ప్రపంచ ఆర్ధిక వ్యవస్ధకు ఐరోపాయే పెద్ద ప్రమాదం -ఒ.ఇ.సి.డి

ఒ.ఇ.సి.డి = ఆర్గనైజేషన్ ఫర్ ఎకనమిక్ కో-ఆపరేషన్ అండ్ డవలప్ మెంట్ ఒ.ఇ.సి.డి అర్ధ వార్షిక సమావేశాలు బుధవారం పారిస్ లో జరిగాయి. ప్రపంచ ఆర్ధిక వ్యవస్ధకు ఐరోపా పెద్ద ప్రమాదంగా పరిణమించిందని ఈ సమావేశాల్లో సంస్ధ సమీక్షించింది. 34 ధనిక దేశాల కూటమిలో 24 దేశాలు ఐరోపాకి చెందినవే కావడం గమనార్హం. ఐరోపా ఆర్ధిక బలహీనత మరింత కాలం కొనసాగితే అది ఆర్ధిక స్తంభనకు దారి తీసి మొత్తం ప్రపంచ ఆర్ధిక వ్యవస్ధకే ముప్పుగా పరిణమిస్తుందని…

పొదుపు విధానాలకు తిరస్కరణ, ఇటలీలో హంగ్ పార్లమెంటు

ఐ.ఎం.ఎఫ్, యూరోపియన్ యూనియన్, యూరోపియన్ సెంట్రల్ బ్యాంకులు బలవంతంగా అమలు చేస్తున్న పొదుపు ఆర్ధిక విధానాలను తిరస్కరిస్తూ ఇటలీ ఓటర్లు తీర్పు చెప్పారు. ఆది, సోమ వారాల్లో జరిగిన ఓటింగ్ ఫలితాలు ఏ పార్టీకి మెజారిటీ ఇవ్వలేదు. కనీసం కూటములు కూడా స్పష్టమైన మెజారిటీ సాధించలేకపోయాయి. యూరోపియన్ మానిటరీ యూనియన్ (యూరోజోన్) నుండి వైదొలగాలని ప్రచారం చేసిన కొత్త పార్టీకి మొదటి ప్రయత్నంలోనే పెద్ద ఎత్తున ఓట్లను కట్టబెట్టి ఇటలీ ప్రజలు తమ ఉద్దేశాలు చాటారు. సెంటర్-లెఫ్ట్…

పొదుపు విధానాలపై ఆందోళనలతో అట్టుడుకుతున్న యూరప్ -ఫోటోలు

గత రెండున్నర సంవత్సరాలుగా యూరోపియన్ దేశాలు అమలు చేస్తున్న పొదుపు ఆర్ధిక విధానాలు దాదాపు అన్నివర్గాల ప్రజలను వీధుల్లోకి తెస్తున్నాయి. ప్రభుత్వరంగ పరిశ్రమల ప్రవేటీకరణ వల్ల లక్షలాది ఉద్యోగాలు రద్దవుతున్నాయి. ఉద్యోగుల వేతనాల్లో భారీగా కోత విధించారు. పెన్షన్లను కూడా వదలకుండా దోచుకుంటున్నారు. వేతనాలు కోత పెట్టడమే కాకుండా ఉద్యోగులు, కార్మికుల సంక్షేమ సదుపాయాలను కూడా రద్దు చేస్తున్నారు. దానితో ఆరోగ్య భద్రత కరువై వైద్య ఖర్చులు తడిసి మోపెడవుతున్నాయి. ఒకవైపు వేతనాలు తగ్గిస్తూ మరోవైపు పన్నులు…

మరోసారి క్షీణించిన జి.డి.పి, తీవ్ర రిసెషన్ లో బ్రిటన్

వరుసగా మూడో క్వార్టర్ లో కూడా బ్రిటన్ స్ధూల దేశీయోత్పత్తి (జి.డి.పి) పడిపోయింది. గత సంవత్సరం చివరి క్వార్టర్ (అక్టోబర్, నవంబర్, డిసెంబర్) లో ప్రారంభం అయిన బ్రిటన్ జి.డి.పి పతనం ఈ సంవత్సరం మొదటి క్వార్టర్ (జనవరి, ఫిబ్రవరి, మార్చి) లో కూడా కొనసాగడంతో బ్రిటన్ అధికారికంగా రిసెషన్ (మాంద్యం) లోకి జారుకున్నట్లయింది. ఈ పతనం వరుసగా ఈ సంవత్సరం రెండో క్వార్టర్ లో కొనసాగి మునుపటి కంటే ఎక్కువగా నెగిటివ్ జి.డి.పి వృద్ధి నమోదు…

క్లుప్తంగా… 26.04.2012

అంతర్జాతీయం హెచ్.ఎస్.బి.సి బ్యాంకు యు.కె శాఖల్లో 2,200 ఉద్యోగాలు రద్దు ఇంగ్లాండులో హెచ్.ఎస్.బి.సి బ్యాంకు మరో 2,200 ఉద్యోగాలు రద్దు చేసింది. వాస్తవంగా రద్దు చేసినవి 3,100 ఉద్యోగాలు కాగా, కొత్తగా ఇచ్చిన ఉద్యోగాలు పోను నికరంగా 2,217 ఉద్యోగాలు రద్దు చేసినట్లయింది. ఖర్చు తగ్గించుకునే చర్యల్లో భాగంగా ఉద్యోగాలు రద్దు చేస్తున్నట్లు బ్యాంకు ప్రకటించింది. హెచ్.ఎస్.బి.సి గత సంవత్సరం 7,000 ఉద్యోగాలు రద్దు చేసింది. 2013 లోపు ప్రపంచ వ్యాపితంగా 30,000 ఉద్యోగాలు రద్దు చేస్తానని…

‘డబుల్ డిప్ రిసెషన్’ లో ఇంగ్లండ్

ఇంగ్లండ్ ‘డబుల్ డీప్ రిసెషన్’ లోకి జారుకుంది. 2012 లో మొదటి క్వార్టర్ (జనవరి, ఫిబ్రవరి, మార్చి) లో బ్రిటన్ జి.డి.పి (గ్రాస్ డోమెస్టిక్ ప్రోడక్ట్) 0.2 శాతం మేరకు కుదించుకుపోయింది. అంటే జి.డి.పి వృద్ధి చెందడానికి బదులు తగ్గిపోయింది. 2011 చివరి క్వార్టర్ లో (అక్టోబరు, నవంబరు, డిసెంబరు) ఇంగ్లండ్ జి.డి.పి 0.3 శాతం క్షీణించింది. వరుసగా రెండు క్వార్టర్ల పాటు నెగిటివ్ జి.డి.పి వృద్ధి నమోదయితే ఆ దేశం మాంద్యం (రిసెషన్) లో ఉన్నట్లు…

ఫ్రాన్సు మొదటి రౌండ్ ఎన్నికల్లో అధ్యక్షుడు సర్కోజీకి రెండవ స్ధానం

ఫ్రాన్సు అధ్యక్షుడు నికోలస్ సర్కోజీ మొదటి రౌండ్ ఎన్నికల్లో రెండవ స్ధానంతో సరిపెట్టుకున్నాడు. సోషలిస్టు పార్టీ అభ్యర్ధి ఫ్రాంకోయిస్ హాలండే మొదటి స్ధానం చేజిక్కించుకున్నాడు. హాలండే కి 28 శాతం ఓట్లు రాగా, సర్కోజీకి 26 శాతం ఓట్లు వచ్చాయని బి.బి.సి తెలిపింది. అయితే హాలండే కి 28.63 శాతం ఓట్లు, సర్కోజీకి 27.18 ఓట్లు వచ్చాయని ‘ది హిందూ’ తెలిపింది. తీవ్ర మితవాది (far right) గా పత్రికలు అభివర్ణిస్తున్న మేరీన్ లీ పెన్ (నేషనల్…

Ban on citizenship education

స్పెయిన్ లో ‘చదువు’ కి సంకెళ్ళు -వీధి చిత్రం

స్పెయిన్ లో కొత్తగా ఎన్నికయిన కన్జర్వేటివ్ పార్టీల ప్రభుత్వం విద్యార్ధుల ‘చదువు’ కి సంకెళ్లు వేయడం ద్వారా చైతన్యాన్ని అరికట్టాలని చూస్తోంది. అప్పులు చేసి కంపెనీలకి ఇచ్చిన బెయిలౌట్లను ప్రజలనుండి వసూలు చేయడానికి దుర్మార్గమైన పొదుపు ఆర్ధిక విధానాలు అమలు చేస్తుండడంతో స్పెయిన్ ఆందోళనలతో అట్టుడుకుతోంది. కార్మికులు, ఉద్యోగుల వేతనాల రూపంలో ప్రజలపై పెడుతున్న ఖర్చులో అక్కడి ప్రభుత్వం ఏకంగా 27 బిలియన్ యూరోలు (36 బిలియన్ డాలర్లు) కోతపెడుతూ రెండు రోజుల క్రితమే బడ్జెట్ ఆమోదించింది.…

బ్రిటన్‌ యువతలో పెరుగుతున్న నిరుద్యోగం, అల్లర్లకు అదే కారణం

బ్రిటన్ ప్రభుత్వం వెల్లడించిన గణాంకాల ప్రకారం అక్కడ నిరుద్యోగం భూతం జడలు విప్పింది. ప్రభుత్వరంగం ఉద్యోగులను తొలగిస్తుండంతో పాటు ప్రవేటు రంగ ఉత్పత్తి స్తంభించిపోవడంతో నిరుద్యోగం పెరుగుతున్నదని భావిస్తున్నారు. లండన్ తో పాటు ఇతర నగరల్లోని పేద కుటుంబాల యువకులు కొద్ది రోజుల క్రితం పెద్ద ఎత్తున అల్లర్లకు పాల్పడిన నేపధ్యంలో వెలువడిన ఈ వివరాలు అల్లర్లకు కారణమేమిటో చెప్పకనే చెపుతున్నాయి. రాజకీయ నాయకులు, కార్పొరేట్ మీడియా కూడబలుక్కుని అల్లర్లకు, నిరుద్యోగం కారణం కాదంటూ నమ్మబలుకుతున్నప్పటికీ వాస్తవాలు…

స్పెయిన్ రుణ సంక్షోభం, పొదుపు చర్యలకు బలౌతున్న జనం -కార్టూన్

యూరో జోన్ లో (యూరోను కరెన్సీగా అంగీకరించిన యూరప్ దేశాలు) రుణ సంక్షోభంలో ఉన్న దేశాల్లో స్పెయిన్ ఒకటి. సంక్షోభాన్ని ఎదుర్కొనే పేరుతో అక్కడి ప్రభుత్వం ప్రజలపై పొదుపు బడ్జెట్ నీ, పొదుపు ఆర్ధిక విధానాలనీ ప్రజలపై రుద్ధుతోంది. ఇప్పటికే సగం చచ్చి ఉన్న కార్మికులు, ఉద్యోగులపై మరిన్ని కోతలు, రద్దులు ప్రకటించడంతో వారి కొనుగోలు శక్తి బాగా పడిపోయింది. బ్యాంకులు, కంపెనీలకు పన్నుల రాయితీలు కొనసాగిస్తూ, వీలతై మరిన్ని రాయితీలిస్తూ, ప్రజలపైన పన్నులు బాదుతున్నారు. ఇది…

ఇ.యు, ఐ.ఎం.ఎఫ్ లు గ్రీసు ప్రజలపై రుద్దుతున్న పొదుపు చర్యలు ఇవే

గత బుధవారం ఇ.యు, ఐ.ఎం.ఎఫ్ లు గ్రీసుకు రెండవ బెయిలౌట్ ప్యాకేజి ఇవ్వడానికి అంగీకారం కుదిరినట్లు ప్రకటించాయి. అందుకు ప్రతిగా గ్రీసు కఠినమైన పొదుపు విధానాలను అమలు చేయాల్సిందేనని షరతు విధించాయి. తాను అమలు చేయనున్న పొదుపు చర్యలను గ్రీసు ఇప్పటికే సిద్ధం చేసుకుంది. వీటిని రానున్న బుధ, గురువారాల్లో గ్రీసు పార్లమెంటు ఆమోదించాలి. ఐతే ఐర్లండు, పోర్చుగల్ దేశాల మాదిరిగా గ్రీసు ప్రతిపక్షాలు ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న పొదుపు చర్యలకు మద్దతు ఇవ్వడానికి నిరాకరించాయి. ప్రతిపక్షాలే కాదు,…