కుల రాజకీయ చెదలు పట్టిన సృజన -కార్టూన్

తమిళనాట కులాల కార్చిచ్చు రగిలి సమస్త సామాజిక గతిని నమిలి పారేస్తోంది. ముఖ్యంగా సమాజ ప్రగతికి దోహదం చేసే సృజనాత్మక రచనలను అది దహించివేస్తోంది. కాలకూట విషం కక్కుతూ అటు ప్రజా జీవనాన్ని అల్లకల్లోలం చేస్తూ ఇటు రాజకీయ చైతన్యాన్ని మొద్దుబార్చుతోంది. ప్రఖ్యాత రచయిత పెరుమాళ్ మురుగన్ తాను రచయితగా చచ్చిపోయానని, రచనలన్నింటిని ఉపసంహరించుకుంటున్నానని, ఇక రచనలు చేయబోనని ప్రకటించడం ఈ ఒరవడిలో జరిగిన పరిణామమే. మురుగన్ నాలుగు సంవత్సరాల క్రితం రాసిన మధోరుబాగన్ నవల ఇటీవల…