చిన్న శవపేటికలను పూడ్చడమూ కష్టమే!

“అతి చిన్న శవపేటికలు అత్యంత బరువైనవి” అంటూ తాలిబాన్ పైశాచిక హత్యాకాండను పాక్ ప్రజలు నిరసించారు. “చిన్న శవ పేటికలను పూడ్చడం చాలా కష్టమయింది” అని సమాధుల తవ్వకం దారు తాజ్ ముహమ్మద్ గాద్కదిక స్వరంతో, దుఃఖాన్ని ఆపుకుంటూ చెప్పాడు. పెషావర్ లోని అతి పెద్ద శ్మశాన వాటికలో సమాధులను తవ్వేవారిలో తాజ్ ముహమ్మద్ ఒకరు. ముస్లిం సంప్రదాయాల ప్రకారం శవాలను సాధ్యమైనంత త్వరగా పూడ్చిపెట్టాలి. దానితో డిసెంబర్ 16 తేదీన అమానుష రీతిలో దాడి జరగగా…

ఉగ్రవాదానికి పాక్ విరుగుడు మరణ శిక్షలు! -కార్టూన్

పాక్ ప్రధాని: “నేను మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను- మరణ దండనపై నిషేధాన్ని ఎత్తివేశామని…” ********* పెషావర్ ఉగ్ర దాడిలో 130 మందికి పైగా స్కూల్ పిల్లలు మరణించిన దరిమిలా ఉగ్రవాదంపై కత్తి కడుతున్నట్లు చూపడానికి అక్కడి ప్రభుత్వం చర్యలు ప్రకటిస్తోంది. అందులో మొదటిది మరణ శిక్షలు! ఉగ్రవాదులకు మరణ దండన విధిస్తామనడం ఒక విధంగా హాస్యాస్పదం. ఉగ్రవాదులే చావడానికి నిర్ణయించుకుని వచ్చి దాడులు చేస్తుంటే వారికి మరణ దండన వేస్తామంటే జడిసిపోతారా? ఉదాహరణకి పెషావర్ దాడినే తీసుకుంటే దాడి…

తాలిబాన్ తుపాకి శిక్షణ టార్గెట్లు: పూలు! -కార్టూన్

లేలేత ప్రాయపు చిన్న పిల్లలు సున్నిత శరీరాలను కలిగి ఉంటారు. వారి అవయవాలు తేలికగా వంగిపోయే విధంగా ఉంటాయి. ఈ కారణం తోనే చిన్న పిల్లలను పూలతో పోల్చడం కద్దు. పూల రెమ్మలు ఎంత మెత్తగా, సున్నితంగా ఉంటాయో చిన్న పిల్లల శరీరాలు, హృదయాలు కూడా అంతే మెత్తగా, సున్నితంగా ఉంటాయి. పెషావర్ లో ఆర్మీ పబ్లిక్ స్కూల్ పై పాకిస్తాన్ తాలిబాన్ చేసిన పైశాచిక దాడి నేపధ్యంలో కార్టూనిస్టు తాలిబాన్ స్వభావాన్ని ఈ విధంగా సున్నితంగా…