పొగాకు లాబీకి లొంగి కేంద్ర మంత్రి తొలగింపు?

విదేశీ కంపెనీల లాభాలు పడిపోకుండా ఉండడానికీ, వీలయితే ఇంకా ఇంకా పెంచడానికీ స్వదేశీ భాజపా మంత్రుల పాట్లు అన్నీ ఇన్నీ కాకుండా పోతున్నాయి. ‘ఊరంతా ఒకదారయితే ఉలిపిరి కట్టెది మరోదారి’ అన్నట్లుగా కేంద్ర మంత్రులు ప్రకటనలు చేస్తూ తమ బుద్ధి మాంద్యాన్ని చాటుకుంటున్నారు. కాగా పొగాకు లాబీకి లొంగి ప్రధాని నరేంద్ర మోడి ఆరోగ్య మంత్రిగా హర్షవర్ధన్ ను తప్పించారని ప్రతిపక్షాలు ఆరోపించడం ప్రజలు గమనించవలసిన విషయం. లేకపోతే ధూమపానం వల్ల/సిగరెట్ తాగడం వల్ల ఆరోగ్యానికి హాని…