ఈ పర్యటనను పత్రికలు గత కొన్ని రోజులుగా పేర్కొంటూ వచ్చాయి. అమెరికా, భారత్‌కు అణు రియాక్టర్‌లు, అణు పదార్ధం (శుద్ధి చేయబడిన యురేనియం) సరఫరా చేయడానికి అమెరికా తాజాగా మరొక మెలిక పెట్టింది. భారత పార్లమెంటు ఆమోదించిన ‘అణు ప్రమాద పరిహార…